Home
News

8GB RAM, 16MP సెల్ఫీ కెమెరా మోటోరోలా ఫోన్, ఇప్పుడు రూ.12,349 కే! ఆఫర్ వివరాలు

మోటోరోలా నుంచి Moto G64 5G ఫోన్ అద్భుతమైన డిజైన్, 16GB RAM, 6000mAh బ్యాటరీ, Full HD+ డిస్‌ప్లే, డ్యూయల్ రియర్ కెమెరా మరియు మరిన్నింటితో ఫ్లిప్‌కార్ట్ సేల్ ఇప్పుడు నమ్మశక్యం కాని భారీ డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉంది.

ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 OS, క్వాడ్ పిక్సెల్ టెక్నాలజీ, టర్బో ఛార్జింగ్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ వంటి ఇతర ఫీచర్లను కూడా కలిగి ఉంది. ఈ Moto G64 5G ఫోన్ యొక్క పూర్తి ఫీచర్లు, ధర మరియు తక్షణ తగ్గింపు ఆఫర్ వివరాలను, స్పెసిఫికేషన్లను ఇప్పుడు చూద్దాం.

Huge Discount Of 22 percent On Motorola G64 5G Smartphones In Flipkart Sale

Moto G64 5G స్పెసిఫికేషన్‌ల వివరాలు: ఈ మోటోరోలా ఫోన్ 50 MP ప్రధాన కెమెరా + 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్‌తో వస్తుంది. ఈ కెమెరాలో క్వాడ్ పిక్సెల్ టెక్నాలజీ అందించబడింది.

ఇది OIS టెక్నాలజీ తో 1080p వీడియో రికార్డింగ్ మద్దతుతో కూడా వస్తుంది. నైట్ విజన్ , డ్యూయల్ క్యాప్చర్ , పోర్ట్రెయిట్ ఫీచర్లు ఉన్నాయి. మోటో G64 ఫోన్లో 16MP సెల్ఫీ షూటర్‌తో వస్తుంది. ఈ కెమెరా అల్ట్రా పిక్సెల్ టెక్నాలజీతో వస్తుంది. ఇందులో, ఆటో స్మైల్ క్యాప్చర్‌కు మద్దతు ఉంది. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణతో 6.5-అంగుళాల (2400 × 1080 పిక్సెల్‌లు) డిస్‌ప్లేతో వస్తుంది. ఇది FullHD+ రిజల్యూషన్‌తో కూడిన LCD డిస్‌ప్లే కలిగి ఉంది.

అలాగే, ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ మరియు 560 nits పీక్ బ్రైట్‌నెస్‌ని కలిగి ఉంది. కాబట్టి బడ్జెట్‌లో కూడా మధ్య శ్రేణి నాణ్యతను ఆశించండి. ఈ మోటో ఫోన్ ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7025 6nm చిప్‌సెట్‌తో వస్తుంది.

మధ్య-శ్రేణి పనితీరుతో IMG BXM 8 256 GPU గ్రాఫిక్స్ కార్డ్ ను గేమింగ్ ఔత్సాహికులకు అందిస్తుంది. ఆండ్రాయిడ్ 14 OS మరియు ఆండ్రాయిడ్ 15 OS అప్‌డేట్‌తో వస్తుంది. ఇది 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్‌ల ను కూడా అందిస్తుంది.

మోటోరోలా యొక్క My UX సపోర్ట్ కూడా వస్తోంది. 8GB RAM + 128GB స్టోరేజీ మరియు 12GB RAM + 256GB స్టోరేజీ వేరియంట్‌లు ఆర్డర్ చేయడానికి అందుబాటులో ఉన్నాయి. అలాగే, 8GB RAM మోడల్ 8GB డైనమిక్ RAMతో మరియు 12GB RAM మోడల్ 12GB డైనమిక్ RAMతో ర్యామ్ పెంచుకునే అవకాశం ఉంది.

అలాగే, మీరు 1TB వరకు మైక్రో SD కార్డ్‌ని ఉపయోగించవచ్చు. మోటో G64 5G ఫోన్ 6000mAh బ్యాటరీతో వస్తుంది. ఇందులో 30W టర్బోచార్జింగ్ ఉంది. ఇది IP52 రెసిస్టెంట్, డాల్బీ అట్మోస్, స్టీరియో స్పీకర్లతో వస్తుంది.

ధర, ఆఫర్ వివరాలు
ఈ ఫోన్ లాంచ్ అయినప్పుడు, 8GB + 128GB మోడల్ ధర రూ.14,999 గా ఉంది. అయితే ఇప్పుడు, ఫ్లిప్‌కార్ట్ సేల్ లో కేవలం రూ.13,999 కి బడ్జెట్‌లో అందుబాటులో ఉంది. అలాగే రూ.1,650 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తారు. దీన్ని ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి పొందవచ్చు. కాబట్టి, మీరు ఈ ఫోన్‌ను రూ.12,349 బడ్జెట్‌లో కొనుగోలు చేయవచ్చు.ఈ ఫోన్ 4 రంగులలో లభిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Huge Discount Of 22 percent On Motorola G64 5G Smartphones In Flipkart Sale. Offer Price And Specifications
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X