Home
News

ఐఫోన్ 14 పై, ఫ్లిప్కార్ట్ లో భారీ ఆఫర్! ఆఫర్ ధర వివరాలు

By Maheswara

ఐఫోన్ 14 గత సంవత్సరం లో లాంచ్ చేయబడింది. మరియు ఈ తాజా ఐఫోన్ మోడల్ ఇప్పటికే భారీ తగ్గింపు ఆఫర్ లతో అందుబాటులో ఉంది. మీరు సరికొత్త ఐఫోన్‌ను కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే, మీకు ఇదే సరైన సమయం. ఐఫోన్ 14 ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో అత్యంత తక్కువ ధరకు అందుబాటులో ఉంది.

ఆపిల్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లో జాబితా చేయబడిన ఐఫోన్ 14 అధికారికంగా ధర రూ.79,900 నుండి ప్రారంభమవుతుంది. కానీ ఫ్లిప్‌కార్ట్‌లో, ఈ ఐఫోన్ 14 తగ్గింపు ధర రూ.70,999 కి అందుబాటులో ఉంది. అంటే,ఈ ఫోన్ పై ఇప్పుడు దాదాపు రూ. 9000 ఫ్లాట్ తగ్గింపు ఆఫర్ ఉంది. అదనంగా, HDFC బ్యాంక్ కార్డ్ ఉన్న వ్యక్తులు రూ. 4000 ఫ్లాట్ తగ్గింపును పొందవచ్చు. దానితో ఐఫోన్ 14 ధర మరింత తగ్గి దాదాపు రూ.66,000 ధరకి మీకు లభిస్తుంది.

Huge Discount Offer On iPhone 14 In Flipkart Sale, Rs.13000 Flat Discount. Offer Details Here.

అదనంగా, మీరు మీ పాత ఐఫోన్ మోడల్ ను ఎక్స్చేంజి చేసుకోవాలనుకుంటే, ఫ్లిప్కార్ట్ రూ. 30,000 వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ విధంగా, ఐఫోన్ 14 యొక్క అందుబాటు ధర మరింత తగ్గుతుంది. అయితే, ఈ ఎక్స్ఛేంజ్ విలువ ఒక మోడల్ నుండి మరొక మోడల్ కు మారుతూ ఉంటుంది మరియు ఇది ఫోన్ పరిస్థితిపై కూడా ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు: మీ పాత ఫోన్‌లో డెంట్‌లు లేదా కొన్ని రకాల డ్యామేజ్‌లు ఉంటే లేదా ఏదైనా అంతర్గత సమస్యలు ఉన్నట్లయితే, ఆ సందర్భంలో ఈ మార్పిడి విలువ తక్కువగా ఉంటుంది.

అయితే, ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే: ప్రస్తుతం ఈ ధర వద్ద ఐఫోన్ 14 కొనుగోలు చేయడం విలువైనదేనా? అనే విషయాలు ఇక్కడ గమనిద్దాం, ప్రస్తుతం ఐఫోన్ 14 కొనుగోలు చేయడం పూర్తిగా విలువైనదే. ఎందుకంటే,ఐఫోన్ 13 ఇప్పుడు పాత ఫోన్ కావడమే దీనికి కారణం. ఐఫోన్ 13 ఐఫోన్ 14 మాదిరిగానే ఉన్నప్పటికీ, రెగ్యులర్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను దృష్టిలో ఉంచుకుని ఐఫోన్ 14 పొందడం మరింత సరైన ఎంపిక అవుతుంది. అలాగే, ప్రస్తుతం ఐఫోన్ 13 మరియు ఐఫోన్ 14 ధరల మధ్య చాలా తేడా కూడా లేదు. ఐఫోన్ 13 కూడా ఫ్లిప్‌కార్ట్‌లో రూ.61,999కి అందుబాటులో ఉంది. కాబట్టి, రూ. 5000 తేడాతో, మీరు ఐఫోన్ 14ని కొనుగోలుచేయడం మంచిది.

ఐఫోన్ 14 ధరకు తగినట్లుగానే మంచి స్పెసిఫికేషన్లను అందిస్తుంది. ఇది A15 బయోనిక్ చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. ఇది ప్రస్తుతం ఆపిల్ నుండి రెండవ అత్యంత శక్తివంతమైన మొబైల్ చిప్. ఈ ఫోన్ మూడు ఆప్షన్లలో వస్తుంది. ఇది 128GB, 256GB మరియు 512GB నిల్వ. కెమెరాల విషయానికొస్తే, ఈ ఐఫోన్ 14 , ఐఫోన్ 13కి పోలిక అయిన స్పెసిఫికేషన్ లను అందిస్తుంది.

ఈ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్‌ను అందిస్తుంది, అయితే సాఫ్ట్‌వేర్ ట్వీక్‌లతో. ఈ ఐఫోన్ 14 యొక్క బ్యాటరీ పనితీరు కూడా చాలా బాగుంది, ఎందుకంటే ఈ ఫోన్ ఒకే ఛార్జ్‌పై ఒక పూర్తి రోజు బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది. కాబట్టి, మొత్తంమీద, ప్రస్తుతం ఐఫోన్ 14 కొనుగోలు చేయడం ఖచ్చితంగా మంచి అవకాశం అవుతుంది.

Best Mobiles in India

English summary
Huge Discount Offer On iPhone 14 In Flipkart Sale, Rs.13000 Flat Discount. Offer Details Here.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X