సగం ధరకే, టాప్ Samsung స్మార్ట్ ఫోన్ ! Flipkart లో భారీ ఆఫర్, వివరాలు
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అయిన ఫ్లిప్కార్ట్, Samsung Galaxy S22 ప్లస్ 5g స్మార్ట్ ఫోన్ ను భారీ డిస్కౌంట్ ఆఫర్ తో అందిస్తోంది. ఈ డీల్ కోసం మీరు ఎదురు చూస్తున్నారు. Samsung Galaxy S22 ప్లస్ ధర ఇప్పుడు గణనీయంగా తగ్గింది. ఈ ఆఫర్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
శాంసంగ్ యొక్క ప్రీమియం స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ S22+ 5G ఫోన్ ఫ్లిప్కార్ట్ సేల్ లో బంపర్ ఆఫర్ పొందుతోంది. కస్టమర్లు ఈ రూ.లక్ష విలువైన ఈ ఫోన్‌ని సగం ధరకే కొనుగోలు చేయవచ్చు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6 అంగుళాల ఫుల్ HD + డిస్‌ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా మరియు 4500mAh శక్తివంతమైన బ్యాటరీని కలిగి ఉంది. ఈ Samsung ఫోన్‌లో అందుబాటులో ఉన్న ఆఫర్‌లు మరియు దాని ఫీచర్లను చూద్దాం.

Samsung Galaxy S22+ 5Gని సగం ధరకే కొనండి
షాపింగ్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ జరుగుతోంది. స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లతో సెల్ లో బంపర్ ఆఫర్లు లభిస్తున్నాయి. అదేవిధంగా, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో Samsung Galaxy S22 Plus 5Gపై కూడా బంపర్ ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ యొక్క MRP రూ. 1,01,999 గా ఉంది, అయితే ప్రస్తుత సమయంలో, ఇది 46% తగ్గింపు తర్వాత రూ. 54,999 వద్ద కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంటుంది.
ఇక, అదనంగా ఇతర ఆఫర్‌ల విషయానికొస్తే, ఈ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ చెల్లింపులపై 10% క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. కస్టమర్లు తమ పాత ఫోన్లను మార్చుకోవడం ద్వారా రూ.35,000 వరకు తగ్గింపు పొందవచ్చు. అయితే, ఎక్స్ఛేంజ్ ఆఫర్ పాత ఫోన్ పరిస్థితిపై ఆధారపడి ఉంటుందని మీరు గుర్తుంచుకోవాలి.
శాంసంగ్ గెలాక్సీ S22+ 5G స్పెసిఫికేషన్‌లు మరియు ఫీచర్లు
గెలాక్సీ S22+ 5G స్మార్ట్‌ఫోన్‌లో 8 GB RAMతో 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. ఇది 6.6 అంగుళాల పూర్తి HD + డిస్ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ మద్దతుతో వస్తుంది. ఇది స్నాప్ డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
ఇక కెమెరా వివరాలు చూస్తే, ఈ స్మార్ట్‌ఫోన్ సెల్ఫీల కోసం 10 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. అలాగే ఫోటోగ్రఫీ కోసం, ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది, ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో 12 మరియు 10 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి.
ఇంకా, అల్ట్రా-సోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో కూడిన ఈ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌లో 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4500mAh శక్తివంతమైన బ్యాటరీ ఉంది. ఇక కనెక్టివిటీ కోసం, Wi-Fi 802.11 a/b/g/n/ac/ax 2.4G+5GHz+6GHz, Wi-Fi డైరెక్ట్, NFC, బ్లూటూత్ 5.2 మరియు USB టైప్ C జాక్ వంటి ఆప్షన్లు ఇవ్వబడ్డాయి.


Click it and Unblock the Notifications