Amazon లో అప్‌గ్రేడ్ డేస్ సేల్.. ఆ బ్రాండ్ల మొబైల్స్ పై భారీ ఆఫర్లు!

|

దేశంలో పండగ సీజన్ ను పురస్కరించుకుని ప్రముఖ ఈ-కామర్స్ సైట్ Amazon ప్లాట్ ఫాంపై గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ముగిసింది. ఈ సేల్‌లో వివిధ రకాల గ్యాడ్జెట్‌లను భారీ తగ్గింపులతో విక్రయించారు. మీరు ఈ ఆఫర్‌ను మిస్ అయితే, ఇప్పుడు Amazon అప్‌గ్రేడ్ డేస్ సేల్‌ పేరుతో మరో అద్భుతమైన సేల్ ను వినియోగదారుల ముందుకు తెచ్చింది. ఈ సేల్ లో భాగంగా అనేక బ్రాండ్లకు చెందిన స్మార్ట్‌ఫోన్ల పై ఆకర్షణీయమైన తగ్గింపును ప్రకటించింది. అద్భుతమైన ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను సరసమైన ధరలకు కొనుగోలు చేయవచ్చు.

Amazon

Amazon ద్వారా ఈ అప్‌గ్రేడ్ డేస్ సేల్‌లో OnePlus, Realme, Redmi మరియు ఇతర ప్రముఖ కంపెనీల స్మార్ట్‌ఫోన్‌లు 40% వరకు తగ్గింపును పొందాయి. ఇది కాకుండా, AU బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, RBL బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై కూడా 10% తక్షణ తగ్గింపును పొందవచ్చు. ఈ ఆఫర్ అక్టోబర్ 28 వరకు అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా, స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు ఎక్స్ఛేంజ్ ఆఫర్, నో కాస్ట్ EMI వంటి ప్రయోజనాలు అందించబడతాయి. అయితే, ఏయే ఫోన్లపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయి. వాటి ధరలు ఎంత.. బేసిక్ ఫీచర్లు ఏంటి అనేది తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.

Samsung Galaxy M13;

Samsung Galaxy M13;

Samsung Galaxy M13 స్మార్ట్‌ఫోన్ రూ.4,500 తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంది. దీంతో ప్రస్తుతం ఈ మొబైల్ అమెజాన్ లో రూ.10,499 ధరకు లిస్టింగ్ చేయబడింది. ఈ ఫోన్ 6.6-అంగుళాల పూర్తి HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది మరియు ఇది ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

Realme Narjo 50i;

Realme Narjo 50i;

Realme Narjo 50i స్మార్ట్‌ఫోన్ రూ.1,600 తగ్గింపుతో రూ.6,399 ధరకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 6.5-అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది మరియు శక్తివంతమైన ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

OnePlus Nord CE 2 5G;

OnePlus Nord CE 2 5G;

OnePlus Nord CE 2 5G స్మార్ట్‌ఫోన్ రూ.1,000 తగ్గింపుతో రూ.24,999 ధరకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 6.43-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది, మరియు ఇది MediaTek Dimensity 900 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది.

IQ Z6 Lite 5G;

IQ Z6 Lite 5G;

IQ Z6 Lite 5G స్మార్ట్‌ఫోన్ రూ.3,500 తగ్గింపుతో రూ.15,499 ధరకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 6.58-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు Qualcomm Snapdragon 4 Gen 1 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

Redmi Note 11 Pro + 5G;

Redmi Note 11 Pro + 5G;

Redmi Note 11 Pro + 5G ఫోన్ రూ.6,000 తగ్గింపుతో రూ.20,999 ధరకు ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఇది 6.67-అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది మరియు ఇది స్నాప్‌డ్రాగన్ 695 5G ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

Redmi Note 11T 5G;

Redmi Note 11T 5G;

Redmi Note 11T 5G స్మార్ట్‌ఫోన్ రూ.4,000 తగ్గింపుతో రూ.16,999 ధరకు అందుబాటులో ఉంది. ఈ మొబైల్ 6.6-అంగుళాల పూర్తి HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు ఇది MediaTek డైమెన్సిటీ 810 ఆక్టా-కోర్ 5G చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది.

Redmi A1;

Redmi A1;

Redmi A1 స్మార్ట్‌ఫోన్ రూ.2,700 తగ్గింపుతో రూ.6,299 ధరకు అందుబాటులో ఉంది. 6.52-అంగుళాల డిస్‌ప్లే ఉన్న ఈ ఫోన్ MediaTek Helio A22 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

Redmi 11 Prime 5G;

Redmi 11 Prime 5G;

Redmi 11 Prime 5G ఫోన్ రూ.3,000 తగ్గింపుతో రూ.12,999 ధరకు అందుబాటులో ఉంది. ఈ మొబైల్ 6.58-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది మరియు ఇది MediaTek డైమెన్సిటీ 700 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది.

Best Mobiles in India

English summary
Huge discount offers goes live on several smartphones in amazon upgrade days sale.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X