Home
News

షియోమీ కొత్త ఫోన్ Xiaomi 12 ప్రో 5g పై భారీ డిస్కౌంట్ ఆఫర్! ఆఫర్ ధర వివరాలు!

By Maheswara

ప్రముఖ మొబైల్ బ్రాండ్‌లలో ఒకటి అయిన, షియోమీ బ్రాండ్ లో కొన్ని ఉత్తమ ఫోన్‌లను షియోమీ సిరీస్‌లో లాంచ్ చేయడం ద్వారా ఫోన్ ప్రియుల హృదయాలను గెలుచుకుంది. అందులోనూ షియోమీ 12 ప్రో 5G ఫోన్ మార్కెట్‌లో పెద్ద సంచలనం సృష్టించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర ఇప్పుడు భారీగా తగ్గించబడింది మరియు మళ్లీ ఇప్పుడు వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ఫోన్‌లో రెండు వేరియంట్ ఎంపికలు ఉన్నాయి.

అవును, షియోమీ యొక్క షియోమీ 12 ప్రో 5G ఫోన్ అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ ఆఫర్ కి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ యొక్క 8GB RAM + 256GB వేరియంట్ ధర సాధారణంగా రూ.79,999 గా ఉంటుంది. అయితే, ధర తగ్గింపు కారణంగా ఇప్పుడు రూ.55,999 వద్ద కొనుగోలుకు అందుబాటులో ఉంది దీనితో పాటు, ఎక్స్ఛేంజ్ ఆఫర్, బ్యాంక్ డిస్కౌంట్లు కూడా మీరు ఉపయోగించుకోవచ్చు.

Huge Discount Offers On Xiaomi 12 Pro 5G In Amazon Sale, Offer Price And Other Details In Telugu

షియోమీ 12 ప్రో 5G ఫోన్ స్పెసిఫికేషన్లు మరియు ఫీచర్లు ప్రాసెసర్ మరియు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వంటి వివరాలను పూర్తిగా తెలుసుకుందాం.

షియోమీ 12 ప్రో 5G డిస్‌ప్లే బిల్డ్ మరియు డిజైన్ వివరాలు

షియోమీ 12 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 1,440 x 3,200 పిక్సెల్‌ల స్క్రీన్ రిజల్యూషన్‌తో 6.73-అంగుళాల WQHD+ శాంసంగ్ E5 అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. డిస్ప్లే గరిష్టంగా 1,500 నిట్‌ల ప్రకాశం మరియు 120Hz డైనమిక్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది.

Huge Discount Offers On Xiaomi 12 Pro 5G In Amazon Sale, Offer Price And Other Details In Telugu

షియోమీ 12 ప్రో 5G ప్రాసెసర్ వివరాలు

షియోమీ 12 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది మరియు ఆండ్రాయిడ్‌లో రన్ అవుతుంది. ఇది 8GB RAM + 256GB మరియు 12GB RAM + 256GB ఇంటర్నల్ స్టోరేజీని కూడా కలిగి ఉంది.

షియోమీ 12 ప్రో 5G కెమెరా సెటప్ వివరాలు

షియోమీ 12 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ప్రధాన కెమెరాలో 50 మెగాపిక్సెల్ సోనీ IMX707 సెన్సార్ ఉంది, రెండవ కెమెరాలో 50 మెగాపిక్సెల్ సెన్సార్ పోర్ట్రెయిట్ లెన్స్ మరియు 50 మెగాపిక్సెల్ సెన్సార్ అల్ట్రా వైడ్ లెన్స్ ఉన్నాయి. ఇది 32 మెగాపిక్సెల్ సెన్సార్‌తో కూడిన సెల్ఫీ కెమెరాను కూడా కలిగి ఉంది.

Huge Discount Offers On Xiaomi 12 Pro 5G In Amazon Sale, Offer Price And Other Details In Telugu

షియోమీ 12 ప్రో 5G బ్యాటరీ మరియు ఇతర ఫీచర్ల వివరాలు

షియోమీ 12 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 4,600 mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఇది 120W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఇతర కనెక్టివిటీ ఆప్షన్లను గమనిస్తే 5G, Wi-Fi 6E, బ్లూటూత్ v5.2, NFC మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫోన్ బ్లూ, బ్లాక్ మరియు ఒపెరా మావ్ కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

షియోమీ 11i మరియు షియోమీ 11i హైపర్‌ఛార్జ్ ఫోన్లకు భారతదేశంలో సరికొత్త ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేసే MIUI 14 OS అప్‌డేట్‌ ను అందిస్తున్నామని షియోమీ సంస్థ తెలిపింది. ఈ అప్‌డేట్‌ లో కొత్త చేంజ్‌లాగ్‌లు, తాజా ఫర్మ్‌వేర్ వెర్షన్, సెక్యూరిటీ ప్యాచ్‌లు మరియు మరిన్ని కొత్త ఫీచరులను తీసుకువస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత MIUI 14 అప్‌డేట్ 3.6GB పరిమాణంతో వస్తుంది, దీనిని MIUI డౌన్‌లోడ్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే షియోమీ 11i సిరీస్ గత ఏడాది జనవరిలో ఆండ్రాయిడ్ 11-ఆధారిత MIUI 12.5 ని లాంచ్ చేసింది. ప్రస్తుతం ఈ అప్‌డేట్‌ జనవరి 2023 సెక్యూరిటీ ప్యాచ్‌తో పాటు వస్తుంది.

Best Mobiles in India

English summary
Huge Discount Offers On Xiaomi 12 Pro 5G In Amazon Sale, Offer Price And Other Details In Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X