Flipkart సేల్ 2023.. శాంసంగ్ గెలాక్సీ A34 స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్...!
ఫెస్టివల్ సీజన్ సందర్భంగా ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2023 (Flipkart Big Billion days sale 2023) నడుస్తోంది. ఈ సేల్‌లో భాగంగా అనేక బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు సహా ఇతర ఉత్పత్తులపై ఉత్తమ ఆఫర్లు అందిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ A34 5G స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఈ ఫోన్ ప్రస్తుతం ధర రూ.30,999గా ఉంది.
Samsung Galaxy A34 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్, 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌పై 24 శాతం డిస్కౌంట్‌ను అందించింది. ఫలితంగా ఈ ఫోన్ ధర రూ.27,999కు తగ్గనుంది. దాంతోపాటు ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా ICICI కార్డుతో కొనుగోలు చేస్తే మరో రూ.2000 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా ఈ ఫోన్ రూ.25,999కే సొంతం చేసుకోవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ A34 5G ప్రాసెసర్ : ఈ స్మార్ట్‌ఫోన్ Mali G68 MC4 GPU సపోర్టుతో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 OSతో వస్తుంది. ఈ ఫోన్ 8GB ర్యామ్, 128GB స్టోరేజీ మరియు 8GB ర్యామ్, 256GB స్టోరేజీ వేరియంట్లపై లభిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ A34 5G స్మార్ట్‌ఫోన్ 1080*2340 పిక్సల్ రిజల్యూషన్‌తో 6.6 అంగుళాల HD ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్‌తో వస్తుంది. మరియు 1000 నిట్స్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. లైమ్ గ్రాఫైట్, సిల్వర్ రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

శాంసంగ్ గెలాక్సీ A34 5G కెమెరాలు: ఈ శాంసంగ్ ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. 48MP ప్రైమరీ కెమెరా, 8MP సెకండరీ కెమెరా, 5MP మరో కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియోల కోసం 13MP కెమెరాను అమర్చారు. ఈ స్మార్ట్‌ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ A34 5G స్మార్ట్‌ఫోన్ గొరిల్లా గ్లాస్ 5ని కలిగి ఉంటుంది. దీంతోపాటు USB-C ఛార్జింగ్ పోర్టు, డాల్బీ అట్మాస్ ఆడియో స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ డస్ట, వాటర్ రెసిస్టెంట్ IP67 రేటింగ్‌తో రానుంది. బ్లూటూత్ 5.2 ఫీచర్లను కలిగి ఉంది.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2023.. అక్టోబర్ 7 నుంచే ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు అందుబాటులోకి వచ్చింది. అనంతరం అక్టోబర్ 8 నుంచి అందరికీ ఈ సేల్ ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ నెల 15వ తేదీ వరకు ఈ సేల్ కొనసాగుతుంది. ఈ సేల్‌లో భాగంగా అనేక బ్రాండ్లు స్మార్ట్‌ఫోన్లు, గ్యాడ్జెట్లు, టీవీలు సహా ఇతర గృహ ఉపకరణాలపై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








