Amazon, Flipkart sale 2023.. ఐఫోన్ 12, 13, 14లపై భారీ డిస్కౌంట్లు..!
ఆపిల్ iPhone 12 స్మార్ట్‌ఫోన్ ధర భారీగా తగ్గనుంది. త్వరలో ప్రారంభం కానున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్‌లో భాగంగా ఐఫోన్ 12 సహా ఐఫోన్ 13, 14లను కూడా ఈ రెండు సంస్థల సేల్‌లో భాగంగా భారీ తగ్గింపు ధరకే కొనుగోలు చేయవచ్చు.
ఐఫోన్ 12 స్మార్ట్‌ఫోన్‌ను 2020 అక్టోబర్‌లో రూ.79,900కు లాంచ్ చేశారు. Filpkart Big Billion days sale లో భాగంగా కేవలం రూ.38,999కే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్ ఎంపిక చేసిన బ్యాంకుల కార్డులపై కొనుగోలు చేసినట్లయితే మరో రూ.3000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు ఎంపిక చేసిన ఫోన్లను ఎక్చ్సేంజ్ చేయడం ద్వారా మరో రూ.3000 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా ఈ ఫోన్‌ను కేవలం రూ.32,999కే కొనుగోలు చేయవచ్చు.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో (Amazon Great indian Festival sale 2023) భాగంగా ఐఫోన్ 13 స్మార్ట్‌ఫోన్‌ను భారీగా తగ్గింపు ధరకు సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ 2021లో లాంచ్ అయింది. అయితే ఈ ఫోన్ ఎంత ధరకు లభించనుందేనే సమాచారాన్ని అమెజాన్ లీక్ చేయలేదు. అయితే సుమారుగా రూ.40,000 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చని తెలుస్తోంది.
డిస్కౌంట్ ధరలో మరింత అప్‌గ్రేడ్ అయిన ఐఫోన్‌ను కొనుగోలు చేసేందుకు ఐఫోన్ 14 మరియు ఐఫోన్ 14 ప్లస్ ఫోన్లను పరిశీలించవచ్చు. ఈ సేల్‌లో భాగంగా ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు కూడా తక్కువ ధరలోనే అందుబాటులోకి రానున్నాయి. అయితే ఫ్లిప్‌కార్టు ఈ ఫోన్లను ఎంత తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకొస్తుందనే సమాచారాన్ని వెల్లడించలేదు.

అయితే ఐఫోన్ 14 సిరీస్ (iphone 14) స్మార్ట్‌ఫోన్లను 2022 సెప్టెంబర్‌లో విడుదల చేసింది. విడుదల సమయంలో ఐఫోన్ 14 ఫోన్ ప్రారంభ ధర రూ.79,900గా ఉంది. అదే ఐఫోన్ 14 ప్లస్ రూ.89,900గా ఉంది. సేల్‌లో భాగంగా ఐఫోన్ 14 ధర రూ.50000 కంటే తక్కువగా ఉంటుందని తెలుస్తోంది. అదే విధంగా ఐఫోన్ 14 ప్లస్ ధర రూ.60000 కంటే తక్కువగా వస్తుందని సమాచారం.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023 అక్టోబర్ 8 తేదీన ప్రారంభం కానుంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్లు అక్టోబర్ 7 అర్ధరాత్రి నుంచే సేల్‌లో పాల్గొనవచ్చు. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్, టీవీ, ట్యాబ్లెట్లు సహా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు సహా గృహోపకరణాలపై భారీగా డిస్కౌంట్లు ఇస్తున్నట్లు అమెజాన్ వెల్లడించింది. SBI కార్డులపై కొనుగోలు చేసిన వారికి 10 శాతం తక్షణ డిస్కౌంట్ ఇస్తున్నట్లు పేర్కొంది.

మరో ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ అక్టోబర్ 8న ప్రారంభమై 15 తేదీన ముగుస్తుంది. ఈ సేల్ కోసం ఫ్లిప్‌కార్టు ఐసీఐసీఐ, యాక్సెస్, కోటక్ బ్యాంక్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ కార్డులతో కొనుగోలు చేసినట్లయితే 10 శాతం తక్షణ డిస్కౌంట్ లభిస్తుందని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. అయితే ఈ డిస్కౌంట్‌ను రూ.1500లకు పరిమితం చేసినట్లు చెప్పింది.


Click it and Unblock the Notifications








