Home
News

Flipkart సేల్స్‌: Vivo T1సిరీస్ 5G మొబైల్స్‌పై క‌ళ్లు చెదిరే ఆఫ‌ర్లు!

ప్ర‌స్తుతం ఆన్‌లైన్‌లో ఎక్క‌డ చూసినా ఫెస్టివ‌ల్ సీజ‌న్ కు సంబంధించిన స్పెష‌ల్ సేల్స్ హ‌డావుడి క‌నిపిస్తోంది. ప్ర‌ధాన ఈ కామ‌ర్స్ ప్లాట్‌ఫాంలు Flipkart, amazonఇప్ప‌టికే త‌మ ప్ర‌త్యేక సేల్ తేదీల‌ను ప్ర‌క‌టించాయి. ఫ్లిప్‌కార్ట్‌లో నిర్వ‌హించబోయే Big billion days sale 2022, సెప్టెంబ‌ర్ 23వ తేదీన ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి ఆ కంపెనీ ఇప్ప‌టికే గ‌త కొద్ది రోజుల నుంచి ప్ర‌త్యేక సేల్‌లో ఉండ‌బోయే ఆఫ‌ర్ల ను టీజ్ చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా వివో కంపెనీకి చెందిన మొబైల్స్‌పై ఆక‌ర్ష‌ణీయ‌మైన డిస్కౌంట్లు అందుబాటులో ఉండ‌నున్నాయి. తాజాగా, ఫ్లిప్‌కార్ట్‌ Vivo T1 సిరీస్ మొబైల్‌పై భారీ ధర తగ్గింపు సూచించే టీజ‌ర్‌ను విడుదల చేసింది. Vivo T1 Pro 5Gని అసలు ధర రూ.23,999 గా ఉండ‌గా.. దాన్ని రూ.17,999 పొంద‌వ‌చ్చ‌ని పేర్కొంది.

Flipkart

Vivo T1 ప్రో 5G మొబైల్‌పై 17 శాతం తగ్గింపు:
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా.. Vivo T1 ప్రో 5G 17 శాతం తగ్గింపు ధరతో లభిస్తుంది, దీని రూ.6GB + 128GB వేరియంట్ కోసం 23,999 బ‌దులుగా.. రూ.17,999 పొంద‌వ‌చ్చు. అదనంగా, ఫ్లిప్‌కార్ట్ దీని కొనుగోలుపై ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కూడా అందిస్తుంది. అంతేకాకుండా, ICICI బ్యాంక్ మరియు యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌లతో 10 శాతం తక్షణ తగ్గింపును అందిస్తుంది.

Vivo T1 5G మొబైల్‌పై రూ.1,000 త‌గ్గింపు:
ఇక, Vivo T1 5G మోడ‌ల్ 6జీబీ వేరియంట్ విష‌యానికొస్తే.. దీని సాధార‌ణ ధ‌ర రూ.16,990 గా ఉంది. కానీ, ఈ మొబైల్‌ను ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో రూ.1000 త‌క్ష‌ణ త‌గ్గింపుతో, రూ.15,990 ప్ర‌భావవంత‌మైన ధ‌ర‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు. కొనుగోలుదారులు ICICI బ్యాంక్ మరియు యాక్సిస్ బ్యాంక్ కార్డ్ లావాదేవీలతో అధిక తగ్గింపులను పొందవచ్చు. Vivo T1 5G మొబైల్ 4GB మోడల్ కూడా తగ్గింపుతో లభిస్తుంది, దీనిని రూ.15,000 క‌న్నా త‌క్కువ ధ‌ర‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Flipkart

రూ.15వేల‌లోపు మొబైల్ కోసం చూస్తున్నారా.. ఇది బెస్ట్‌!
మీరు క‌నుక రూ.15వేల లోపు మొబైల్ కోసం చూస్తున్న‌ట్ల‌యితే, ఫ్లిప్‌కార్ట్ సేల్ మంచి అవ‌కాశం. ఎందుకంటే.. ఈ సేల్‌లో భాగంగా Vivo T1 44W మోడ‌ల్‌పై మంచిప్రైస్ కట్ డీల్ అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో కొనుగోలుదారులు 44W వేరియంట్‌ను త‌క్కువ ధ‌ర‌కు పొంద‌వ‌చ్చు. Vivo T1 44W మొబైల్ 4GB మోడల్ కేవలం రూ.13,499కి ల‌భిస్తుంది. అదే 6GB మోడల్ విష‌యానికొస్తే.. మీరు రూ.14,999 పొంద‌వ‌చ్చు.

Vivo T1x పై రూ.1,000 త‌గ్గింపు:
ఇక‌పోతే మీరు రూ.10 వేల‌ లోపు ఫోన్ కోసం చూస్తున్నట్లయితే ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో Vivo T1x మొబైల్‌పై రూ.1,000 తగ్గింపు అందుబాటులో ఉండ‌నుంది. Vivo T1x పై ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో మంచి డీల్ చేస్తుంది. కొత్త Vivo T1x మొబైల్ కేవ‌లం రూ.9,999లకు అందుబాటులో ఉంటుంది. Vivo T1x 128GB స్టోరేజీలో కూడా అందుబాటులో ఉంది. దీని ధర రూ.11,999 గా ఉంది. అదనంగా, బ్యాంక్ డీల్‌లు మరియు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి. వాటి ద్వారా ఈ Vivo ఫోన్‌ను మరింత సరసమైన ధ‌ర‌కు పొంద‌వ‌చ్చు.

Flipkart

Vivo T1X ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:
ఈ మొబైల్ కు 6.58 అంగుళాల full-HD + LCD డిస్‌ప్లే పానెల్‌ను అందిస్తున్నారు. ఇది 90Hz రిఫ్రెష్ రేటుతో ప‌ని చేస్తుంది. ఇది octa-core 6nm Qualcomm Snapdragon 680 SoC ప్రాసెస‌ర్‌ను క‌లిగి ఉంది. ఇది 2.5D క‌ర్వ్‌డ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 డిస్‌ప్లే ప్రొటెక్ష‌న్ ఫీచ‌ర్ క‌లిగి ఉంది. అంతేకాకుండా ఈ మొబైల్ IP67 వాట‌ర్ లేదా డ‌స్ట్ రెసిస్టాన్స్ రేటింగ్‌ ఫీచ‌ర్తో వ‌స్తోంది. ఇది ఫ‌న్‌ట‌చ్ ఓఎస్ 12 బేస్‌డ్‌ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ స‌హ‌కారం తో ప‌నిచేస్తుంది. ఈ మొబైల్ ర్యామ్ కెపాసిటీ ఆధారంగా 4GB, 8GB రెండు వేరియంట్ల‌లో ల‌భిస్తోంది. ఇక ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ విష‌యానికి వ‌స్తే 128 జీబీ వ‌ర‌కు స‌దుపాయాన్ని క‌ల్పిస్తున్నారు.

ఈ మొబైల్ డ్యుయ‌ల్‌ కెమెరా సెట‌ప్‌ను క‌లిగి ఉంది. ప్ర‌ధానంగా 50 మెగాపిక్స‌ల్ క్వాలిటీ లో ప్రైమ‌రీ లెన్స్‌, మ‌రొక‌టి 2 మెగా పిక్సెల్ క్వాలిటీ లో సెకండ్ లెన్స్ తో పాటు ఎల్ఈడీ ఫ్లాష్‌ను అందిస్తున్నారు. ఈ మొబైల్‌కు ఫ్రంట్ సైడ్ వీడియో కాలింగ్ కోసం 8 మెగా పిక్సెల్ క్వాలిటీతో సెల్ఫీ కెమెరా అందిస్తున్నారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 5000 mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని 18W ఫాస్ట్ ఛార్జింగ్ స‌పోర్ట్‌ అందిస్తున్నారు. ఈ హ్యాండ్ సెట్ డ్యుయ‌ల్ సిమ్ స్లాట్స్‌, రెండిటికీ 5జీ నెట్‌వ‌ర్క్ స‌పోర్ట్ సిస్ట‌మ్ కలిగి ఉంది. వైఫై, బ్లూటూత్ వ‌ర్ష‌న్ 5.0, ఎఫ్ఎం రేడియో ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

Best Mobiles in India

English summary
Huge Discounts on Vivo T1 series mobiles in flipkart big billion days sale 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X