కొత్త ఫోన్ల లాంచ్ తో iPhone 13, iPhone 12 లపై భారీగా ధర తగ్గింది ! కొత్త ధర వివరాలు.

By Maheswara
|

Apple ఎట్టకేలకు ఐఫోన్ 14 సిరీస్‌ను భారతదేశంలో లాంచ్ చేసింది మరియు దీని ప్రారంభ ధర రూ.79,990 గా విడుదలైంది.ఈ కొత్త ఐఫోన్‌లను ప్రారంభించడంతో, కంపెనీ యొక్క పాత ఫోన్‌ల ధరలను కూడా తగ్గించింది. అలాగే ఐఫోన్ 11ని నిలిపివేసింది. ఇప్పుడు, ఐఫోన్ 13 మరియు ఐఫోన్ 12 ఫోన్లపై భారతదేశంలో ధర తగ్గింపు ఆఫర్ ను అందిస్తోంది. ఇది ప్రతి సంవత్సరం జరిగే విషయం అయినా, దీని గురించి మీరు తెలుసుకోవలసిన ప్రతి విషయం ఇక్కడ అందిస్తున్నాము.

 

ఐఫోన్ 13 ధర

ఐఫోన్ 13 ధర

ఐఫోన్ 14 భారతదేశంలో పాత ధరకే ప్రకటించబడింది. ఇప్పుడు ఐఫోన్ 13 ఒక సంవత్సరం పాత స్మార్ట్‌ఫోన్ కాబట్టి ఆపిల్ ఈ పరికరం ధరను తగ్గించింది. iPhone 13 ఇప్పుడు 128GB స్టోరేజ్ మోడల్‌కు రూ. 69,990 ధర వద్ద అమ్ముడు అవుతుంది. అయినప్పటికీ, మీరు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ మరియు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఈవెంట్‌లో అదనపు ఆఫర్ల ద్వారా చాలా తక్కువ ధరకు పొందవచ్చు. ఈ రెండు సేల్ ఈవెంట్‌లు వచ్చే వారం ప్రారంభమయ్యే అవకాశం ఉంది మరియు టీజర్‌లు సూచించినట్లుగా నెలాఖరు వరకు ఈ సేల్ కొనసాగుతాయి.

iPhone 13 అసలు ధర

iPhone 13 అసలు ధర

iPhone 13 అసలు ధర రూ.79,990 అంటే కస్టమర్లు ఇప్పుడు రూ.10,000 తగ్గింపును పొందుతున్నారు. Apple యొక్క ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో రూ. 58,730 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఈ ఆఫర్ కొన్ని ఇతర ఐఫోన్‌ల కు కూడా అందుబాటులో ఉంది. ఈ ఫోన్ పరిస్థితి మరియు వయస్సు ఆధారంగా ఎక్స్చేంజి ధర మొత్తం లెక్కించబడుతుంది. మరోవైపు, ఫ్లిప్‌కార్ట్ మీ పాత ఫోన్ ఎక్స్‌ఛేంజ్‌పై రూ. 17,000 వరకు తగ్గింపు ఆఫర్ ను అందిస్తోంది.

iPhone 12 కూడా
 

iPhone 12 కూడా

iPhone 12 కూడా భారతదేశంలో ధర తగ్గింపును పొందింది మరియు ఈ పరికరం ధర ఇప్పుడు రూ. 59,990 నుండి ప్రారంభమవుతుంది. అయినప్పటికీ, అమెజాన్ ఐఫోన్ 12 ను కేవలం 52,999 రూపాయలకు విక్రయిస్తోంది, ఇది 64GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర. అమెజాన్‌లో అయితే  కస్టమర్లు రూ. 10,950 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను పొందుతారు. అలాగే, ఐఫోన్ 12 మినీ ధర రూ. 55,999 గా ఉంది.

ఐఫోన్ 14 సిరీస్

ఐఫోన్ 14 సిరీస్

ఈ సంవత్సరం, ఆపిల్ ఐఫోన్ యొక్క మినీ వెర్షన్‌ను లాంచ్ చేయలేదు మరియు దీని బదులుగా  కొత్త ఐఫోన్ 14 ప్లస్ మోడల్‌ను పరిచయం చేసింది. ఆపిల్ చాలా కాలం క్రితం ప్లస్ మోడళ్ల అమ్మకాలను నిలిపివేసింది. కానీ,ఈ సంవత్సరం తిరిగి ఈ మోడల్ ను తీసుకురావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ప్లస్ మోడల్ ప్రామాణిక iPhone 14 మరియు iPhone 14 Pro స్మార్ట్‌ఫోన్‌ల మధ్య మోడల్ గా లాంచ్ చేయబడింది.

ఫార్ అవుట్ ఈవెంట్ లో

ఫార్ అవుట్ ఈవెంట్ లో

బుధ‌వారం రాత్రి జ‌రిగిన ఫార్ అవుట్ ఈవెంట్ వేదిక‌గా యాపిల్ కంపెనీ iPhone 14 సిరీస్‌లో భాగంగా నాలుగు స్మార్ట్‌ఫోన్ల‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. కొత్త మోడళ్లలో iPhone 14, iPhone 14 Plus, iPhone 14 Pro మరియు iPhone 14 Pro Max ఉన్నాయి. ప్రో మోడల్ మొబైల్స్ స‌రికొత్త A16 బయోనిక్ చిప్‌ల ద్వారా శక్తిని పొందుతాయి.

iOS 16 లో

iOS 16 లో

ఈ కొత్త సిరీస్ ఐఫోన్ల‌లో అతిపెద్ద అప్‌గ్రేడ్‌లలో ఒకటి కెమెరా వ్య‌వ‌స్థ‌. ఇది ఫోటోనిక్ ఇంజిన్‌ను ఉపయోగించి ప‌నిచేస్తుంద‌ని ఆపిల్ వెల్ల‌డించింది, ఇది iPhone 13 సిరీస్‌తో పోల్చినప్పుడు ఐఫోన్ 14 సిరీస్ ఫొటోలు మరియు వీడియోలను రెండు రెట్లు మెరుగ్గా అందిస్తుంది. కొత్త iPhone 14 సిరీస్ iOS 16లో రన్ అవుతుంది. ఇతర Apple డివైజ్‌ల‌ కోసం, iOS 16 సెప్టెంబర్ 12 నుండి అందుబాటులోకి వస్తుంది.

Best Mobiles in India

Read more about:
English summary
Huge Price Cut On iPhone 13 And iPhone 12 In India After iPhone14 Launch. Check New Prices Here.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X