కలవరపెడుతున్న 5జీ, అది వస్తే చావు తప్పదా ?

ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ అమిత వేగంగా పుంజుకుంటున్న తరుణంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

|

ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ అమిత వేగంగా పుంజుకుంటున్న తరుణంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా మనిషి చేసే తప్పులకు మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే ఇప్పుడు సినిమాలో కనిపించిన పక్షిరాజా లాంటి వ్యక్తి కావాలి. పక్షులను చంపేస్తున్న 2.ఓ సినిమాలో సెల్‌ఫోన్ టవర్స్‌ను నాశనం చేయటమే కాకుండా సెల్‌ఫోన్లను మాయం సీన్ లో దుమ్మురేపిన అక్షయ్ కుమార్ లాంటి వ్యక్తి నిజ జీవితంలోకి వస్తే తప్ప మూగజీవాలను కాపాడుకోలేని స్థితిలో నేడు టెక్నాలజీ రాజ్యమేలుతోంది. పూర్తి వివరాల్లోకెళితే..

ATMలో డబ్బులు పొందేదుకు కొత్త పద్ధతిATMలో డబ్బులు పొందేదుకు కొత్త పద్ధతి

కొంతకాలంగా పక్షులు మృత్యువాత

కొంతకాలంగా పక్షులు మృత్యువాత

నెదర్లాండ్స్ రాజధాని హేగ్‌లోని ఓ పార్క్‌లో కొంతకాలంగా పక్షులు మృత్యువాత పడుతున్నాయి. ఆ పార్క్ పరిధిలో 300 పక్షులు చనిపోయి ఉన్నాయి. వరసగా పక్షులు చనిపోతుండటంతో ఆందోళన చెందిన పక్షి ప్రేమికులు కారణాలపై అన్వేషించగా వారికి షాకింగ్ విషయం తెలిసింది.

 

 

5G టెస్ట్ సిగ్నల్‌ రేడియేషన్

5G టెస్ట్ సిగ్నల్‌ రేడియేషన్

5G టెస్ట్ సిగ్నల్‌ రేడియేషన్ వల్లనే వందలాది పక్షులు చనిపోతున్నాయని గుర్తించారు. ఈ విషయాన్ని అక్కడి పశు వైద్యులు కూడా నిర్థారించారు. టెలికాం కంపెనీ అధికారులు కూడా దీనిని అంగీకరించారు. అయితే 5G టెస్ట్ సిగ్నల్ చేశామని.. రేడియేషన్ బాగా వచ్చిందని మాత్రమే వారు చెబుతున్నారు .

 

 

రేడియేషన్ కారణం

రేడియేషన్ కారణం

డచ్ రైల్వే స్టేషన్‌కు అనుసంధానంగా అధికారులు 5G టెస్ట్ సిగ్నల్ అక్కడ ప్రయోగం చేశారు. దీని కారణంగా రేడియేషన్ చుట్టుపక్కల ఉన్న పక్షులపై తీవ్ర ప్రభావం చూపింది. రేడియేషన్ కారణంగా పక్షులు చనిపోతున్నాయి.

 

 

పక్షి ప్రేమికులు ఆగ్రహం

పక్షి ప్రేమికులు ఆగ్రహం

కొన్ని పక్షులు రేడియేషన్ బారి నుంచి తప్పించుకునేందుకు నీళ్లలో తలదాచుకుంటున్నాయి. ఈ ఘటనపై నెదర్లాండ్స్ పక్షి ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోకుండా ప్రయోగాలు చేయడం ఏంటని నిలదీస్తున్నారు.

పిచ్చుకలు మాయం

పిచ్చుకలు మాయం

పక్షులను కాపాడేందుకు చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఇప్పటికే సెల్‌ఫోన్ రేడియేషన్ వల్ల పిచ్చుకలు అంతరించిపోయాయి. కేవలం 4G టెక్నాలజీ వల్లే ఇంత వినాశనం జరిగితే.. రాబోయే 5G సిగ్నల్ రేడియేషన్ ఎంత ముప్పు తీసుకురాబోతున్నది అనేది అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది.

Best Mobiles in India

English summary
Hundreds Of Birds Dead During 5G Experiment In Netherlands More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X