గుగూల్ పరుగు పందెం!

2012 లండన్ ఒలంపిక్స్‌లో భాగంగా 12వ రోజును పురస్కరించుకుని సెర్చ్ ఇంజన్ గూగుల్ ‘హర్డిల్స్ ’కు ప్రాధాన్యతను కల్పిస్తూ సంబంధిత డూడుల్‌ను హోమ్‌పేజీ పై పోస్ట్ చేసింది. 10 హర్డల్స్‌తో కూడిన 110 మీటర్ల పురుషుల హర్డిల్ పరుగు పోటీని ఈ ఇంటరాక్టివ్ డూడుల్ సూచిస్తుంది. ఔత్సాహికులు ఈ డూడుల్ పై నిక్షిప్తం చేసిన ఆప్షన్‌లను అనుసరించి ఇంటరాక్టివ్ పరుగు పందెంలో పాల్గొనవచ్చు.
లండన్‌లో జరుగుతున్న 30వ ఒలింపిక్ క్రీడలు 17 రోజుల పాటు జరగనున్నాయి. పోటీలో జరిగే క్రీడాంశాల సంఖ్య 26, పాల్గొనున్న క్రీడాకారులు సంఖ్య 10,500, పతక విభాగాలు 302, క్రీడా వేదికలు 34, పాల్గొంటున్నదేశాలు 204. ఈ క్రీడల్లో భారత్ నుంచి 81 మంది క్రీడాకారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ పంచరింగుల క్రీడా పండుగకు లండన్ ఇప్పటికే రెండుసార్లు అతిధ్యమిచ్చింది.
Comments
Best Mobiles in India


Click it and Unblock the Notifications








