1జీబి 3జీ డేటా 56కే, సంవత్సరం వ్యాలిడిటీ

బీఎస్ఎన్ఎల్ మరో సంచలన ఆఫర్‌కు తెరలేపింది. ETTelecom ప్రచురించిన కథనం ప్రకారం బీఎస్ఎన్ఎల్ 80జీబి 3జీ మొబైల్ డేటాను కేవలం రూ.4,498కే అందిస్తోంది. సంవత్సరం వ్యాలిడిటీతో ఈ 3జీ డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ లెక్కన చూస్తే 1జీబి 3జీ మొబైల్ డేటా ఖరీదు రూ.56గా ఉంది. నవంబర్ 30 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.

Read More : LYF 4G ఫోన్‌ను రూ.1000కే పొందటం ఎలా?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మరికొన్ని ఆఫర్లు...

నీటిలో ఉడికించినా పనిచేస్తున్నఐఫోన్ 7

అదనంగా మరికొన్ని ఆఫర్లను బీఎస్ఎన్ఎల్ లాంచ్ చేసినట్లు తెలుస్తోంది. వాటి వివరాలను పరిశీలించినట్లయితే..

60జీబి, 36జీబి, 18జీబి..

క్రెడిట్ కార్డు సైజులో ఫోన్, ఇవీ ప్రత్యేకతలు!

60జీబి 3జీ మొబైల్ డేటా రూ.4,000కు, 36జీబి 3జీ మొబైల్ డేటా రూ.2,800కు, 18జీబి 3జీ మొబైల్ డేటా రూ.1,500కు బీఎస్ఎన్ఎల్ అందుబాటులో ఉంచినట్లు సమాచారం. సంవత్సరం వ్యాలిడిటీతో ఈ ఆఫర్లు పనిచేస్తాయి.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఒకే సారి సంవత్సరం బిల్..

రూ.148కే ఎయిర్‌టెల్ అన్‌లిమిటెడ్ కాల్స్

నెలవారీ కాకుండా, సంవత్సరం మొత్తానికి సరిపడా డేటా బిల్లును ఒకేసారి చెల్లించాలనుకునే వారికి ఈ ఆఫర్ చక్కటి ఆప్షన్. బీఎస్ఎన్ఎల్ లాంచ్ చేసిన ఈ స్కీమ్ కొత్తదేమి కాకపోయినప్పటికి ఎయిర్‌టెల్, ఐడియా వంటి ప్రయివేటు టెలికం ఆపరేటర్లు అందిస్తోన్న ఆఫర్లతో పోలిస్తే లాభసాటిగా ఉండటం విశేషం.

భారతి ఎయిర్‌‌టెల్ ఆఫర్..

రూ.10,000 రేంజ్‌లో ఫాస్ట్ ఛార్జింగ్ ఫోన్‌లు

భారతి ఎయిర్‌‌టెల్ ఇదే తరహా 80జీబి డేటాను సంవత్సరం వ్యాలిడిటీతో రూ.5,770కు అందిస్తోంది. అయితే ఈ డేటాను 3జీ/4జీ నెట్‌వర్క్‌లలో ఉపయోగించుకోవచ్చు. ఇదే సమయంలో బీఎస్ఎన్ఎల్ అందిస్తోన్న ఆఫర్ కేవలం 3జీ నెట్‌వర్క్ పై మాత్రమే అందుబాటులో ఉంది.

ఐడియా సెల్యులార్ నుంచి..

ఫోన్‌లో పోర్న్ వెబ్‌‌సైట్‌లు చూస్తున్నారా..?

మరోవైపు ఐడియా సెల్యులార్ కూడా ఇదే తరహా 80జీబి డేటాను సంవత్సరం వ్యాలిడిటీతో రూ.5,500కు అందిస్తోంది. అయితే ఈ డేటాను 3జీ/4జీ నెట్‌వర్క్‌లలో ఉపయోగించుకోవచ్చు. ఇదే సమయంలో బీఎస్ఎన్ఎల్ అందిస్తోన్న ఆఫర్ కేవలం 3జీ నెట్‌వర్క్ పై మాత్రమే అందుబాటులో ఉంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Hurry Up! BSNL Offers 1GB 3G Data at Just Rs.56 Until November 30. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot