రూపాయికే Xiaomi ఫోన్లు

భారత్ మార్కెట్లోకి అడుగుపెట్టి రెండు సంవత్సరాలు పూర్తి కావొస్తున్న నేపథ్యంలో ప్రముఖ చైనా ఫోన్‌ల కంపెనీ షియోమీ (Xiaomi) స్పెషల్ ఆఫర్లతో కూడిన మూడు రోజుల వార్షికోత్సవ కార్నివాల్‌ను నిర్వహించబోతోంది. జూలై 20 నుంచి ప్రారంభంకాబోతున్న ఈ ఆఫర్ల పండుగలో ఆసక్తికర కాంటెస్టులతో పాటు రూ.1 ఫ్లాష్ డీల్స్‌ను షియోమీ నిర్వహించబోతోంది. మరిన్ని వివరాలు క్రింది స్లైడర్‌లో...

Read More : Moto E3 వచ్చేసింది!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మొదటి రోజు ఫ్లాష్ డీల్స్‌లో భాగంగా

మొదటి రోజు రూ.1 ఫ్లాష్ డీల్స్‌లో భాగంగా 10 Xiaomi Mi 5 ఫోన్‌లతో పాటు 20000 ఎమ్ఏహెచ్ సామర్థ్యం గల 100 Mi Power Bankలను అందుబాటులో ఉంచనున్నారు.

 

రెండవ రోజు ఫ్లాష్ డీల్స్‌లో భాగంగా

రెండవ రోజు రూ.1 ఫ్లాష్ డీల్స్‌లో భాగంగా 10 Xiaomi Redmi Note 3 ఫోన్‌లతో పాటు 100 Mi Bandలను అందుబాటులో ఉంచనున్నారు.

మూడవ రోజు ఫ్లాష్ డీల్స్‌లో భాగంగా

మూడవ రోజు రూ.1 ఫ్లాష్ డీల్స్‌లో భాగంగా 10 Xiaomi Mi Max ఫోన్లతో పాటు 100 Mi Bluetooth స్పీకర్లను అందుబాటులో ఉంచనున్నారు.

 

ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంటలకు

ఈ ఫ్లాష్ డీల్స్ ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించబడతాయి. ఈ సేల్లో పొల్గొనదలచిన వారు జూలై 19లోపు షియోమీ ఫేస్‌బుక్ పేజీలో రిజిస్టర్ అయి ఆ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయవల్సి ఉంటుంది.

 

లిమిటెడ్ స్టాక్‌లో కొత్త వస్తువులు

ఈ ఫ్లాష్ డీల్స్‌‍తో పాటు లిమిటెడ్ స్టాక్‌లో కొత్త వస్తువులను, ఈ మూడు రోజుల సేల్‌లో భాగంగా షియోమీ విక్రయించబోతోంది. కొత్త ఉత్పత్తుల జాబితాలో 10000 ఎమ్ఏహెచ్ Mi పవర్ బ్యాంక్స్, Mi ఇన్-ఇయర్ క్యాప్స్యుల్ హెడ్‌ఫోన్స్, Mi ఇన్-ఇయర్ హెడ్‌ఫోన్ ప్రో గోల్డ్ వేరియంట్‌లు ఉన్నాయి.

 

Mi 2nd Anniverary websiteలో

ఈ ఆఫర్ల పండుగలో భాగంగా Mi 2nd Anniverary websiteలో గేమ్స్ ఆడిన వారికి Mi క్యాష్ కూపన్స్‌తో పాటు, Mi Max ఫోన్‌ను గెలుచుకునే అవకాశాన్ని షియోమీ కల్పిస్తోంది

 

Xiaomi Mi 5 గోల్డ్ కలర్ వేరియంట్

వీటితో పాటు పలు యాప్ ఎక్స్‌క్లూజివ్ ఆఫర్లను షియోమీ అందిస్తోంది. యాప్ ద్వారా Xiaomi Mi 5 గోల్డ్ కలర్ వేరియంట్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసిన వారికి Mi ఇన్-ఇయర్ హెడ్‌ఫోన్ ఉచితంగా లభించనుంది.

 

షియోమీ ఎంఐ 4ఐ

షియోమీ ఎంఐ 4ఐ ఫోన్‌ను కొనుగోలు చేసిన వారికి యూఎస్బీ కేబుల్ అలానే యూఎస్‌బీ ఫ్యాన్ ఉచితంగా లభించనుంది.

ఎక్స్‌క్లూజివ్ ఆఫర్లు...

వీటితో పాటు రెడ్మీ నెట్ 3, Mi Max, 20000 ఎమ్ఏహెచ్ పవర్ బ్యాంక్స్ పై ఎక్స్‌క్లూజివ్ ఆఫర్లను షియోమీ అందించబోతోంది.

Mi Store యాప్ ద్వారా

Mi Store యాప్ ద్వారా ఈ ఉత్పత్తులను కొనుగోలు చేసే వారిలో ర్యాండమ్‌గా ఎంపిక చేసిన బయ్యర్‌కు ఒక Mi TVని షియోమీ అందించనుంది.

 

యాపిల్ ఆఫ్ చైనా

యాపిల్ ఆఫ్ చైనాగా గుర్తింపు తెచ్చుకున్న షియోమీ 2014లో, Mi 3 స్మార్ట్‌ఫోన్ లాంచ్‌తో ఇండియన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
BREAKING: Xiaomi Smartphones Available for Re 1. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot