Hyderabad Airportలో సరికొత్త టెక్నాలజీ, దేశంలోనే ఫస్ట్ !

By Gizbot Bureau
|

తెలంగాణా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఉన్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానశ్రయం అరుదైన ఘనతను సొంతం చేసుకోబోతోంది. 'డిజి యాత్ర’ ప్రొగ్రామ్ లో భాగంగా దేశంలోనే తొలిసారిగా ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ అందుబాటులోకి రానుంది. విమానం ఎక్కే మందు చెకింగ్ ప్రాసెస్ లో ఎక్కువ సమయం పడుతుండటంతో దాన్ని నివారించేందుకు ఈ రకమైన సిస్టమ్ ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

 
Hyderabad Airport Becomes Indias First To Introduce Facial Recognition For Passengers

సాధారణంగా బోర్డింగ్ పాస్, గుర్తింపు కార్డు, పాస్ పోర్టు అనేవి ప్యాసింజర్లు ఎలాగో తీసుకువెళతారు. అయితే విమానం ఎక్కేముందు చెకింగ్ ప్రాసెస్ లో ఎక్కువ సమయం తీసుకుంటూ ఉంటుంది. ఒక్కసారి లాంగ్ క్యూ కూడా ఉండే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇకపై విమానం ఎక్కేముందు బోర్డింగ్ పాస్ అవసరం లేకుండా సైంటిఫిక్ మూవీ తరహాలో త్వరలో కొత్త సిస్టమ్ అందుబాటులోకి రానుంది.

 రిజిస్టర్

రిజిస్టర్

ప్యాసింజర్లు దీన్ని డిజి యాత్ర ఐడీ ప్రొగ్రామ్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులోని కెమెరా.. విమానశ్రయాల్లో సెక్యూరిటీ కౌంటర్ ద్వారా వెళ్లే సమయంలో ప్రయాణికుల ఫేస్ వెరిఫై చేస్తుంది. అప్పుడే లోపలికి వెళ్లేందుకు అనుమతిస్తుంది. తద్వారా బోర్డింగ్ పాస్ చూపించాల్సిన అవసరం కూడా లేదని అధికారులు చెబుతున్నారు.

 డిజి యాత్ర ఐడీ డేటాలో మీ ఫేషియల్ సైన్ స్టోర్

డిజి యాత్ర ఐడీ డేటాలో మీ ఫేషియల్ సైన్ స్టోర్

ఈ ఐడీ సాయంతో తొలిసారి విమానంలో ప్రయాణించడానికి ముందు ఒకసారి మాత్రమే వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఒకసారి వెరిఫై పూర్తి అయ్యాక ఫేషియల్ రికగ్నైజేషన్ బయోమెట్రిక్ ద్వారా డిజి యాత్ర ఐడీ డేటాలో మీ ఫేషియల్ సైన్ స్టోర్ అవుతుంది. దీనికి సంబంధించి ట్రయల్ రన్ కూడా జూలై 1 నుంచి జూలై 3 వరకు విమానశ్రయ అధికారులు నిర్వహించారు.

 180కి పైగా ప్రయాణికులు
 

180కి పైగా ప్రయాణికులు

ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, వైజాగ్, విజయవాడకు వెళ్లే ప్రయాణికులతో ట్రయల్ రన్ నిర్వహించారు.ఎయిర్ పోర్టు ఎంట్రీ పాయింట్ల దగ్గర కూడా ప్రయాణికులను ఈ సిస్టమ్ తో టెస్టింగ్ నిర్వహించారు. ఇప్పటివరకూ స్వచ్ఛందంగా 180కి పైగా ప్రయాణికులు తమ FR ఫేషియల్ రికగ్నైజేషన్ లో సైన్ అయ్యారని, ఒక రోజులో 70శాతం మంది ఈ విధానాన్ని వినియోగించుకున్నట్టు ఎయిర్ పోర్టు అధికారి ఒకరు తెలిపారు.

త్వరలో ఈ-పాస్ పోర్టులు

త్వరలో ఈ-పాస్ పోర్టులు

దేశీయ ప్రయాణికులందరికి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ విధానం వల్ల సమయం ఆదా కావడంతో పాటు ప్రయాణికులు ఈజీగా విమానం బయల్దేరే సమయానికి బోర్డింగ్ చేరేందుకు వీలు పడుతుందని అధికారి చెప్పారు. ఇదిలా ఉంటే ఇండియాలో త్వరలో ఈ-పాస్ పోర్టులు కూడా జారీ చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా భారత ఎంబసీ నుంచి అన్ని రకాల పాస్ పోర్టు సేవలు అందించేలా పాస్ పోర్టు సిస్టమ్ ను సెంటర్ లైజ్ చేయడంపై వర్క్ చేస్తున్నట్టు ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది.

Best Mobiles in India

English summary
Hyderabad Airport Becomes India's First To Introduce Facial Recognition For Passengers

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X