హైదరాబాద్ పేలుళ్లు.. ‘ఆ వీడియోలో ఏముంది’?

Posted By:

హైదరాబాద్ పేలుళ్లు.. ‘ఆ వీడియోలో  ఏముంది’?
దేశవ్యాప్తంగా అలజడి రేపిన హైదరాబాద్ జంట పేలుళ్ల ఉదంతం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. సంఘటనా ప్రాంతం దిల్‌షుక్‌నగర్‌లో ఎన్ఐఏ బృందం చేపడుతున్న ముమ్మర దర్యాప్తు కీలక ఆధారాలను రాబడుతోంది. ఈ కేసు పరిశోధనలో భాగంగా అనుమానితులుగా భావిస్తున్న ఇద్దరు వ్యక్తులకు సంబంధించి 20 నిమిషాల నిడివి కలిగిన ఓ వీడియో ఫుటేజ్‌ను ఎన్ఐఏ బృందం సేకరించింది. ఈ దృశ్యాలను సంఘటనాస్థలికి సమీప ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఓ ట్రాఫిక్ నిఘా కెమెరా ద్వారా పొందినట్లు తెలుస్తోంది.

పేలుడు సంభవించిన రెండు ప్రాంతాల్లో ఆధునిక పేలుడు పదార్ధంతో కూడిన సైకిల్ బాంబులను అమర్చినట్లు దర్యాప్తు బృందం ఓ నిర్ధారణకు రావటంతో సంఘటనకు కొంత సమయం ముందు సైకిల్‌తో ఆ ప్రాంతంలో తచ్చిటలాడిన అనుమానాస్పద వ్యక్తుల దృశ్యాల పై దృష్టిసారించటంతో సదరు వీడియో కీలకంగా మారింది.

అదో వింత..‘మనిషికి కుక్క తలకాయ్'

వీడియో ఫుటేజ్ వివరాలు.....సంఘటనకు కొద్ది నిమిషాల మందే అంటే సాయంత్రం 6.30 నిమిషాల ప్రాంతంలో పచ్చరంగు టీషర్ట్ ధరించిన ఓ వ్యక్తి పాత మోడల్ సైకిల్ పై కోణార్క్ థియేటర్ వైపు ట్రాఫిక్‌ను చేధించకుంటూ తన ప్రయాణాన్ని సాగించినట్లు వీడియో ఫుటేజ్ తెలుపుతోంది. తెల్లషర్ట్ ధరించిన మరో పాదాచారి (అనుమానితుడిగా భావిస్తున్న వ్యక్తి) సైకిలిస్ట్‌ను వెంబడిస్తూ (సూచనలు చేస్తూ) కోణార్క్ థియేటర్ వైపు అడుగులు వేసినట్లు వీడియో తెలుపుతోంది. మరికొద్ది సేపటకి పచ్చరంగు షర్ట్ ధరించిన వ్యక్తి తన సైకిల్‌ను నిర్ధేసిత ప్రాంతంలో పార్క్ చేసి జంక్షన్ గుండా నడుచుకుంటూ వచ్చేసాడు.

సదరు వీడియోను రికార్డ్ చేసిన ఐకెన్‌టెక్ కెమెరా ( Icantek camera) అనుమానితుల ముఖాలను స్పష్టంగా రికార్డ్ చేయటంలో విఫలమైంది. ఈ వీడియో క్లిప్పింగ్‌తో పాటు మరో 14 కెమెరాల నుంచి సేకరించిన వీడియోలను దర్యాప్తు బృందం అధ్యయనం చేస్తోంది. వీడియో ఫుటేజ్‌లోని దృశ్యాలపై మరింత స్పష్టత రాబట్టే క్రమంలో కీలక వీడియో క్లిప్పింగ్‌లను నగరంలోని ప్రముఖ ఫిల్మ్ లేబొరేటరీకి తరలించినట్లు సమాచారం అక్కడ కూడా ఆ వ్యవస్థ లేకపోవటంతో ముంబయ్‌కు పంపినట్లు తెలుస్తోంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting