ఆన్‌లైన్ మాయాబజార్ లాంటిది , ఆధార్ డేటా లీక్‌పై హైకోర్టు గరం

|

ఓట్ల తొలగింపు వ్యవహారం తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తుంటే .. ఓటరు జాబితా నుంచి ఆధార్ డేటా తొలగించడానికి హైకోర్టు తిరస్కరించింది. ఓటర్ల జాబితాకు అనుసంధానం చేసిన ఆధార్ డేటాను తొలగించాలనే ఆదేశాలు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. ఓటర్ల జాబితా సవరణకు ఏరకమైన సాప్ట్ వేర్ వాడుతున్నారో వివరిస్తూ కౌంటర్ వేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే.

ఆన్‌లైన్ మాయాబజార్ లాంటిది , ఆధార్ డేటా లీక్‌పై హైకోర్టు గరం

 

ఇదిలా ఉంటే డూప్లికేట్‌ ఓటర్లను తొలగించేందుకు ఎన్నికల సంఘంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు పంచుకున్న సమాచార వివరాలను బహిర్గతం చేసేలా ఆదేశించాలంటూ దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది.

గోప్యత హక్కుకు ..

గోప్యత హక్కుకు ..

ఒక పక్క సమాచారాన్ని ఎన్నికల సంఘంతో పంచుకోవడం గోప్యత హక్కుకు భంగమని చెబుతున్న పిటిషనర్‌... మరోపక్క దాన్ని బహిర్గతం చేయాలని కోరడంలో అర్థం లేదని స్పష్టం చేసింది.

అడ్డుకోవడం అసాధ్యం

అడ్డుకోవడం అసాధ్యం

ఓటరు కార్డుతో అనుసంధానించిన సమాచారాన్ని తొలగించడం అంత సులభం కాదని పేర్కొంది. ఆన్‌లైన్‌ అన్నది ఓ మాయాబజార్‌ వంటిదని, అందులో ఓసారి సమాచారాన్ని బహిర్గతం చేస్తే దాన్ని నిమిషాల్లో లక్షల్లో కాపీ చేసుకుంటారని, దాన్ని అడ్డుకోవడం అసాధ్యమని తెలిపింది.

ప్రాథమిక పరిజ్ఞానం ప్రకారం

ప్రాథమిక పరిజ్ఞానం ప్రకారం

ఒకవేళ ఆ సమాచారాన్ని తొలగించాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ తమకున్న ప్రాథమిక పరిజ్ఞానం ప్రకారం ఆ సమాచారాన్ని పునఃసృష్టించుకునే పరిజ్ఞానం ఇప్పుడు అంతటా ఉందని హైకోర్టు అభిప్రాయపడింది.

లోతుగా విచారణ
 

లోతుగా విచారణ

అయితే ఆధార్‌ కార్డుతో అనుసంధానించిన సమాచారాన్ని తొలగించే అంశంపై మాత్రం లోతుగా విచారణ జరుపుతామని తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ వి. రామసుబ్రమణియన్, జస్టిస్‌ పి.కేశవరావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

సాఫ్ట్‌వేర్, కంప్యూటర్‌ ప్రోగ్రాం ద్వారా

సాఫ్ట్‌వేర్, కంప్యూటర్‌ ప్రోగ్రాం ద్వారా

ఓటర్ల జాబితా తయారీ సమయంలో చట్టం గుర్తించని సాఫ్ట్‌వేర్, కంప్యూటర్‌ ప్రోగ్రాం ద్వారా ఓట్లను తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని, అసలు జాబితాలో మార్పుచేర్పులకు అనుసరిస్తున్న విధానాన్ని, అందుకు ఉపయోగిస్తున్న సాఫ్ట్‌వేర్‌ వివరాలను వెల్లడించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్‌లోని మియాపూర్‌కు చెందిన ఇంజనీర్‌ కొడలి శ్రీనివాస్‌ హైకోర్టులో గతేడాది పిల్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Hyderabad HC: Internet a 'maya bazaar', Aadhaar data may stay online

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X