ప్రపంచంలో అత్యధిక CCTV నిఘా నగరాల టాప్ జాబితాలో చెన్నై, హైదరాబాద్

|

డిజిటల్ యుగం చాలా రోజుల కిందటే ప్రారంభం అవ్వడంతో ఇప్పుడు ప్రజలు నిఘా ప్రపంచంలో నివసిస్తున్నారు. సిసిటివి నిఘా అనేది ఇప్పుడు అడుగడుగునా అత్యద్భుతంగా మారింది. వీధులు, కార్యాలయాలు, దుకాణాలతో పాటుగా ఇంటి వద్ద మరియు సాధారణ ప్రదేశాలలో దాదాపు ప్రతిచోటా సిసిటివి కెమెరాలను ఉంచడానికి ప్రజలు ఇష్టపడుతున్నారు. ఈ సిసిటివి నిఘా ఆధారంగా చాలా మంది నేరస్థులు పట్టుబడ్డారు మరియు క్రైమ్ కూడా గత 5 సంవత్సరాలతో పోలిస్తే తగ్గాయి. అయితే ఏ దేశాలలోని నగరాలూ అధికంగా సిసిటివి కెమెరాలను ఉపయోగిస్తున్నారో వంటి వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

అత్యధిక CCTV నిఘా నగరాల సర్వే

అత్యధిక CCTV నిఘా నగరాల సర్వే

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన 130 నగరాలను ఎంచుకొని సర్ఫ్‌షార్క్ సర్వే చేసి ఇచ్చిన నివేదిక ప్రకారం సిసిటివి కెమెరాలు అనేవి ముఖ్యంగా వ్యాపారస్తులకు మరియు ఆఫీసు కార్యాలయాలలో ఒక ఆయుధంగా మారాయి. ప్రపంచం మొత్తం ఇప్పుడు కెమెరా యొక్క కంటిలో మునిగిపోయిదా అనే విధంగా ఉంది అని సర్వే వెల్లడించింది. అత్యధిక జనాభా కలిగిన నగరాలు ఎటువంటి దట్టమైన సిసిటివి నెట్‌వర్క్‌లను కలిగి ఉన్నాయో సర్వే ప్రత్యేకంగా విశ్లేషించారు. అత్యధిక సిసిటివి కెమెరాలను కలిగిన నగరం బయట దేశాలు అయిన అమెరికా, చైనాలో ఉన్నాయి అనుకుంటే పొరపాటే. ఈ జాబితాలో మొదటి స్థానంలో గల నగరం ఇండియాలోని చెన్నై ప్రాంతం కావడం విశేషం.

సిసిటివి కెమెరాలను అధికంగా కలిగిన జాబితాలో ఇండియా నగరాల స్థానాలు

సిసిటివి కెమెరాలను అధికంగా కలిగిన జాబితాలో ఇండియా నగరాల స్థానాలు

సర్ఫ్‌షార్క్ సర్వే ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రపంచంలో చదరపు కిలోమీటరుకు అత్యధిక సిసిటివిలను కలిగి ఉన్న నగరం జాబితాలో మొదటి స్థానంలో తమిళనాడులోని చెన్నై ఉంది. ఇక్కడ ఒక చదరపు కిలోమీటరుకు మొత్తంగా 657 సిసిటివిలను కలిగి ఉన్నాయి. ఈ జాబితాలో రెండవ నగరం కూడా ఇండియాకు చెందినది ఉండడం మరొక గొప్ప విషయం. అది కూడా మన తెలుగు రాష్ట్రల యొక్క రాజధాని నగరం హైదరాబాద్ కావడం విశేషం. ఈ భాగ్యనగరంలో చదరపు కిలోమీటరుకు అధిక సంఖ్యలో 480 సిసిటివి కెమెరాలను కలిగి ఉన్నాయి. ఇండియా యొక్క రాజధాని న్యూఢిల్లీ చదరపు కిలోమీటరుకు 289 సిసిటివి కెమెరాలతో ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్నది.

సిసిటివి కెమెరాలను అధికంగా కలిగిన జాబితాలో ఇతర దేశాల స్థానాలు

సిసిటివి కెమెరాలను అధికంగా కలిగిన జాబితాలో ఇతర దేశాల స్థానాలు

సిసిటివి కెమెరాలను అధికంగా కలిగిన నగరాల జాబితాలో మూడవ స్థానాన్ని చైనా దేశం యొక్క హర్బిన్ నగరం దక్కించుకుంది. ఇక్కడ ఒక చదరపు కిలోమీటరుకు అధికంగా 411 సిసిటివి కెమెరాలను కలిగి ఉన్నాయి. నాల్గవ స్థానంలో UK కి చెందిన లండన్ ఉంది. ఇక్కడ ఒక చదరపు కిలోమీటరుకు అధికంగా 399 సిసిటివి కెమెరాలను కలిగి ఉంది. ఈ జాబితాలో ఐదవ స్థానంలో చైనాకు చెందిన జియామెన్ నగరం ఉంది. ఇక్కడ చదరపు కిలోమీటరుకు 385 సిసిటివికెమెరాలు ఉన్నాయి. తరువాత స్థానాలలో చైనాకు చెందిన రెండు నగరాలు ఉన్నాయి. ఇవి చదరపు కిలోమీటరుకు 350 సిసిటివిలతో చెంగ్డు మరియు 319 సిసిటివిల తైయువాన్ నగరాలు వరుసగా ఉన్నాయి. చివరిగా చైనాకు చెందిన మరొక రెండు నగరాలు - కున్మింగ్ మరియు రాజధాని బీజింగ్ వరుసగా చదరపు కిలోమీటరుకు 281 మరియు 278 సిసిటివి కెమెరాలతో చివరి రెండు స్థానాలలో కొనసాగుతున్నాయి.

టాప్ 10 జాబితాలో ఆరు చైనా నగరాలు

టాప్ 10 జాబితాలో ఆరు చైనా నగరాలు

సిసిటివి నిఘా కెమెరాలను అధికంగా కలిగిన నగరాల జాబితాలో ఎవరూ ఆశ్చర్యపోనవసరం లేకుండా చైనాకు చెందిన ఆరు నగరాలు అత్యధిక సిసిటివి సాంద్రత కలిగిన టాప్ 10 నగరాల్లో జాబితా చేయబడ్డాయి. విశేషమేమిటంటే ఈ జాబితాలో చైనా యొక్క రాజధాని బీజింగ్ 10 వ స్థానంలో ఉన్నప్పటికీ 1.1 మిలియన్లకు పైగా సిసిటివి కెమెరాలతో ప్రపంచంలోని ఇతర నగరాలతో పోల్చినప్పుడు ఇది అత్యధిక సిసిటివి సంస్థాపనలను కలిగి ఉంది.

Best Mobiles in India

English summary
Hyderabad is Among The Top 20 Most Surveilled Cities in The World

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X