విడాకుల కోసం భార్య అశ్లీల ఫొటోలు వాట్సాప్‌లో పెట్టిన ఘనుడు
భార్య నుంచి విడాకులు తీసుకోవాలన్న ఆలోచనతో ఆమె నగ్నంగా ఉన్న చిత్రాలను వాట్సాప్ స్టేటస్‌లో పెట్టి పిచ్చిరాతలు రాసిన భర్తను అతడి ప్రియురాలిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు.
కట్టుకున్న భర్తే భార్య పరువు తీశాడు. భార్య నుంచి విడాకులు తీసుకోవాలన్న ఆలోచనతో ఆమె నగ్నంగా ఉన్న చిత్రాలను వాట్సాప్ స్టేటస్‌లో పెట్టి పిచ్చిరాతలు రాసిన భర్తను అతడి ప్రియురాలిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ కథనం ప్రకారం...

ఆలపాటి తులసీదాస్ అనే వ్యక్తి....
హైదరాబాద్ వనస్థలిపురానికి చెందిన ఆలపాటి తులసీదాస్ అనే వ్యక్తి ఆస్ట్రేలియాలో బీబీఏ పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉన్నాడు. ఈయనకు వివాహమైంది.

మౌనిక అనే మహిళ...
అలాగే, ఎస్వీ యూనివర్సిటీ నుంచి ఫుడ్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేసిన మౌనిక అనే మహిళ కూడా మనస్పర్థల వల్ల భర్త ఈశ్వర్ నుంచి విడాకులు తీసుకుని ఒంటరిగా నివశిస్తోంది. ఈమె హైటెక్ సిటీలో మేనేజర్‌గా పనిచేస్తోంది.

మౌనిక, తులసీదాస్‌కు పరిచయం అయ్యింది....
అయితే గతేడాది బంజారాహిల్స్‌లో జరిగిన సెక్యూరిటీ సర్వీసెస్ మీటింగ్ లో మౌనిక అనే యువతి, తులసీదాస్‌కు పరిచయం అయ్యింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. వీరిద్దరి గురించి తెలుసుకున్న తులసీదాస్ భార్య వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు తులసీదాస్ ను అరెస్టు చేశారు.

భార్యతో తులసీదాస్ సన్నిహితంగా ఉన్న ఫొటోలు తీసి మౌనిక పంపాడు...
ఈ విషయాన్ని జీర్ణించుకోలేని తులసీదాస్,మౌనికలు కలిసి ఆమె ప్రతిష్టను దిగజార్చి, తొందరాగా విడాకులు ఇచ్చేలా ప్రణాళిక రచించారు. గతంలో భార్యతో తులసీదాస్ సన్నిహితంగా ఉన్న ఫొటోలు తీసి మోనికాకు పంపాడు. మౌనిక ఆ ఫొటోలను వాట్సాప్ స్టేటస్‌లో ‘డబ్బు కోసం ఏమైనా చేస్తుంది భర్తను జైలుకు కూడా పంపించింది అని పెట్టింది. అంతటితో ఆగకుండా అభ్యంతరక వ్యాఖ్యలను మెసేజ్ చేశారు.

పోలీసులు వారిద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు....
దీంతో ఆమె రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు..


Click it and Unblock the Notifications








