మహిళలను ముట్టుకుంటే కరెంట్ షాకే,స్మార్ట్ బ్యాంగిల్స్ వచ్చేశాయి

By Gizbot Bureau
|

ఈ రోజుల్లో ఆకతాయిలు, చైన్ స్నాచర్ల నుంచి మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. తమను తాము రక్షించుకునేందుకు మహిళలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఆకతాయిల ఆగడాలు ఆగడం లేదు. ఒంటరిగా మహిళలు కనిపిస్తే చాలు చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. మెడలో చైన్ లాక్కెళ్లి చోరీలకు పాల్పడుతున్నారు. ఇందులో భాగంగానే ఆపదలో ఉన్న మహిళలను ఆదుకోడానికి ఇటీవల ఎన్నో గ్యాడ్జెట్స్ అందుబాటులోకి వచ్చాయి. మొబైల్ యాప్స్ నుంచి స్మార్ట్ వాచ్‌లు వరకు ప్రతి ఒక్కటీ వారి రక్షణకు ఉపయోగపడుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులు 'స్మార్ట్ బ్యాంగిల్స్’ పేరుతో తయారు చేసిన గాజులు మహిళలకు మరింత భద్రతను అందిచనున్నాయి. అవి వారికి రక్షణ కవచంలా ఉపయోగపడనున్నాయి.

మహిళలను ముట్టుకుంటే కరెంట్ షాకే,స్మార్ట్ బ్యాంగిల్స్ వచ్చేశాయి

 

మహిళలకు భద్రత కోసం హైదరాబాదీ యువకులు ఇద్దరూ ఓ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా మహిళలు చేతికి గాజులు ధరిస్తుంటారు. ఆ గాజులతోనే ఆకతాయిల ఆట కట్టించడం ఎలా అని ఆలోచించారు. అప్పుడే వారికి ఓ గొప్ప ఐడియా వచ్చింది. స్మార్ట్ బ్యాంగిల్స్ కనిపెట్టారు. వారే గాది హరీశ్ (23), అతని స్నేహితుడు సాయి తేజ. వీరిద్దరూ కలిసి ఈ హ్యాండ్ బ్యాంగిల్ యాక్ససరీ కనిపెట్టారు. 23 ఏళ్ల గాది హరీష్ తన స్నేహితుడు సాయి తేజాతో కలిసి ఈ గాజులను తయారు చేశాడు. ఈ గాజులను ఎవరైనా లాక్కోడానికి ప్రయత్నించినా, గట్టిగా పట్టుకున్నా షాక్ కొడతాయి. అంతేకాదు.. వెంటనే ఆ గాజులోని సెక్యూరిటీ వ్యవస్థ యాక్టీవ్ అవుతుంది. పోలీసులకు, ఆ గాజులు ధరించే మహిళ బంధువులకు వెంటనే మెసేజ్‌లు చేరుకుంటాయి. అలాగే, ఆమె ఉండే లోకేషన్‌ను కూడా తెలుపుతాయి.

ఆపదను గుర్తించగానే బాధితురాలు ఆ గాజును ఒక పక్కకు తిప్పితే చాలు. మొత్తం వ్యవస్థంతా యాక్టివ్ అవుతుంది.వెంటనే షాకింగ్ సిగ్నల్స్ రిలీజ్ అవుతాయి. కరెంట్ షాక్ తగులుతుంది.. దీంతో వేధించే వ్యక్తి దగ్గరికి రావడానికి భయపడతాడు. అంతేకాదు.. ఈ స్మార్ట్ గాజుల నుంచి లైవ్ లొకేషన్ కూడా షేర్ అవుతుంది. పోలీసులు, బంధువులకు అలర్ట్ వెళ్లేలా డిజైన్ చేశారు.ఈ డివైజ్‌ను 'సెల్ఫ్ సెక్యూరిటీ బ్యాంగిల్ ఫర్ వుమన్’ అని పిలుస్తారు. మహిళల చేతిని గట్టిగా పట్టుకుని ఎవరైనా వంచినప్పుడు ఈ డివైజ్ యాక్టివేట్ అవుతుంది. అప్పుడు అందులోనుంచి షాకింగ్ సిగ్నల్స్ రిలీజ్ అవుతాయి. వేధించిన వ్యక్తికి షాక్ తగులుతుంది. వెంటనే లైవ్ లొకేషన్ దగ్గరలోని పోలీసు స్టేషన్లకు, బంధువులకు అలర్ట్ వెళ్తుంది. ఈ డివైజ్ గురించి హరీశ్ మాట్లాడుతూ 'మహిళల భద్రత కోసం నా స్నేహితుడు సాయి తేజతో కలిసి నేను ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేశాను. ఈ డివైజ్ మార్కెట్లలో దొరికే ఇతర డివైజ్ ల కంటే పూర్తిగా విభిన్నంగా ఉంటుంది. ఈ ప్రాజెక్టను పూర్తి చేయడానికి ప్రభుత్వం సహకరించాలని హరీష్ కోరాడు.

 
Most Read Articles
Best Mobiles in India

English summary
Man in Telangana’s Hyderabad develops ‘smart bangle’ for women’s safety. It sends shock waves

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X