రూ. 40 వేల కెమెరాకు బదులుగా బుడ్డ బొమ్మ, కొంపముంచిన ఫ్లిప్‌కార్ట్ సమాధానం

Written By:

మీరు ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా..అయితే చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే.. లేకుంటే మీ ఆర్డర్ లో మీకు తెలియని అద్భుతాలు మీ ఇంటికి రావచ్చు. అవి చూసి మీరు షాక్ తినవచ్చు. అదేంటి అనుకుంటున్నారా..అయితే బాబు కధను ఓ సారి చూడండి.

ఈ సారి జియో కొట్టే దెబ్బతో అన్నీ అబ్బా అనాల్సిందే...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫ్లిప్‌కార్ట్ లో కెమెరాను ఆర్డర్ చేసిన వ్యక్తికి పార్సిల్‌లో రాయి,

ఆన్‌లైన్‌ రీటైలర్‌ ఫ్లిప్‌కార్ట్ లో కెమెరాను ఆర్డర్ చేసిన వ్యక్తికి పార్సిల్‌లో రాయి, పిల్లలు ఆడుకునే రెండు బొమ్మ కెమెరాలు రావడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. హైదరాబాద్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనపై ఎల్బీనగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

రూ.41 వేల విలువ

వివరాల్లోకి వెళితే.. నాగోల్ మమతా నగర్‌కాలనీకి చెందిన వినయ్(24) డీఎస్‌ఎల్‌ ఆర్‌ కెమెరా కోసం ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ చేశారు. రూ.41 వేల విలువైన కెనాన్‌ ఈవోఎస్‌ 700డి కెమెరాను ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేశారు.

డెలివరీ బాయ్ ఇచ్చిన పార్శిల్ విప్పి చూస్తే

తీరా సెప్టెంబర్‌ 5వ తేదీ సాయంత్రం డెలివరీ బాయ్ ఇచ్చిన పార్శిల్ విప్పి చూస్తే అందులో రాయి, డమ్మి కెమెరాలు దర్శనమిచ్చాయి. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సీసీ ఫుటేజీలను

కేసు నమోదు చేసిన పోలీసులు పార్శిల్ ఎక్కడి నుంచి వచ్చింది, డెలివరీ బాయ్ ఎవరు, ఫోన్ నంబర్ తదితర వివరాలను ఆరా తీస్తున్నారు. అలాగే సీసీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నామని ఎల్‌బీ నగర్‌ ఎస్‌ఐ తెలిపారు.

ఆరోపణలను తిరస్కరించిన ఫ్లిప్‌కార్ట్‌

అయితే ఈ ఆరోపణలను ఫ్లిప్‌కార్ట్‌ తిరస్కరించింది. కస‍్టమర్‌ కేర్‌ ద్వారా సంప్రదించినపుడు అత్యంత భద్రత మధ్య తమ ప్యాకింగ్‌ ఉంటుందనీ, డెలివరీకంపెనీ మోసం చేసి ఉంటుందని, దీనికి తమ బాధ్యత ఏమీ లేదని సమాధానం ఇవ్వడం గమనార్హం.

ఆన్‌లైన్ మోసాలు

ఆన్‌లైన్ మోసాలు ఎంతలా జరుగుతున్నాయనేదానికి నిలువెత్తు నిదర్శనం ఈ ఉదంతం.. సో..ఇకపై ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసేటపుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయాలని మనివి. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
Hyderabad Man Orders DSLR Camera Worth Rs 41,000 On Flipkart, Gets Toy Camera In The Packet Read more At Gizbot Telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting