మైక్రోసాఫ్ట్ సీఈఓగా మన హైదరాబాదీ సత్య నాదెళ్ల..?

Posted By:

మైక్రోసాఫ్ట్ కంపెనీ సీఈఓ పదవికి మన తెలుగు వ్యక్తిని ఎంపిక చేస్తున్నట్లు అమెరికా మీడియాలో వార్తలు వస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ కొత్త సీఈఓ నియామకానికి సంబంధించి గత 5 నెలలగా కసరత్తులు జరుగుతున్న విషయం తెలుసిందే. ఈ నేపధ్యంలో హైదరబాదీ సత్య నాదెళ్ల (46) సీఈఓగా నియామకం చేసే అవకాశముందని అమెరికా మీడియా పేర్కొంది. ఈ నియామకం ఖరారైనట్లయితే మైక్రోసాఫ్ట్ కంపెనీ మూడవ సీఈఓగా సత్య నాదెళ్ల చరిత్రలో నిలుస్తారు.

 మైక్రోసాఫ్ట్ సీఈఓగా మన హైదరాబాదీ..?

ప్రస్తుతం సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ కంపెనీ క్లౌండ్ అండ్ ఎంటర్‌ప్రైజెస్ విభాగానికి ఎగ్జిక్యూటివ్ వెస్‌ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ ప్రస్తుత సీఈఓ స్టీవ్ బామర్ తాను రిటైర్ కావాలనుకుంటున్నట్లు ప్రకటించిన నేపధ్యంలో మైక్రోసాఫ్ట్ కొత్త సీఈఓ కోసం వెతుకులాట ప్రారంభించింది.

సత్య నాదెళ్ల నేపధ్యం....

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జన్మించిన సత్యనాదెళ్ల బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ప్రాథమిక విద్యను అభ్యసించారు. మణిపాల్ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ ఇంజనీరింగ్ డిగ్రీ పట్టాను పొందిన సత్య నాదెళ్ల ఆ తరువాత విస్కోన్సిన్ విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటింగ్ సైన్స్ విభాగంలో ఎంఎస్, యూనివర్శిటీ ఆఫ్ చికాగో నుంచి ఎంబీఏ విద్యను పూర్తిచేసారు. మైక్రోసాఫ్ట్ కంపెనీలో తన ఉద్యోగ ప్రస్థానాన్ని సత్య నాదెళ్ల 1992 నుంచి ప్రారంభించారు. మైక్రోసాఫ్ట్ బింగ్ సెర్చ్ ఇంజన్ అభివృద్ధికి నాదెళ్ల కృషి కీలకం.

ఓ టెక్ న్యూస్ వెబ్‌సైట్ గురువారంనాడు మైక్రోసాఫ్ట్ సిఇవో నియామకంపై కథనాలను వెలువరించింది. సత్య నాదెళ్లకే ఎక్కువ అవకాశాలున్నాయని, వచ్చే వారంలో ఈ విషయంపై ప్రకటన వెలువడే అవకాశాలున్నాయని చెబుతున్నారు. స్టీవ్ బలిమేర్ స్థానంలో సమర్థుడైన వ్యక్తిగా నాదెళ్లను పరిగణిస్తున్నట్లు అమెరికా మీడియా వ్యాఖ్యానిస్తోంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot