హైటెక్ సిటీకి మెట్రో వచ్చేసింది, జర్నీ మరింత సులువు ఇక
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా హైదరాబాద్ హైటెక్ సిటీ వాసులందరికీ శుభవార్తను తీసుకొచ్చింది హైదరాబాద్ మెట్రో రైలు. ఇప్పటికే నగరంలో పలుచోట్ల హల్‌చల్ చేస్తున్న మెట్రో హైటెక్‌సిటీలో కూడా మొదలుకానుంది. ద
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా హైదరాబాద్ హైటెక్ సిటీ వాసులందరికీ శుభవార్తను తీసుకొచ్చింది హైదరాబాద్ మెట్రో రైలు. ఇప్పటికే నగరంలో పలుచోట్ల హల్‌చల్ చేస్తున్న మెట్రో హైటెక్‌సిటీలో కూడా మొదలుకానుంది. దీనికి మరెంతో సమయం లేదు. ఇప్పటికే ట్రయల్స్ పూర్తి చేసుకుని రూట్ కోసం పర్‌ఫెక్ట్‌గా సిద్ధమైంది.హైదరాబాద్‌లో తొలిసారిగా 2017 నవంబరు 29న ప్రారంభమైంది మెట్రో. నగరంలో ట్రాఫిక్‌ను తగ్గించడమే కాకుండా ప్రయాణం వేగవంతం అయ్యేందుకు దోహదపడుతుంది.

ఇప్పుడిక అమీర్‌పేట్ నుంచి హైటెక్ సిటీ వరకూ రూట్‌లో ప్రయాణించేందుకు సిద్ధమైన మెట్రో రైలు హైదరాబాద్‌లో కొత్త అధ్యాయాన్ని లిఖించేందుకు సిద్ధమైపోయింది.

హైదరాబాద్ సిటీలో తిరిగేందుకు
ఈ మేర హైదరాబాద్ మెట్రో రైల్ డిపార్టెమెంట్ తన అధికారిక ట్విట్టర్ ద్వారా పోస్టు చేసింది. 'హైదరాబాద్ సిటీలో తిరిగేందుకు మెట్రో రైలు అన్ని విధాలా సిద్ధమైపోయింది. మరి రైలు ప్రారంభమయ్యేందుకు ఇంకా రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఇదొక గొప్ప క్షణం.' అని రాసుకొచ్చింది.

ఉద్యోగులు పెద్ద సంఖ్యలో..
వాస్తవానికి అమీర్‌పేట-హైటెక్ సిటీ మార్గంలో మెట్రో రైళ్ల కోసం ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో పనిచేసే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులతో పాటు, ఇతర కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.

ట్రాఫిక్ సమస్యలతో..
నగరంలోని నలుమూలల నుంచి వీరు పనిచేసే ప్రాంతాలకు వస్తున్నారు. ట్రాఫిక్ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ మార్గంలో రైళ్లు నడపడానికి మార్గం సుగమం కావడంతో వారికి ఎంతో ఊరట లభిస్తుంది. ఈ మార్గంలో అమీర్‌పేట, మధురానగర్, యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్ రోడ్‌నంబర్-5, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, పెద్దమ్మగుడి, మాదాపూర్, దుర్గం చెరువు, హైటెక్ సిటీ స్టేషన్లున్నాయి.

రెండు కారిడార్లలో పూర్తి స్థాయిలో..
ఈ మార్గం కూడా అందుబాటులోకి వస్తుండటంతో ఇప్పుడు హైదరాబాద్‌లో రెండు కారిడార్లలో పూర్తి స్థాయిలో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం కారిడార్-1లో మియాపూర్ నుంచి ఎల్.బి.నగర్ వరకు 29 కి.మీ మేర, కారిడార్-3లో నాగోల్ నుంచి అమీర్‌పేట వరకు 17 కి.మీ మేర మెట్రో మొత్తం 46 కి.మీ వరకు సేవలు అందుబాటులో ఉన్నాయి. తాజాగా కారిడార్-3లో మరో 10 కి.మీ దూరం మెట్రో పరుగులు పెడుతుంది.

హైటెక్‌సిటీ మార్గంలో...
అమీర్‌పేట్, హైటెక్‌సిటీ మార్గంలో 9 స్టేషన్లు అవి అమీర్‌పేట్ , మధురానగర్(తరుణి),యూసుఫ్‌గూడ,జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్5,జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు,పెద్దమ్మ గుడి ,మాదాపూర్,దుర్గం చెరువు,హైటెక్‌సిటీ. అమీర్‌పేట, హైటెక్‌సిటీ మధ్య 11 కిలోమీటర్లు కూడా అందుబాటులోకి రానుంది.మొదటి దశలో మిగిలిన జేబీఎస్, ఎంజీబీఎస్ మధ్య 10 కిమీల దూరం, ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా మెట్రో రూట్ కోసం పనులు జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications








