సెల్ ఫోన్ కోసం స్నేహితుడి ప్రాణాలు తీసిన ఓ జులాయి...

రోజురోజుకి మానవత్వం మట్టిగలిసి పోతుంది. పని పాటా లేని ఒక జులాయి తనను నమ్మి వచ్చిన స్నేహితుడ్ని తన దగ్గర ఉన్న సెల్ ఫోన్ ను కొట్టేయలే అనే ఉద్దేశంతో కర్రతో బాధి చనిపోయాక శవానికి నిప్పు అంటించేసాడు.

By Anil
|

రోజురోజుకి మానవత్వం మట్టిగలిసి పోతుంది. పని పాటా లేని ఒక జులాయి తనను నమ్మి వచ్చిన స్నేహితుడ్ని తన దగ్గర ఉన్న సెల్ ఫోన్ ను కొట్టేయలే అనే ఉద్దేశంతో కర్రతో బాధి చనిపోయాక శవానికి నిప్పు అంటించేసాడు.హైదరాబాద్‌లోని రామంతాపూర్‌కు చెందిన డాగీ ప్రేమ్‌ (17) షిప్స్‌ జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు అయితే గత శుక్రవారం నుంచి తన కొడుకు ఇంటికి రాకపోయే సరికి పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు చేసారు.ఎట్టకేలకు సోమవారం పోలీసులు ఈ కేసును ఛేదించారు...... పూర్తి వివరాల్లోకి వెళ్తే

జులాయిగా తిరిగే ప్రేమ్ సాయి.....

జులాయిగా తిరిగే ప్రేమ్ సాయి.....

మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మండలం ఎదులాబాద్‌ గ్రామానికి చెందిన ప్రేమ్‌సాగర్‌ స్థానిక అంబేడ్కర్‌ సేవా సమితి కమ్యూనిటీ హాల్‌లో ఉండేవాడు.గతంలో అమెజాన్‌ డెలీవరీ బాయ్‌గా పనిచేసి మానేసిన ప్రేమ్‌సాగర్‌ జులాయిగా తిరుగుతు,వాయిదాల పద్ధతిలో కోనుగోలు చేసిన బైక్ కు సకాలంలో డబ్బులు కట్టలేక స్నేహితుల వద్ద అప్పు తీసుకొని చెల్లించేవాడు.ఉద్యోగం లేక ఆర్థిక ఇబ్బందులు ఎదురుకుంటున్న నేపథ్యంలో డాగీ ప్రేమ్‌ సెల్‌ఫోన్‌ను కొట్టేసి అప్పులు తీర్చాలని భావించాడు

ఇంటి ఎదురుగా ఉండటతో స్నేహం  కుదిరింది....

ఇంటి ఎదురుగా ఉండటతో స్నేహం కుదిరింది....

పాత రామంతాపూర్‌లో నివాసముంటున్న టైలర్‌ డాగీ సురేశ్‌కు ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడు డాగీ ప్రేమ్‌ (17) షిప్స్‌ జూనియర్‌ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుండేవాడు .అయితే ప్రేమ్ సాయి తన ఇంటి ఎదురుగ ఉండటం తో ఇద్దరికీ స్నేహం కుదిరింది.

స్నేహితులతో జాలిగా  కార్లలో తిరుగుదామని నమ్మించి....

స్నేహితులతో జాలిగా కార్లలో తిరుగుదామని నమ్మించి....

ఈ క్రమంలో జులై 13న సాయంత్రం ఔటర్‌ రింగ్‌రోడ్డుపై జాలీగా స్నేహితుల కార్లలో తిరుగుదామని ప్రేమ్‌ను నమ్మించాడు . దీంతో ప్రేమ్‌ రామంతాపూర్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో క్రికెట్‌ ఆడటానికి వెళుతున్నానని ఇంట్లో చెప్పి తనతో పాటు బయలుదేరాడు.

కర్రతో బాది శవానికి  పెట్రోల్‌ పోసి నిప్పటించాడు.....

కర్రతో బాది శవానికి పెట్రోల్‌ పోసి నిప్పటించాడు.....

ప్రేమ్‌సాగర్‌ తన బైక్‌ పై ప్రేమ్‌ను తీసుకెళ్లాడు. వెంట ఓ కర్ర ఉండటంతో ఎందుకని ప్రేమ్‌ ప్రశ్నించగా బండి టైర్‌ బురద తీయనడానికని చెప్పాడు. తర్వాత నాదర్‌గూల్‌ గ్రామంలోని ఓ పెట్రోల్‌ బంక్‌లో రెండు బాటిల్స్‌లో పెట్రోల్‌ కొట్టించాడు.ఆదిభట్ల ఔటర్‌ రింగ్‌ రోడ్డు వండర్‌లా ప్రధాన రహదారి వద్ద బైక్‌ను ఆపి తన స్నేహితుడిని కలుద్దామంటూ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకొని వెళ్ళాడు .అప్పుడు అనుమానం వచ్చిన ప్రేమ్‌ ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చావని గట్టిగా ప్రశ్నించగా స్నేహితులంతా ఇక్కడికే వస్తారంటూ మాటల్లో పెట్టి కర్రతో మెడమీద పదేపదే కొట్టడంతో ప్రేమ్‌ స్పృహ తప్పి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రేమ్ సాయి తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ప్రేమ్‌పై పోసి నిప్పంటించాడు. వెంటనే ప్రేమ్‌ వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను తీసుకుని అక్కడి నుంచి రామంతాపూర్‌కు బయలుదేరాడు.

కొడుకు ఎక్కడని ప్రేమ్‌ తల్లిదండ్రులు ప్రేమ్‌సాగర్‌ను ప్రశ్నించగా....

కొడుకు ఎక్కడని ప్రేమ్‌ తల్లిదండ్రులు ప్రేమ్‌సాగర్‌ను ప్రశ్నించగా....

ప్రేమ్ సాయి ఒక్కడే తిరిగి రావడంతో తమ కొడుకు ఎక్కడని ప్రేమ్‌ తల్లిదండ్రులు ప్రేమ్‌సాగర్‌ను అడగగా ప్రేమ్ ను రామంతాపూర్‌లోనే వదిలేశానని సమాధానం ఇచ్చాడు . రెండు రోజులైనా తమ కుమారుడు ప్రేమ్ ఇంటికి తిరిగి రాకపోవడంతో అతని తండ్రి సురేశ్‌కు అనుమానం వచ్చి ఉప్పల్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

సెల్‌ఫోన్‌ కోసమే చంపేశానని  ఒప్పుకున్నాడు....

సెల్‌ఫోన్‌ కోసమే చంపేశానని ఒప్పుకున్నాడు....

ప్రేమ్‌ సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా ఆదిభట్లలో ఉన్న మృతదేహన్ని పోలీసులు ఆదివారం కనుగున్నారు . ప్రేమ్‌సాగర్‌ తన కుమారుడిని తీసుకెళ్లాడంటూ మృతుడి తల్లిదండ్రులు పోలీసులకు చెప్పగా కేసును ఛేదించడం ప్రారంభించారు పోలీసులు . ప్రేమ్‌ కాల్‌డేటా ఆధారంగా ఎదులాబాద్‌లో ఉన్న నిందితుడు ప్రేమ్‌సాగర్‌ను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. రోజంతా ప్రేమ్ ను పోలీసులు విచారించగా పొంతన లేని సమాధానాలు చెప్పాడు.చివరకు ఆ నేరాన్ని సెల్‌ఫోన్‌ కోసమే చేశానని పోలీసుల దగ్గర ఒప్పుకున్నాడు.

 

 

Best Mobiles in India

English summary
In a shocking incident, a 17-year-old Intermediate student was murdered and set ablaze by his friend because he wanted to have his smartphone. After killing the victim, the accused, 20-year-old Premsagar, dumped the body on the city outskirts and set it afire. Based on clues from eyewitnesses, police nabbed the accused who confessed to the crime.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X