అమ్మాయిలా ఛాటింగ్ చేశాడు,బొక్కలో పడ్డాడు

By Gizbot Bureau
|

సోషల్ మీడియా రోజు రోజుకు శరవేగంగా పుంజుకుంటోంది. దానితో ఎన్నో ఉపయోగాలు ఉన్నప్పటికీ అంతే స్థాయిలో నష్టాలు ఉన్నాయి. చాలామంది సోషల్ మీడియా వల్ల తమ విలువైన జీవితాలను చేతులారా నాశనం చేసుకుంటున్నారు కూడా. ముఖ్యంగా ఫేస్‌బుక్‌ ద్వారా ఎంతోమంది బలయ్యారు. ఏకంగా అబ్బాయిలే అమ్మాయిల పేర్లతో ఖాతా తెరిచి ఛాటింగ్ చేస్తూ మోసం చేస్తున్నారు. ఇక అమ్మాయే కదా అని డీప్ ఛాటింగ్ లోకి వెళ్లి అబ్బాయిలు లేనిపోని సమస్యలు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఇదే రీతిలో అమ్మాయిలా చాటింగ్ చేసి ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ చేసిన 22ఏళ్ల హైదరాబాదీ బీటెక్ ఇంజినీర్ కటకటాలపాలయ్యాడు. పూర్తి వివరాల్లోకెళితే..

hyderabad techie held cyber fraud

మౌలాలీలోని హెబ్ బీ కాలనీకి చెందిన మహమ్మద్ మునీర్ అహ్మద్ మెలిన్ సోఫియా పేరుతో ఫేక్ ఫేస్‌బుక్ అకౌంట్ క్రియేట్ చేశాడు.మరో వ్యక్తి పంపిన స్నేహ వినతిని ఆమోదించి చాటింగ్‌ చేశాడు. అమ్మాయిలా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి ఆ వ్యక్తితో కొన్నిరోజుల పాటు చాటింగ్ చేశాడు. ఆ తర్వాత ఫిషింగ్ మాల్ వేర్ లింక్ పంపాడు.ఇతను ఎథికల్‌ హ్యాకింగ్‌ లో కొన్నొ మెలకువలు నేర్చుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. జడ్‌ షాడో’ అప్లికేషన్‌ ద్వారా రూపొందించిన ఫిషింగ్‌ లింక్‌ ను అతనికి పంపడంతో అది ఫిషింగ్‌ లింక్‌ అని తెలియని అవతలి వ్యక్తి దానిపై క్లిక్‌ చేశాడు. అంతే మునీర్‌.. సదరు అపరిచితుడి ఫేస్‌బుక్‌ ఖాతాలోకి చొరబడ్డాడు.

యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌ తెలుసుకొని వాటిని వెంటనే మార్చేశాడు. బ్యాంకు ఖాతా వివరాలనూ కొట్టేసి బెదిరించడం ఆరంభించాడు. వ్యక్తిగత వివరాలను అంతర్జాలంలో అప్‌లోడ్‌ చేస్తానని చెప్పడంతో బాధితుడు రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు సైబర్ ఫ్రాడ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు చివరికి టెకీ ఇంజినీర్ మహ్మద్ ను ట్రేస్ చేసి పట్టుకున్నారు.సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా మునీర్‌ నిర్వాకాన్ని గుర్తించారు. ప్రభుత్వోద్యోగి కుటుంబంలో పుట్టిన మునీర్‌ మరికొందరి ఖాతాలనూ హ్యాక్‌ చేసి ఉంటాడని భావించి దర్యాప్తు చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా అపరిచితులు పంపించే ఫిషింగ్‌ లింక్‌లను గుడ్డిగా క్లిక్‌ చేసి చిక్కులు కొనితెచ్చుకోవద్దని జలేంధర్‌రెడ్డి సూచించారు.

Best Mobiles in India

English summary
hyderabad techie held cyber fraud

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X