ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌‌లకు చక్కుల చూపించిన కిలాడీ దొంగలు

Written By:

ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లను బురిడీ కొట్టిస్తున్న ఇద్దరు యువకులను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే... గోల్కొండ ప్రాంతానికి చెందిన యాహియా మహ్మద్ ఇషాకీ (19) సైకాలజీ చదువుతున్నాడు. ఇతడు అమెజాన్ వెబ్‌సైట్‌లో పుస్తకాల విక్రేతగా రిజిస్టర్ అయి, ఆన్‌లైన్ ఆర్డర్స్ పై కొన్ని రకాలైన పుస్తకాలను విక్రయిస్తున్నాడు.

 ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌‌లకు చక్కుల చూపించిన కిలాడీ దొంగలు

ఈ నేపథ్యంలో ఈ-కామర్స్ సంస్థలు వస్తువులను ప్యాక్ చేసే విధానాన్ని పూర్తి అవపోసన పట్టాడు. ఇతడికి సోదరుడు వరసైన మహ్మద్ అన్సారీ (24) బీబీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఇషాకీకి ఈ-కామర్స్ సంస్థలు వస్తువుల్ని ప్యాక్ చేసే విధానం ఇంకా చెల్లింపులపై పూర్తి అవగాహన ఉండటంతో అన్సారీతో కలసి మోసం చేయాలని కుట్ర పన్నాడు. మరిన్ని వివరాలు క్రింది స్లైడర్‌లో...

Read More : షియోమీ రెడ్మీ నోట్ 3 : 10 ముఖ్యమైన విషయాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌‌లకు చక్కుల చూపించిన కిలాడీ దొంగలు

ఈ ఇద్దరు కలిసి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వెబ్‌సైట్‌లలో క్యాష్ ఆన్ డెలివరీ పద్ధతుల్లో ఫోన్‌లు, కెమెరాలు, ల్యాప్‌టాప్‌లు ఇంకా ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను ఆర్డర్ చేసే వారు.

ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌‌లకు చక్కుల చూపించిన కిలాడీ దొంగలు

ఆయా వస్తువులను గోల్కండలోని యాహియా మహ్మద్ ఇషాకీ ఇంటికి డెలివరీ బాయ్స్ తీసుకువచ్చే వారు.

ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌‌లకు చక్కుల చూపించిన కిలాడీ దొంగలు

ఈ క్రమంలో ఇషాకీ వారి నుంచి పార్శిల్ తీసుకుని నగదు చెల్లించేందుకు డెబిట్ కార్డ్ తీసుకువస్తానంటూ లోపలికి వెళ్లే వాడు.

ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌‌లకు చక్కుల చూపించిన కిలాడీ దొంగలు

డెలివరీ బాయ్‌కు అనుమానం రాకుండా అన్సారీ ఇంటి బయట ఉండి అతడిని మాటల్లో పెట్టేసే వాడు. ఇంట్లోకి పార్శిల్‌ను తీసుకువెళ్లిన ఇషాకీ చాకచక్యంగా దానిని తెరచి అందులోని వస్తువును తీసేసేవాడు.

ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌‌లకు చక్కుల చూపించిన కిలాడీ దొంగలు

ఆ వస్తువకు సమాన బరువు ఉండే ఇసుకను ప్యాక్ చేసి బాక్సులో ఉంచి సీలింగ్ మిషన్ సాయంతో పార్శిల్‌ను యదా ప్రకారం సీల్ చేసేసే వాడు.

ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌‌లకు చక్కుల చూపించిన కిలాడీ దొంగలు

ఇలా ఆ రీప్యాక్ చేసిన పార్శిల్ తో పాటు బ్యాలెన్స్ లేని డెబిట్ కార్డును తీసుకుని బయటకు వచ్చేవాడు ఇషాకీ.

ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌‌లకు చక్కుల చూపించిన కిలాడీ దొంగలు

కార్డును డెలివరీ బాయ్‌కు ఇచ్చి స్వైప్ చేయమనేవాడు. మిషన్‌లో స్వైప్ చేసిన డెలివరీ బాయ్ అందులో బ్యాలన్స్ లేదని చెప్పేవారు.

ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌‌లకు చక్కుల చూపించిన కిలాడీ దొంగలు

దీంతో ఆ పార్శిల్‌ను తిరిగి డెలివరీ బాయ్స్‌కు అప్పగించేసే వాడు. ఇలా అనేక సార్లు వీరు ఫ్లిప్‌కార్ట్‌ను మోసం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌‌లకు చక్కుల చూపించిన కిలాడీ దొంగలు

ఇలా అనేక సార్లు వీరు ఫ్లిప్‌కార్ట్‌ను మోసం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అమెజాన్‌లో కూడా వీరు మోసాలకు పాల్పిడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌‌లకు చక్కుల చూపించిన కిలాడీ దొంగలు

ఫ్లిప్‌కార్ట్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన విచారణ జరిపిన పోలీసులు వీరి నుంచి కొన్ని ఫోన్‌లు, కెమెరా ఇంకా ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Hyderabad youths arrested for duping Flipkart, Amazon. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot