Azadi Quest: ఆన్‌లైన్ గేమ్స్ రూపంలో స్వాతంత్య్ర పోరాట చ‌రిత్ర‌!

|

భార‌త స్వాతంత్య్ర పోరాటాన్ని, పోరాట వీరుల త్యాగాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేలా.. కేంద్రం మ‌రో ముందడుగు వేసింది. పోరాట ధీరుల వీర‌త్వాన్ని నేటి త‌రానికి తెలియ‌జేసేలా ఆన్‌లైన్ మొబైల్ గేమ్స్‌ను ప‌రిచ‌యం చేసింది. 'ఆజాదీ క్వెస్ట్' (Azadi Quest) పేరుతో జింగా ఇండియా సహకారంతో అభివృద్ధి చేసిన ఈ ఆన్‌లైన్ ఎడ్యుకేషనల్ మొబైల్ గేమ్‌లను కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ప్రారంభించారు. మ‌న స్వాతంత్ర్య పోరాటానికి మన స్వాతంత్య్ర సమరయోధులు మరియు అసామాన్య వీరుల సహకారాన్ని గుర్తించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో ఇది భాగ‌మ‌ని అని ఠాకూర్ అన్నారు.

 
Azadi Quest: ఆన్‌లైన్ గేమ్స్ రూపంలో స్వాతంత్య్ర  పోరాట చ‌రిత్ర‌!

దేశ న‌లుమూల‌ల నుంచి స‌మాచార సేక‌ర‌ణ‌!
"నేటి జెన‌రేష‌న్ వారికి ఆన్‌లైన్ గేమ్‌ల‌పై మంచి ఆస‌క్తి ఉంది. కాబ‌ట్టి, ఈ మొబైల్ గేమ్‌ల ద్వారా స్వతంత్ర వీరుల గురించి నేటి జెన‌రేష‌న్ వారికి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. భారత ప్రభుత్వం యొక్క వివిధ శాఖ‌లు దేశం నలుమూలల నుండి అనేక మంది స్వాతంత్ర్య సమరయోధుల గురించిన‌ సమాచారాన్ని సేకరించాయి. ఈ ఆజాదీ క్వెస్ట్ అనేది ఎంతో జ్ణానాన్ని అందిస్తుంది. ఇది చాలా ఇంట‌రాక్టివ్‌గా ఉంటుంది." అని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర, జింగా ఇండియా కంట్రీ హెడ్ కిషోర్ కిచ్లీ తదితరులు పాల్గొన్నారు.

Azadi Quest: ఆన్‌లైన్ గేమ్స్ రూపంలో స్వాతంత్య్ర  పోరాట చ‌రిత్ర‌!

గేమింగ్ సెక్టార్‌లో టాప్ 5 దేశాల్లో భార‌త్‌!

భారతదేశంలో పెరుగుతున్న AVGC (యానిమేష‌న్‌, విజువ‌ల్ ఎఫెక్ట్‌, గేమింగ్ కామిక్‌) సెక్టార్‌పై ఠాకూర్ మాట్లాడుతూ, భారతదేశంలో AVGC రంగాన్ని పెంపొందించడానికి సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. గత కొన్నేళ్లుగా గేమింగ్ సెక్టార్‌లో టాప్‌ 5 దేశాల్లో భారత్‌ నిలిచింది. గేమింగ్ రంగం 2021లోనే 28% వృద్ధి చెందిందన్నారు. ఆన్‌లైన్ గేమర్‌ల సంఖ్య 2020 నుండి 2021 వరకు ఎనిమిది శాతం పెరిగిందని మరియు 2023 నాటికి అలాంటి గేమర్‌ల సంఖ్య 45 కోట్లకు చేరుకుంటుందని మంత్రి తెలిపారు.

Azadi Quest: ఆన్‌లైన్ గేమ్స్ రూపంలో స్వాతంత్య్ర  పోరాట చ‌రిత్ర‌!

ప్ర‌స్తుతం అందుబాటులోకి తెచ్చిన అజాదీ క్వెస్ట్ గేమింగ్‌ యాప్‌లు మన AVGC రంగం యొక్క సామర్థ్యాలను పెంపొందిస్తాయని మరియు అదే సమయంలో మన అద్భుతమైన చరిత్రను ప్రపంచం నలుమూలలకు తీసుకువెళతాయని ఆయన పేర్కొన్నారు. ఈ యాప్‌లలోని సమాచారం పబ్లికేషన్స్ డివిజన్ మరియు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ ద్వారా క్యూరేట్ చేయబడిందని వెల్ల‌డించారు. ఇది మన స్వాతంత్ర్య పోరాటంలో ప్రామాణికమైన సమాచారాన్ని సులభంగా యాక్సెస్ చేయగల నిధిగా మారుతుందని ఆయన అన్నారు.

చ‌రిత్ర‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లే గొప్ప ప్ర‌య‌త్నం!
జింగా ఇండియా హెడ్ కిషోర్ కిచ్లీ ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. "భారతదేశ గతాన్ని గౌరవించేలా ఈ ముఖ్యమైన ప్రయత్నంలో భాగమైనందుకు మేము గర్విస్తున్నాము. ఈ ప్ర‌య‌త్నం ద్వారా దేశ ప్ర‌జ‌ల‌ను ఒక‌టి చేయడమే జింగా స‌హ‌కారం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ముఖ్యమైన చ‌రిత్ర గురించి బోధనా అనుభవంగా ఇంటరాక్టివ్ ఎంటర్‌టైన్‌మెంట్ శక్తిని ఉపయోగించుకుంటూ అన్ని వయసుల గేమ‌ర్‌ల‌ను ఇందులో నిమగ్నం చేయడానికి ఇది రూపొందించబడింది," అని ఆయ‌న తెలిపారు.

 

హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో త్వ‌ర‌లో అందుబాటులోకి..
'ఆజాదీ క్వెస్ట్' సిరీస్‌లోని మొదటి రెండు గేమ్‌లు భారత స్వాతంత్ర్య పోరాట కథను చెబుతాయి, కీలకమైన మైలురాళ్లు మరియు హీరోలను హైలైట్ చేస్తూ, సరదాగా గేమ్‌ప్లేతో అల్లుకుని ఉన్నాయి. గేమ్‌లోని కంటెంట్ స‌ర‌ళంగా, స‌మ‌గ్రంగా ఉంటుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ నిపుణులచే ప‌రిశీల‌న ద్వారా, పబ్లికేషన్స్ విభాగం ప్రత్యేకంగా క్యూరేట్ చేసింది. భారతదేశంలోని Android మరియు iOS పరికరాల కోసం ఇంగ్లీష్ మరియు హిందీలో ప్రారంభించబడిన ఈ గేమ్‌లు సెప్టెంబర్ 2022లో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంటాయి.

Best Mobiles in India

English summary
I&B minister Anurag Thakur launches Azadi Quest, a series of online educational games based on India’s freedom struggle

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X