స్టీవ్ జాబ్స్ బయోగ్రఫీలో భారత్ గురించి ఏమన్నాడంటే

Posted By: Super

స్టీవ్ జాబ్స్ బయోగ్రఫీలో భారత్ గురించి ఏమన్నాడంటే

న్యూయార్క్: ప్రపంచానికి యాపిల్ ఉత్పత్తులను అందించిన యాపిల్ కంపెనీ సహా వ్యవస్దాపకుడు స్టీవ్ జాబ్స్ మరణాంతరం కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగులొకి వస్తున్నాయి. ఆ ఆసక్తికర విషయాలలో భారత్‌కు చోటు దక్కడం విశేషం. అది 1970వ సంవత్సరం. ఆ సందర్బంలో స్టీవ్ జాబ్స్ వీడియో గేమ్స్ తయారీ సంస్ద అటారీలో ఉద్యోగం చేస్తున్నారు. ఎందుకో గానీ అతనికి సడన్‌గా భారత్ రావాలని కొరిక పుట్టిందంట. అనుకున్నదే తడవుగా, ఉద్యోగానికి సెలవు పెట్టి భారత్ వచ్చి ఏడు నెలలు పాటు ఇండియాలో పర్యటించాడు.

ఆధ్యాత్మికత అన్వేషణలో భాగంగా స్టీవ్ జాబ్స్ భారత్‌లో గడిపిన ఈ ఏడు నెలల కాలం వృథాగా పోలేదు. భారతదేశం ఆయనకు జ్ఞానాన్ని నేర్పించింది. ఇటీవలే మరణించిన స్టీవ్ జాబ్స్ ఆత్మకథ రచించిన వాల్టర్ ఐజాక్‌సన్ ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. బౌద్ధంలో ఉండే సరళత్వమే స్ఫూర్తిగా జాబ్స్ డిజైన్లు ఉండేవని ఆయన చెప్పారు. ఈ కాలం వృథాగా పోలేదని జాబ్స్ పేర్కొన్నట్లు ఐజాక్‌సన్ తెలిపారు. ‘నేను అక్కడ ప్రధానంగా నేర్చుకున్నది సహజ జ్ఞానం. భారతీయులు కేవలం హేతుబద్ధంగా ఆలోచించడమే కాదు..ఎంతో జ్ఞానం కూడా కలిగినవారు’ అని జాబ్స్ అభిప్రాయపడినట్లు ఐజాక్‌సన్ పేర్కొన్నారు.

ఎటువంటి ఆడంబరాలు లేకుండా సామాన్యంగా ఉండే బౌద్ధంలోని అంశాలే జాబ్స్ డిజైన్ భావాలకు స్ఫూర్తినిచ్చాయన్నారు. హిప్పీయిజం, భౌతికవాదానికి మధ్య జాబ్స్ లోలోపల సంఘర్షణ నడిచేదని ఐజాక్‌సన్ పేర్కొన్నారు. ఇంటి గ్యారేజ్‌లో కంపెనీని ప్రారంభించిన జాబ్స్ .. ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించాలనుకున్నారని ఆయన వివరించారు. భారత్ నుంచి తిరిగి వెళ్లాకే జాబ్స్ తన మిత్రుడు స్టీవ్ వోజ్నియాక్‌తో కలిసి యాపిల్ కంప్యూటర్స్‌ను ఒక చిన్న గ్యారేజ్‌లో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత యాపిల్ సమ్రాజ్యం దేదీప్యమానంలా వెలిగి ఓ మహా వక్షంలా ఎదిగింది. ప్రస్తుతం యాపిల్ కంపెనీ హెడ్ క్వార్టర్స్ కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీగా భావించే కుపెర్టినోలో ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot