సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్లు ఒక్క క్లిక్‌‍తో కనెక్ట్ అవ్వాలంటే...

Posted By: Staff

సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్లు ఒక్క క్లిక్‌‍తో కనెక్ట్ అవ్వాలంటే...

శ్యామ్‌సంగ్ కంపెనీ తయారు చేసేటటుంటి అన్ని పరికరాలలోను తనదైన కొత్తదనాన్ని చూపిస్తుంటుంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో శ్యామ్‌సంగ్ కంపెనీ ప్రవేశపెట్టినటువంటి శ్యామ్‌సంగ్ గెలాక్సీ యస్ అనే ఫోన్ మంచి పేరును సంపాదించుకుంది. ముఖ్యంగా ఈ స్మార్ట్ పోన్ సోషల్ నెట్ వర్కింగ్ వైబ్ సైట్లు(ఫేస్ బుక్, ట్విట్టర్, ఆర్కూట్) లాంటివి కనక్ట్ అవ్వడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. శ్యామ్‌సంగ్ గెలాక్సీ యస్ ఒక్క మాటలో చెప్పాలంటే ఇది వన్ మ్యాన్ ఆర్మీ. శ్యామ్‌సంగ్ గెలాక్సీ యస్ అనేది మీ ఫోన్ నెంబర్స్, ఈ మెయిల్ ఐడీస్, సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ మాత్రమే కాకుండా ఛాట్ ఐడిస్‌ని కూడా కనక్ట్ అవ్వడానికి ఓ మంచి కమ్యూనికేషన్ టూల్ అంటున్నారు ఈ ఫోన్ వాడినటువంటి వారు.


ఈ ఫోన్ మీకు సంబంధించినటువంటి అన్ని ఐడీస్‌ని సేకరించి ఒక చోట ఉంచుతుంది. దీనినే సోషల్ హాబ్ అంటారు. ఈ సోషల్ హాబ్ వల్ల మీకు సంబంధించినటువంటి మాస్టర్ లిస్ట్ అంతా ఒకచోట ఉంటుంది. దానితో మీరు సింగిలి క్లిక్‌తోటి మీకు కావాల్సిన వారికి ఈ మెయిల్స్ పంపించడం కానీ, కాన్పరెన్స్ కాల్‌తో మాట్లాడడం కానీ, సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్లలలో అప్ డేట్స్ చేయడం కానీ చకా చకా జరిగిపోతాయి. ఇది మాత్రమే కాకుండా మెసేజ్ టైప్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటుందని అనుకుంటున్నారా.. ఈ విషయంలో మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దీనికున్నటువంటి కీబోర్డ్ స్లిప్పరీ టచ్ స్క్రీన్ కీబోర్డు.


శ్యామ్‌సంగ్ గెలాక్సీ యస్ ఫోన్ మీకు అందించేటుటవంటి టెక్నాలజీ స్వైప్ టెక్నాలజీ. ఈ స్వైపింగ్ టెక్నాలజీ వల్ల మీ చేతి వేలుని గనుక మీకు కావాల్సిన పదం మీద ఉంచితే ఆటోమోటిక్ మీరు ఫాస్ట్‌గా రాయగలుగుతారు. ఇక శ్యామ్‌సంగ్ గెలాక్సీ యస్ ఖరీదు విషయానికి వస్తే రూ Rs31,500 మాత్రమే.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot