వన్ ఇండియా పాఠకుల కోసం స్మార్ట్ పోన్స్ గురించిన సమాచారం

Posted By: Super

వన్ ఇండియా పాఠకుల కోసం స్మార్ట్ పోన్స్ గురించిన సమాచారం

మొబైల్స్ అంటే కొంత మందికి ప్రాణం.. నాకైతే మరీ ఇష్టం. ప్రస్తుతం మార్కెట్ అంతా ఫోన్స్ మీదనే నడుస్తుంది. అన్ని కంపెనీలు ప్రవేశపెట్టినటువంటి మొబైల్స్ సేమ్ అదే ఫీచర్స్‌తో ఉంటున్నాయి. అటువంటి తరుణంలో మనకు ఏ మొబైల్ కావాలో అర్దం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంది. అలాంటి వారందరి కొసం ప్రత్యేకంగా జల్లెడ వేసి మరీ మంచి మంచి స్మార్ట్ ఫోన్స్ ఏది ఎందులో బెస్ట్ చెక్ చేసి మరీ మీముందు ఉంచుతున్నాను. మీ బిజినెస్ ఉపయోగానికి ఎటువంటి స్మార్ట్ ఫోన్ ఐతే బాగుంటుందో ఈ ఆర్టికల్ చూసి షాపు నుండి తెచ్చుకోండి.. ఇంకెందుకు మరీ ఆలస్యం.. మోడళ్శను చూద్దామా..!!!

1. రఫ్‌గా హ్యాండిల్ చేయడానికి ఏ ఫోన్ బెస్ట్


నాకున్నటువంటి మొబైల్ పరిజ్ఞానాన్ని బట్టి మీకు మోటరోలా ఢెఫీ ఐతే బాగుంటుంది. మోటరోలా ఢెఫీని మీరు వాటర్‌లో వేసినా, బండ మీద వేసి గీకినా ఈ మొబైల్ చాలా గట్టిగా ఉంటుంది. కంపెనీ తయారు చేసిన ప్రకారం మోటరోలా ఢెఫీ వాటర్ రిసిస్టెంట్, స్క్రాచ్ ఫ్రూప్, స్మార్ట్ ఎల్‌సిడి టచ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇక మోటరోలా ఢెఫీ ఆండ్రాయిడ్ ఆపరెటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. మార్కెట్‌లో ప్రస్తుతం ఉన్న స్మార్ట్ ఫోన్స్‌లో ఇదే బెస్ట్ వాటర్ రెసిస్టెంట్. ఇక దీని తయారీ చూస్తే షైనీ బ్లాక్ మెటల్ కలిగి ఉండి, ఇరువైపులా ప్లాస్టిక్ గ్రిప్స్‌ని కలిగి ఉంటుంది. నాకు తెలిసి ఇందులో ఒకే ఒక్క డిపెక్ట్ ఏమిటంటే వాటర్‌లో టచ్ స్క్రీన్ పనిచేయదు. ఇక దీని ఖరీదు విషయానికి వస్తే రూ. 18,990 మాత్రమే.

2. ట్రావెల్స్ చేసేవారి కోసం ప్రత్యేకమైన జిపిఆర్‌యస్

ట్రావెలింగ్ చేసేవారి కోసం ప్రత్యేకంగా జిపిఆర్‌యస్ సిస్టమ్ ద్వారా రూపోందించ బడినటువంటి పోన్ నోకియా ఈ7 పోన్ ఐతే బాగుంటుంది. నోకియా ఈ7లో ఓవిఐ మ్యాప్స్ ఉండండవల్ల గూగుల్ మ్యాప్స్‌ని చాలా త్వరగా లోడ్ చేసుకునే ఫెసిలిటీ ఇందులో ఉంది. మీ మొబైల్‌లో ఇంటర్నెట్ కనక్షన్ పనిచేయకపోయినా నోకియా ఈ7 మొబైల్ ద్వారా మ్యాపింగ్ డేటా సపోర్టు చాలా సింపుల్‌గా ఉంటుంది. డైరెక్షన్స్‌ను టర్న్ చేసుకుంటుంటే ఈఫోన్‌లో ఉండే అనుభూతిని వర్ణంచలేం. ఇది మాత్రమే కాకుండా ఈ పోన్‌లో ఉన్నటువంటి సింపుల్ జిపియస్ రిసీవర్ వల్ల నోకియా ఈ7 జిపియస్ మ్యాప్స్ సర్వీసెస్ ఉన్న హ్యాండ్ సెట్స్‌లలో నెంబర్ వన్ కాగలిగింది. మీరు గనుక ఎక్కడైనా మీఫోన్‌ని పోగోట్టుకున్నట్లైతే మీపోన్‌లో ఉన్నటువంటి కంపాస్ వల్ల మీరు ఇట్టే మీఫోన్ ఎక్కడుందో పసిగట్టవచ్చు. ఇక దీని ఖరీదు విషయానికి వస్తే రూ. 29,999 మాత్రమే.

3. మీకు ఎక్కువ కాలం బ్యాటరీ వచ్చే ఫోన్


ఎక్కువ కాలం బ్యాటరీ వచ్చే స్మార్ట్ పోన్ మాత్రం ఐపోన్4. మీరు మీ ఫోన్‌కి నైట్ మొత్తం చార్జింగ్ పెట్టకుండా ఐదు గంటలు పాటు మీ స్మార్ట్ ఫోన్‌లో భారీగా ఛార్జింగా లాగేసేటటువంటి అప్లికేషన్స్(30నిమిషాలు పాటు వీడియో చూడడం, డౌన్ లోడ్ అప్లికేషన్స్, బ్లూటూత్ ద్వారా మ్యూజిక్ డౌన్ లోడ్) లాంటివి చేసి చూడండి.
ఇలా చేసినప్పటికీ కూడా మిమ్మల్ని మీ ఐఫోన్ 4 తర్వాత రోజు కూడా ఛార్జింగ్ అయిపోదు. దీనికి కారణం ఆపిల్ కంపెనీ ఐపోన్4కి వాడినటువంటి ప్రాసెసర్ అలాంటిది. మీరు మల్టిబుల్ అప్లికేషన్స్ చేస్తున్నప్పటికీ కూడా మీ మొబైల్‌లో బ్యాటరీ చార్జింగ్ మాత్రం దక్కిపోదు. ఇక దీని ఖరీదు విషయానికి వస్తే రూ. 35,500 మాత్రమే.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot