ఈమెయిల్స్‌ని ఎన్‌క్రిప్ట్‌ పద్ధతిలో సేవ్ చేయాలంటే బ్లాక్ బెర్రీ కర్వ్9300

Posted By: Staff

ఈమెయిల్స్‌ని ఎన్‌క్రిప్ట్‌ పద్ధతిలో సేవ్ చేయాలంటే బ్లాక్ బెర్రీ కర్వ్9300

BlackBerry Curve 9300:

కట్టుదిట్టమైన హెడ్‌సెట్‌ సెక్యూరిటీ లెవెల్స్‌తో మొబైల్‌ను తయారు చేశారు. సాధారణంగా డేటాని సురక్షితం చేయగానికి పాస్‌వర్డ్‌, కీబోర్డ్‌ లాక్‌ లాంటి వాటిని వాడతారు. కానీ దీంట్లో డేటా, ఈమెయిల్స్‌ని ఎన్‌క్రిప్ట్‌ పద్ధతిలో సురక్షితం చేసుకునే వీలుంది. బ్లాక్‌బెర్రీ సర్వర్ల నుంచి డేటా ప్రత్యేక కీతో ఎన్‌క్రిప్ట్‌ పద్ధతిలో మొబైల్‌ని చేరుతుంది. మొబైల్‌ను చేరిన తర్వాతే డీక్రిప్ట్‌ అవుతుంది.

మొబైల్‌లో సేవ్‌ చేసిన వ్యక్తిగత సమాచారం, మెయిల్స్‌, మెసేజ్‌లు, మెమోలను కూడా మొబైల్‌లోనే ఎన్‌క్రిప్ట్‌ చేసుకునే వీలుంది. మొబైల్‌ పోయినా డేటా తొలగించవచ్చు. ధర సుమారు రూ.17,500. ఈ మొబైల్‌కి ప్రత్యామ్నాయంగా మీరు ఆండ్రాయిడ్‌ ఓఎస్‌తో ఆధునిక మొబైల్‌ వాడుతున్నట్లయితే ఎన్‌క్రిప్ట్‌ అప్లికేషన్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకుని డేటాని సురక్షితం చేసుకోవచ్చు. అప్లికేషన్‌ ధర సుమారు రూ.1,000 ఉండొచ్చు.


DELL Venue Pro:

మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌ను మొబైల్‌లోనే వాడుకోవాలనుకుంటే 'వెన్యూ ప్రో'లో సాధ్యమే. డెల్‌ తయారీ అయిన దీన్ని విండోస్‌ సెవెన్‌ మొబైల్‌ ఓఎస్‌తో అందుబాటులోకి తెస్తున్నారు. 4.1 అంగుళాల టచ్‌స్క్రీన్‌ తెరను పైకి స్త్లెడ్‌ చేస్తే కీబోర్డ్‌ కనిపిస్తుంది. ఒకే టచ్‌తో ఆఫీస్‌ డాక్యుమెంట్‌లను ఎడిట్‌ చేయవచ్చు. ఎక్స్‌బాక్స్‌ లైవ్‌తో బుల్లి తెరపై పెద్ద ప్లేగ్రౌండ్‌ ప్రత్యక్షమయినట్టే. 1GHz ప్రాసెసర్‌ను వాడారు. 5 మెగాపిక్సల్‌ కెమేరా, ఆటోఫోకస్‌, లెడ్‌ ఫ్లాష్‌తో ఫొటోలు తీసుకోవచ్చు.

ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ మొబైల్‌ బ్రౌజర్‌తో వెబ్‌ విహారం సులభం. బింగ్‌, గూగుల్‌ మ్యాప్‌లను కూడా పొందొచ్చు. 8 జీబీ, 16 జీబీ మెమొరీ సామర్థ్యంతో అందిస్తున్నారు. ధర సుమారు రూ. 34,000. ఈ మొబైల్‌కి ప్రత్యామ్నాయంగా మీరు ఆఫీస్‌ సూట్‌తో అందుబాటులోకి వచ్చిన మరో మొబైల్‌ BlackBerry Bold 9700. చక్కని క్వర్టీ కీబోర్డ్‌తో పాటు DataViz Docs To Go ఆఫీస్‌ సూట్‌ను ఫ్రీఇన్‌స్టాల్‌తో పొందొచ్చు. ధర సుమారు రూ.25,000.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting