ఐబాల్ ల్యాప్ టాప్...ట్యాబ్లెట్ గా వాడుకోవచ్చు!

By: Madhavi Lagishetty

ప్రముఖ టెక్ ఉత్పత్తుల సంస్థ ఐబాల్..భారత మార్కెట్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. Compbook Aer3 పేరుతో సరికొత్త ల్యాప్ టాపన్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది.

ఐబాల్ ల్యాప్ టాప్...ట్యాబ్లెట్ గా వాడుకోవచ్చు!

ఐబాల్ కాంప్‌బుక్‌ Aer3 పూర్తి మెటాలిక్ మరియు స్లిమ్ బాడీతోపాటు గోల్డ్ కలర్ లో అద్భుతంగా రూపొందించబడింది. ఇంకా RDS3T టెక్నాలజీ (రోబస్ట్ డబుల్ స్పొండెల్ 360డిగ్రీ టెక్నాలజీ)తో వస్తుంది. Notebook, stand, tent, table ఇలా నాలుగు రకాల మోడ్స్ తో ల్యాపీని ఉపయోగించవచ్చు.

ఐబాల్ సీఈవో, డైరెక్టర్ సందీప్ పరాసంపంపరియా మాట్లాడుతూ...బడ్జెట్ ల్యాప్ టాప్స్ మార్కెట్లో ఎంతో సక్సెస్ సాధించిన తక్కువ సమయంలో, తదుపరి స్థాయిని తీసుకుంటే ఐబాల్ compbook Aer3 ఏ అద్భుతమైన ఎగ్జిక్యూటివ్ అయినా..ల్యాప్ టాప్ ను 30,000రూపాయలతో 15అద్భుతమైన ఫీచర్లతో కలిగి ఉంటుంది చెప్పారు.

ఐబాల్ ల్యాప్ టాప్...ట్యాబ్లెట్ గా వాడుకోవచ్చు!

మైక్రోసాఫ్ట్ ఇండియా కన్స్యూమర్ అండ్ డివైసెస్ సేల్స్ జనరల్ మేనేజర్ ప్రియదర్శి మొహాపాత్ర మాట్లాడుతూ..కొత్త ఐబాల్ compbook Aer3లో విండోస్ హలో ఫింగర్ ఫ్రింట్ స్కానర్ను ఏకీకరణ చేయడంపై మేము చాలా సంతోషిస్తున్నాము. ఎడ్జ్ బ్రౌజర్ మరియు ఇతర విండోస్ 10ఫీచర్స్ , విండోస్ హలో నేటి భద్రతా చేతన కార్యనిర్వాహకులకు అత్యంత సురక్షితమైన మరియు విశ్వసనీయ ల్యాప్ టాప్ ను అందిస్తాయి. ఎయిర్ 3 డిజైర్ , వినియోగం మరియు సెక్యూరిటీ అనేది గొప్ప కలయికగా చెప్పారు.

కొత్త ల్యాప్ టాప్ గురించి మరింత మాట్లాడుతూ...10పాయింట్ మల్టీ టచ్ డిస్ ప్లే మరియు 1920 x1080 ఫుల్ హెచ్ డి ఐపిఎస్ స్ర్కీన్లతో వస్తుంది. ల్యాప్ టాప్ 2.5 గిగా మరియు 4జిబి ర్యామ్ వేగంతో లెటేస్ట్ ఇంటెల్ పెంటియం క్వాడ్ కోర్ ప్రొసెసర్ చేత శక్తినిస్తుంది. మైక్రో ఎస్డి కార్డ్ ద్వారా 128జిబి వరకు ఇంటర్నల్ స్టోరెజితో ల్యాప్ టాప్ కూడా ఎం2 ఎస్ఎస్డి పొడగింపును అనుమతిస్తుందని కంపెనీ తెలిపింది.

Moto X4 లాంచ్ అయ్యింది, ప్రత్యేకతలివే

నెట్ వర్క్ కనెక్టివిటీని మద్దతు ఇచ్చే మల్టీ ఫంక్షనల్ టైప్ –సి పోర్ట్ తో ఈ ల్యాప్ టాప్ వస్తుంది. మీకు ఇష్టమైన పార్టులు, ఇతర డివైస్ లతో అనుసంధానించడం మైక్రో HDMI మరియు USB 3.0పోర్టులతో సౌకర్యవంతంగా ఉంటుంది. ఐబాల్ Compbook Aer3కి కూడా అనేక కనెక్టివిటీ ఆప్షన్స్ ఉంటాయి. దీనిలో భాగంగా ఇన్బిల్ట్ డ్యుయల్ బ్యాండ్, వై-ఫై మరియు బ్లూటూత్ ఉన్నాయి.

ఐబాల్ ల్యాప్ టాప్...ట్యాబ్లెట్ గా వాడుకోవచ్చు!

ఈ ల్యాప్ టాప్ పవర్ ఫుల్ క్వాడ్ స్పీకర్లతో తయారుచేయబడింది. 37wh లి-పాలిమర్ బ్యాటరీతోపాటుగా పవర్ సేవ్ ఫీచర్ను కలిగి ఉంది. దీంతో వినియోగదారులు ఎక్కువ సమయం పనిచేయడానికి సహాయపడుతుంది. విండోస్ హలో(క్విక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ –సీక్రెట్స్ సెక్యూర్డ్) ఫీచర్ కూడా ఉంది. ల్యాప్ టాప్ ను అన్లాక్ చేయడానికి మరియు యాక్సెస్ చేయడానికి మోస్ట్ సెక్యూర్ మార్గమని నిర్ధారిస్తుంది.

ఈ ఐబాల్ ల్యాప్ టాప్స్ ఇండియా అంతటా అన్ని ప్రముఖ రిటైల్ దుకాణాల్లో 29,999నుంచి 34,999ధరకు త్వరలో అందుబాటులోకి రానున్నాయి.

Read more about:
English summary
iBall has now introduced a new executive laptop in the market.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot