ఐబిఐబివో ఈకామర్స్‌కు కొత్త మేనేజింగ్ డైరెక్టర్

Posted By: Staff

ఐబిఐబివో ఈకామర్స్‌కు కొత్త మేనేజింగ్ డైరెక్టర్

ముంబై: ప్రముఖ ఇంటర్నెట్, మొబైల్ ప్రొడక్ట్ కంపెనీ అయిన ఐబిఐబివో అక్టోబర్ 7వ తారీఖున ఈ కామర్స్ బిజినెస్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌గా 'క్రిష్ణ మోతుకూరి'ని నియమించడం జరిగింది. గతంలో క్రిష్ణ మోతుకూరి లులు.కామ్, అమెజాన్.కామ్ లాంటి ప్రముఖ వెబ్ సైట్స్‌లకు అనుసంధానంగా పనిచేయడం జరిగింది. క్రిష్ణ మోతుకూరి ఐబిఐబివో ఈకామర్స్ బిజినెస్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌(బోర్డ్ పాట్నర్)గా ఉండడానికి ఒప్పుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు.

ఇక ఈ సందర్బంలో ఐబిఐబివో వెబ్ గ్రూప్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆశిష్ క్యాసఫ్ మాట్లాడుతూ క్రిష్ణ మోతుకూరికి ఈకామర్స్ రంగంలో మంచి ఎక్స్ పీరియన్స్ కలవాడని, ఆ ఎక్స్ పీరయన్స్‌ని అంతటిని కూడా ఐబిఐబివో కొత్తగా డెవలప్ చేయదలచుకున్న ఈకామర్స్ ప్రాజెక్టులకు ఉపయోగించుకుంటామని తెలియజేశారు. ఇకపోతే క్రిష్ణ మోతుకూరి ఆన్ లైన్ క్లాసిఫైడ్ ఫ్లాట్ ఫామ్స్ అయిన tradus.in, tradusads.comలకు ఇన్ ఛార్జ్‌గా ఉంటారని స్పష్టం చేశారు.

సౌత్ ఆఫ్రికాకు చెందిన నాస్ పర్స్, చైనాకు చెందిన ఇంటర్నెట్ కంపెనీ టెన్సెట్‌ల భాగస్వామ్యంతో ఐబిఐబివో కంపెనీని స్దాపించడం జరిగింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot