అద్బుతం.. చిన్న టేపులో 3,30,000 జీబీల డేటా

ఐబీఎమ్, సోనీ కంపెనీలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన చిన్న సైజు మాగ్నెటిక్ టేప్ కాట్రిడ్జ్ ఏకంగా 3,30,000 జీబీల డేటాను స్టోర్ చేసి సరికొత్త రికార్డును నెలకొల్పింది. డేటా స్టోరేజ్ విభాగంలో విప్లవాత్మక మార్పులకు కారణమైన ఈ మాగ్నెటిక్ టేప్ క్లౌడ్ స్టోరేజ్‌ ప్లాట్‌ఫామ్‌ల మనుగడను ప్రశ్నార్థకం చేసింది. మాగ్నటిక్ టేప్ డ్రైవ్స్ అనేవి గొత 60 సంవత్సరాల కాలంగా వాడకంలో ఉన్నాయి. కమర్షియల్‌గా వీటిని డేటాను స్టోర్ చేసుకునేందుకు వినియోగించటం జరుగుతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

330TBల డేటా..

1950లో అందుబాటులో ఉండే మాగ్నెటిక్ టేప్‌లు కేవలం 2-మెగాబైట్ డేటాను మాత్రమే భద్రపరచగలిగేవి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మాగ్నెటిక్ టేప్‌లు 15 టెరాబైట్స్ వరకు డేటాను స్టోర్ చేయగలుగుతున్నారు. ఈ నేపథ్యంలో సోనీ స్టోరేజ్ మీడియా సొల్యూషన్స్‌తో చేతులు కలిపిన ఐబీఎమ్ రిసెర్చర్స్ గత రికార్డులను తుడిచిపెట్టేస్తూ ప్రపంచంలోని డెన్సిస్ట్ టేప్ డ్రైవ్ ను అభివృద్ధి చేసారు. ఈ టేప్ డ్రైవ్ ఏకంగా 330TBల డేటాను స్టోర్ కంప్రెస్ చేయగలుగుతుంది. ఈ టేప్ డ్రైవ్ స్టోర్ చేయగలిగే డేటాను, ప్రస్తుతం అందుబాటులో ఉన్న అతిపెద్ద హార్డ్‌డ్రైవ్ కూడా చేయలదు.

మానిషి అద్భుత ఆవిష్కరణల్లో కంప్యూటర్ ఒకటి

ఈ ఆధునిక కమ్యూనికేషన్ ప్రపంచంలో కంప్యూటర్ లేని వ్యవస్థ, రంగం ఏదీ లేదు. మానిషి అద్భుత ఆవిష్కరణల్లో కంప్యూటర్ ఒకటి. యూవత్ ప్రపంచం కంప్యూటర్ రంగం పై దృష్టిసారిస్తోంది. విద్యా, వ్యాపారం, పారిశ్రామికం, డిజైనింగ్, ఇంజినీరింగ్, అంతరిక్ష పరిశోధన ఇలా అనేక రంగాల్లో కంప్యూటర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రపంచ అభివృద్థిలో కీలక పాత్ర పోషిస్తోన్న కంప్యూటర్ల గురించి పలు ఆసక్తికర విషయాలు....

మొదటి హార్డ్‌డ్రైవ్‌...

మొదటి హార్డ్‌డ్రైవ్‌ను 1979లో సృష్టించారు. ఈ హార్డ్‌డ్రైవ్ 5 ఎంబీ డేటాను మాత్రమే స్టోర్ చేయగలదు.

 

 

మొట్టమొదటి ఎలక్ట్రో మెకానికల్ కంప్యూటర్‌

ప్రపంచపు మొట్టమొదటి ఎలక్ట్రో మెకానికల్ కంప్యూటర్‌ను 1939లో అభివృద్థి చేసారు.

మొదటి ఐబీఎమ్ కంప్యూటర్

మొదటి ఐబీఎమ్ పీసీని అభివృద్థి చేసిన ఇంజినీర్లను ‘ద డర్టీ డజన్' అని కూడా పిలుస్తారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
IBM Announces Record Breaking New Data Storage Device. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot