15,000 ఉద్యోగాలకు ఐబీఎమ్ కోత!

Posted By:

టెక్నాలజీ దిగ్గజం ఐబీఎమ్, కంపెనీ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా అంతర్జాతీయంగా పలు ఉద్యోగాలకు కోత విధించనుంది. భారత్, ఐరోపా, బ్రెజిల్ ప్రాంతాల్లోని తమ కార్యాలయాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదపు 15,000మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనుందని పీటీఐ ఓ కథనాన్ని వెలువరించింది. ఐబీఎమ్‌ సంస్థల అంతర్జాతీయ సమన్వయకర్త లీ కాన్రాడ్ సదరు వార్తాసంస్థతో ఈ వివరాలను వెల్లడించారు. 2014 మొదటి క్వార్టర్‌‌లో బిలియన్ డాలర్ల పునర్‌వ్యవస్థీకరణను అమలు చేస్తామని కంపెనీ గత నెలలోనే వెల్లడించటం జరిగింది.

15,000 ఉద్యోగాలకు ఐబీఎమ్ కోత!

అమెరికాకు చెందిన ఐబీఎమ్ కంపెనీ సర్వర్లు ఇంకా స్టోరేజ్ సిస్టమ్స్ విక్రయాలలో ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించింది. ఇటీవల కాలంలో ఈ విక్రయాలు క్షీణించటంతో కంపెనీ పునర్‌వ్యవస్థీకరణ దిశగా అడుగులు వేస్తోంది. అమ్మకాలు క్షీణించిన నేపధ్యంలో కంపెనీకి చెందిన పైస్థాయి ఉద్యోగులు బోనస్‌లను కోల్పోవల్సి ఉంటుందని కంపెనీ వెల్లడించింది.

అంతర్జాతీయంగా ఐబీఎమ్ కంపెనీలలో 4 లక్షల సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. భారత్‌లో కంపెనీకి లక్షకు పైగా ఉద్యోగులున్న నేపధ్యంలో ఈ ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని భావిస్తున్నారు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot