298 కోట్ల కాంట్రాక్టు దక్కించుకున్నటెక్నాలజీ దిగ్గజం ఐబిఎం

Posted By: Staff

298 కోట్ల కాంట్రాక్టు దక్కించుకున్నటెక్నాలజీ దిగ్గజం ఐబిఎం

ఇండియా ఇన్ఫోలైన్ (ఐఐఎఫ్‌ఎల్) నుంచి తమకు రూ.298 కోట్ల విలువైన భారీ కాంట్రాక్టు లభించినట్లు టెక్నాలజీ దిగ్గజం ఐబిఎం వెల్లడించింది. ఈ కాంట్రాక్టు కింద ఐఐఎఫ్‌ఎల్ ఐటి వౌలిక సదుపాయాల మార్పిడి, ఐటి వ్యయ నిర్వహణ పనులను అమలు చేయాల్సివుంటుందని ఐబిఎణ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఆర్డరు ప్రకారం ఐఐఎఫ్‌ఎల్‌కు చెందిన 700 బ్రాంచీలు సహా ఐటి కార్యకలాపాలన్నిటిని ఐబిఎం టేకోవర్ చేస్తుంది. ఐదు డేటా కేంద్రాల్లో విస్తరించివున్న 450కి పైగా సర్వర్స్, తొమ్మిది లోకల్ సర్వర్ రూమ్స్, 15వేల ఎండ్ యూజర్ అసెట్స్‌ను ఐబిఎం నిర్వహణలోకి తీసుకుంటుందని ప్రకటన తెలియజేసింది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot