వంద సంవత్సరాల ఘనమైన చరిత్రలో తొలి మహిళ సిఈవో

Posted By: Super

వంద సంవత్సరాల ఘనమైన చరిత్రలో తొలి మహిళ సిఈవో

ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ మెషిన్స్‌ (ఐబిఎం) వంద సంవత్సరాలు చరిత్ర కలిగిన కంపెనీ. ఈ వంద సంవత్సరాలలో ఎప్పుడూ కూడా మహిళ సిఈవోని నియమించిన దాఖలా లేదు. కానీ ఒక్కోసారి చరిత్ర సృష్టించడం కోసమే కొంత మంది పుడతారు. అలాంటి చరిత్ర సృష్టించిన ఓ మహిళ గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఇంతకీ ఎవరా మహిళ అని అనుకుంటున్నారా.. 'ఐబిఎం' కి కొత్తగా సిఈవోగా నియమితులైన వర్జీనియా జినీ రోమెట్టి (54).

2002వ సంవత్సరం జనవరి నుండి సిఈవో బాధ్యతలను నిర్వహిస్తున్న శామ్‌ పల్మిసానో స్థానంలో చైర్మన్‌గా రోమెటీ బాధ్యతలు స్వీకరించను న్నారు. శామ్‌ పల్మిసానో వయసు ప్రస్తుతం 60 సంవత్సరాలు. ఇలా వర్జీనియా జినీ రోమెట్టి బాద్యతలను నిర్విర్తించడం వల్ల ప్రపంచంలో అతి పెద్దదైన రెండు టెక్నాలజీ కంపెనీలకు ఇద్దరు మహిళ సిఈవోలుగా కొనసాగడం జరుగుతుంది.

ఇటీవలే 'హెవ్లెట్ పాకార్డ్' కంపెనీ సిఈవోగా మెగ్ విట్ మ్యాన్ నియమితులైన విషయం తెలిసిందే. అంతక ముందు మెగ్ విట్ మ్యాన్ ఈబే కంపెనీ సిఈవోగా చేశారు. ఈ సందర్భంగా రోమెటీ మాట్లా డుతూ ఈ ఏడాది ఐబిఎం వాటాలు నికర లాభాల బాటన నడిచేలా వ్యవహరించానన్నారు. కెరీర్‌లో ఎప్పటికపుడు నూతన సవాళ్లను అధిగమిస్తూ సాగుతున్నానని రోమెటీ చెప్పారు. విక్రయాలు, సేవలు, పల్మిసానో నిర్దేశించిన వ్మూహాత్మక దిశలో సేవలను సొంతం చేసుకోవడం వంటి కారణాలతో గత సంవత్సరం ఐబిఎం ఆదాయం 20బిలియను డాలర్ల మేర పెరిగింది. కంపెనీ లాభాల బాట పట్టడానికి దోహదకారిగా నిలచిన రోమెటీని సిఈవోగా చేసి ఐబిఎం గుర్తించినట్లయింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot