సూపర్ కంపూటర్స్ లిస్ట్ 2011 టాప్ లో ఐబిఎమ్

Posted By: Staff

సూపర్ కంపూటర్స్ లిస్ట్ 2011 టాప్ లో ఐబిఎమ్

న్యూఢిల్లీ: టెక్నాలజీ గెయింట్ ఐబిఎమ్ 2011వ సంవత్సరానికి గాను ఇండియన్ టాప్ సూపర్ కంప్యూటర్స్ లిస్ట్‌లో మొట్టమొదటి స్దానాన్ని కైవసం చేసుకుందని సూపర్ కంప్యూటర్ రీసెర్చ్ సెంటర్(SERC) వెల్లడించింది. ఇండియా మొత్తం మీద పదహారు ఇనిస్టాలేషన్స్ చేసిన సమయంలో ఐబిఎమ్ హై ఫెర్పామెన్స్ కంప్యూటింగ్(HPC)లో నెంబర్ వన్ స్దానాన్ని దక్కించుకుంది. ఈ సందర్బంలో సూపర్ కంప్యూటర్ రీసెర్చ్ సెంటర్ వారు మాట్లాడుతూ పదహారు ఎంట్రీలలో ఐబిఎమ్ తక్కువ ఫెర్పామెన్స్ 3.11 TFlopsగా నమోదు కావడం జరిగిందన్నారు.

ఐబిఎమ్ ఇనిస్టాలేషన్స్ లలో దేశంలో ఎక్కడెక్కడ జరిగాయంటే ఇండియన్ ఇనిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు, ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్ మెంట్ ఢిల్లీ, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్పర్మేషన్ సర్వీసెస్ హైదరాబాద్. ఇక్కడ సబ్రామ్ నటరాజన్(ఐబిఎమ్ ఇండియా/ఎగ్జిక్యూటిన్(డీప్ కంప్యూటింగ్, సిస్టమ్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్))మాట్లాడుతూ ఐబిఎమ్ ఇనిస్టాలేషన్స్ ప్రవేశపెట్టినటువంటి అన్నిచొట్ల క్లయింట్స్ కోరినటువంటి హై ఫెర్పామెన్స్ కంప్యూటింగ్ సోల్యూషన్స్‌ని అందుకోవడం జరిగిందని తెలిపారు.

ఇండియా టాప్ సూపర్ కంప్యూటర్స్ లిస్ట్ 2011లో రెండవ స్దానాన్ని హెచ్‌పి ఐదు ఇనిస్టాలేషన్స్‌తో సోంతం చేసుకుంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot