ఫ్రీ.. ఫ్రీ.. క్రికెట్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. ఛాంపియన్స్ ట్రోఫీ లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ వచ్చేశాయ్!
ICC Champions Trophy 2025: క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్. ఎనిమిదేళ్ల తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మళ్లీ వచ్చేస్తోంది. నేడు అంటే ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు పాకిస్థాన్, దుబాయ్ వేదికగా ఈ టోర్నీ జరగనుంది. మ్యాచ్‌లన్నీ లైవ్‌లో చూడటం ఎలా అని వర్రీ అవుతున్నారా, అలా చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జియోసినిమా (JioCinema) అఫీషియల్ స్ట్రీమింగ్ పార్ట్‌నర్‌గా వచ్చేసింది. మొబైల్‌లో మ్యాచ్‌లని ఉచితంగా లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు.
అయితే ఉచితంగా చూసేవాళ్లకి 480p రిజల్యూషన్‌లో మాత్రమే మ్యాచ్‌లు వస్తాయి. అంటే హెచ్‌డీ క్వాలిటీ ఉండదు. కానీ భాషా ప్రేమికులకు జియోసినిమా అదిరిపోయే ఆప్షన్ ఇచ్చింది. హిందీ, ఇంగ్లీష్‌తో పాటు మన తెలుగులో కూడా కామెంట్రీ వింటూ మ్యాచ్‌ని ఎంజాయ్ చేయొచ్చు.

అంతేకాదు, తమిళ్, కన్నడ, బెంగాలీ, మరాఠీ, భోజ్‌పురి, హర్యానీ భాషల్లోనూ చూడొచ్చు. మీకు ఇంకా మంచి క్వాలిటీ కావాలంటే, జియోసినిమాలో అదిరిపోయే ప్లాన్స్ కూడా ఉన్నాయి. జియోసినిమా మూడు రకాల సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్‌తో మీ ముందుకు వచ్చింది. అవేంటంటే.. వీడియో క్వాలిటీ, ఎన్ని డివైజ్‌లలో చూడొచ్చు అనే దానిపై ఈ ప్లాన్స్ ఆధారపడి ఉంటాయి.
* మొబైల్ ప్లాన్ విషయానికొస్తే..
ఇది 3 నెలలకు రూ.149 లేదా ఏడాదికి రూ.499 మాత్రమే. ఇందులో 720p HD క్వాలిటీ వీడియోతో మొబైల్‌లో క్రికెట్ గేమ్ చూడొచ్చు. ఒకవేళ మీకు ఫుల్ HD క్వాలిటీ కావాలి, ఇంకా ల్యాప్‌టాప్, టాబ్లెట్, స్మార్ట్ టీవీల్లో కూడా చూడాలనుకుంటే సూపర్ ప్లాన్ (Super Plan) బెస్ట్ ఆప్షన్.
ఇది 3 నెలలకు రూ.299, లేదా ఏడాదికి రూ.899. ఇందులో 1080p క్వాలిటీతో రెండు డివైజ్‌లలో మ్యాచ్ చూడొచ్చు. ప్రీమియం ప్లాన్ అయితే 4K రిజల్యూషన్‌తో అదిరిపోయే పిక్చర్ క్వాలిటీ అందిస్తుంది. స్మార్ట్ టీవీతో సహా ఏకంగా నాలుగు డివైజ్‌లలో చూడొచ్చు. ఈ ప్లాన్ నెలకి రూ.299, 3 నెలలకు రూ.499, లేదా ఏడాదికి రూ.1,499.
* మీకు సరిపోయే ప్లాన్ ఇలా సెలెక్ట్ చేసుకోండి..
లో-క్వాలిటీ ఓకే అనుకుంటే ఫ్రీగా 480pలో చూడొచ్చు. ఫోన్‌లో HD క్వాలిటీ కావాలంటే మొబైల్ ప్లాన్ బెస్ట్. పెద్ద స్క్రీన్‌పై ఫుల్ HD స్ట్రీమింగ్ కావాలంటే సూపర్ ప్లాన్ సూపర్ ఛాయిస్. 4K క్వాలిటీతో అదిరిపోయే ఎక్స్‌పీరియన్స్ కావాలి, అది కూడా చాలా డివైజ్‌లలో అనుకుంటే ప్రీమియం ప్లాన్ మీ కోసమే.
టీవీల్లో చూడాలనుకునే వాళ్లకి స్టార్ స్పోర్ట్స్ 2, స్పోర్ట్స్ 18 1, స్పోర్ట్స్ 18 1 HD, స్పోర్ట్స్ 18 2, స్పోర్ట్స్ 18 2 HD ఛానెల్స్‌లో లైవ్ మ్యాచ్‌లు వస్తాయి. మొబైల్‌లో గానీ, టీవీలో గానీ, లేదా హై క్వాలిటీ స్ట్రీమింగ్‌లో గానీ.. మీ ఇష్టం వచ్చినట్టు మ్యాచ్‌ని ఎంజాయ్ చేయొచ్చు.
క్రికెట్ అంటే మీ ఫ్రెండ్స్‌కి కూడా ఇష్టమైతే వారికి ఈ వార్తను తప్పకుండా షేర్ చేయండి. లవ్ లైవ్ మ్యాచ్ ఎక్కడ చూడాలి అని వారు వెతుకుతూ ఉంటే ఇది వారికి చాలా హెల్ప్ అవ్వచ్చు.


Click it and Unblock the Notifications








