మీ బ్యాంక్ అకౌంట్ల గుట్టురట్టు చేసే యాప్స్‌తో జాగ్రత్త !

By Anil
|

మన చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలు గూగుల్ ప్లే స్టోర్‌లో కెళ్లి రకరకాల యాప్స్ డౌన్‌లోడ్ చేస్తుంటాం. వాటిల్లో ఒరిజినల్ యాప్స్ ఏవో ఫేక్ యాప్స్ ఏవో తెలియకుండానే వాటిని డౌన్‌లోడ్ చేసేస్తుంటాం.ఈ రోజుల్లో ఇలాంటి ఫేక్ యాప్స్ మరీ ఎక్కువ అయ్యాయి వీటితో పాటు ఆన్ లైన్ మోసగాళ్లు కూడా పెరిగిపోయారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది . కొందరు మోసగాళ్లు ఫేక్ మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ ద్వారా క్రెడిట్ కార్డు యొక్క పరిమితిని పెంచుతూ అందులో ఉన్న డబ్బును దొంగలిస్తూ అకౌంట్ హోల్డర్స్ ను మరియు బ్యాంకులను మోసం చేశారు .పూర్తి వివరాల్లోకి వెళ్తే

 ICICI , RBL మరియు  HDFC బ్యాంకుల  ....
 

ICICI , RBL మరియు HDFC బ్యాంకుల ....

ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్ లో ICICI , RBL మరియు HDFC బ్యాంకుల ఫేక్ మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ ను కనుగొన్నారు.

CVV, గడువు తేదీలు మరియు ఖాతాదారుల పేర్లు వంటి  సమాచారాన్ని......

CVV, గడువు తేదీలు మరియు ఖాతాదారుల పేర్లు వంటి సమాచారాన్ని......

ఈ మోసగాళ్లు ఫేక్ మొబైల్ యాప్స్ ను ఉపయోగించి లావాదేవీ చేయడానికి అవసరమైన అకౌంట్ నేమ్,అకౌంట్ నెంబర్ , CVV, గడువు తేదీలు వంటి సమాచారాన్ని సేకరించడానికి లక్ష్యంగా చేసుకున్నారు.

ETSET నివేదిక ప్రకారం....

ETSET నివేదిక ప్రకారం....

ETSET ఇచ్చిన నివేదిక ప్రకారం, ఈ ఫేక్ మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ తో క్రెడిట్ కార్డు holders యొక్క క్రెడిట్ పరిమితిని పెంచడాన్ని మోసగాళ్లు లక్ష్యంగా చేసుకున్నారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఈ మోసగాళ్లు వివరాలను దొంగలించడమే కాక ఇంటర్నెట్ లో సమాచారాన్ని విడుదల చేసారు.

జూన్,జులై నెలల్లో.......
 

జూన్,జులై నెలల్లో.......

జూన్ మరియు జూలై నెలల కాలంలో ఈ ఫేక్ మొబైల్ యాప్స్ ప్లే స్టోర్ లో ఆవిష్కరించబడ్డాయి.ఒకటి తరువాత మరొకటి ఆలా వెంట వెంటనే ఆ 3 యాప్స్ నుంచి డబ్బులు దొంగలించి బడ్డాయి. ట్రేస్ అవుట్ చేయగా ఆ 3 యాప్స్ నుంచి దొంగిలించింది ఒక్కడే అని తేలింది.

బ్యాంకులు తరుచుగా ప్రచారం  చేస్తున్న....

బ్యాంకులు తరుచుగా ప్రచారం చేస్తున్న....

వ్యక్తిగత సమాచారం లేదా కార్డు వివరాలను ఎవరికీ ఇవ్వకండి అని ఎప్పటికప్పుడు బ్యాంకులు ప్రచారం చేస్తూనే ఉన్నాయి అయిన ప్రజలు దీనిని పట్టించుకోవట్లేదు.

గూగుల్ ఇలాంటి విమర్శలు ఎదురుకుంటూనే ఉంది.....

గూగుల్ ఇలాంటి విమర్శలు ఎదురుకుంటూనే ఉంది.....

వెబ్ దిగ్గజం గూగుల్ తమ గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉండే ఫేక్ యాప్స్ ను పరీక్షడం గురించి చాలా విమర్శలు ఎదురుకుంటూనే ఉంది. కాగా ఇలాంటి ఫేక్ యాప్స్ మరియు గేమ్స్ ను mission-mode ద్వారా ప్లే స్టోర్ లో పూర్తిగా తీసేయడం జరుగుతుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
ICICI, HDFC, RBL Credit Card Holders Duped Through Fake Banking Apps on Google Play Store.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X