Home
News

ICICI సెక్యూరిటీస్: రాబోయే రోజులలో జియోఫోన్‌తో గట్టిగా పోటీపడనున్న ఎయిర్‌టెల్

ప్రముఖ టెక్ సంస్థ గూగుల్ రిలయన్స్ జియోతో పోలిస్తే భారతీ ఎయిర్‌టెల్‌లో చాలా తక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టినప్పటికీ రిలయన్స్ జియో యొక్క సరసమైన 4G డివైస్ 'JioPhoneNext' కి బలమైన పోటీని ఇవ్వగలదు అని ICICI సెక్యూరిటీస్ ఒక సందర్భంలో పేర్కొంది. జియో మరియు ఎయిర్‌టెల్ రెండింటిలో గూగుల్ పెట్టుబడుల యొక్క ఉద్దేశ్యం భిన్నంగా ఉంటుంది. ఎయిర్‌టెల్‌తో సెర్చ్ ఇంజిన్ దిగ్గజం యొక్క భాగస్వామ్యం కొన్ని కీలక రంగాలపై దృష్టి సారిస్తుంది. ఇందులో మొదటిది 4G పరికరాలను సబ్సిడీల ద్వారా మరింత సరసమైనదిగా చేయడం మరియు జియో వంటి సొంత పరికరాలను తయారు చేయడం కాదు. రెండవది 5Gపై అధిక దృష్టితో నెట్‌వర్క్ వినియోగదారులను మరింత పెంచడం మరియు చివరిగా క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మరియు వాటి సేవలు అందుబాటులోకి తీసుకొనిరావడం. కేవలం ఎయిర్‌టెల్ మాత్రమే కాకుండా SMEల (చిన్న మరియు మధ్య తరహా ఎంటర్‌ప్రైజెస్)తో పాటు టెల్కో యొక్క బలమైన మొబైల్ సబ్‌స్క్రైబర్ బేస్‌ను గూగుల్ కూడా చొచ్చుకుపోగలదని ICICI సెక్యూరిటీస్ అభిప్రాయపడింది. దీనికి సంబందించిన మరిన్ని వివరాల గురించి తెలుసుకోవడానికి చదవండి.

SME విభాగంలో టెల్కోలకు భారీ అవకాశం

SME విభాగంలో టెల్కోలకు భారీ అవకాశం

మరిన్ని వ్యాపారాలు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లకు మారుతున్నందున SME విభాగంలో పెద్దగా ఉపయోగించబడని అవకాశం ఉందని విశ్లేషకులు తెలిపారు. భారతి ఎయిర్‌టెల్ ఇప్పటికే SMEల కోసం అనేక ఆఫర్‌లను కలిగి ఉంది. టెల్కో ఇప్పటికే నిపుణులు మరియు చిన్న వ్యాపారాల కోసం గూగుల్ నుండి ప్రోడక్ట్ బండిల్ అయిన G-Suiteని అందిస్తోంది. గూగుల్ కంపెనీలో ఇప్పుడు 1.28% ఈక్విటీ వాటాను కలిగి ఉంది. కాబట్టి సెర్చ్-ఇంజిన్ దిగ్గజం ఎయిర్‌టెల్ తన ఉత్పత్తులను దూకుడుగా ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడుతుందని ఐసిఐసిఐ సెక్యూరిటీస్ తెలిపింది.

ఎయిర్‌టెల్

భారతీ ఎయిర్‌టెల్ యొక్క పెరుగుతున్న డేటా సెంటర్ బిజినెస్ నుండి గూగుల్ కూడా ప్రయోజనం పొందుతుంది. ఎయిర్‌టెల్ తన డేటా సెంటర్ బిజినెస్ ను ‘Nxtra by Airtel' పేరుతో నిర్వహిస్తోంది. ఈ భాగస్వామ్యం భారతీయులను నేరుగా ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే రెండు కంపెనీలు వినియోగదారులకు 4G స్మార్ట్‌ఫోన్‌లను మరింత సరసమైనవిగా మరియు దేశంలో డిజిటల్ స్వీకరణను పెంచుతాయి.

ఎయిర్‌టెల్‌లో

గూగుల్ సంస్థ గత వారంలో భారతీ ఎయిర్‌టెల్‌లో 1 USD బిలియన్ కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. కంపెనీలో 1.28% వాటాను $700 మిలియన్లకు కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. అంతేకాకుండా మిగిలిన $300 మిలియన్లు బహుళ-సంవత్సరాల ఒప్పందాలను రూపొందించడానికి ఉపయోగించబడుతుందని ప్రకటించింది. పైన పేర్కొన్న విషయాలను అభివృద్ధి చేయడం కోసం ఉపయోగించనున్నది. ఒప్పందంలో భాగంగా ఎయిర్‌టెల్‌లోని 71,176,839 షేర్లను గూగుల్ ఈక్విటీ షేరుకు రూ.734 ధర చొప్పున కొనుగోలు చేస్తుంది.

గూగుల్- ఎయిర్టెల్ డీల్

గూగుల్- ఎయిర్టెల్ డీల్ విభాగం కింద తన మొదటి వాణిజ్య ఒప్పందంలో భాగంగా వినూత్న సరసమైన ప్రోగ్రామ్‌ల ద్వారా వినియోగదారులకు అనేక రకాల పరికరాలను కవర్ చేసే ఎయిర్‌టెల్ ఆఫర్లను స్కేల్ చేయడానికి ఇది పని చేస్తుందని గూగుల్ ఇండియా తెలిపింది. రెండు కంపెనీలు కలిసి 5G మరియు ఇతర ప్రమాణాల కోసం భారతదేశ-నిర్దిష్ట నెట్‌వర్క్ డొమైన్ వినియోగ కేసులను కూడా సృష్టిస్తాయి. అంతేకాకుండా 'దేశవ్యాప్తంగా చిన్న మరియు మధ్యస్థ వ్యాపారాల డిజిటల్ పరివర్తన ప్రయాణాలను వేగవంతం చేయడం' కోసం దేశం యొక్క క్లౌడ్ మౌలిక సదుపాయాలను విస్తరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

More from GizBot

Best Mobiles in India

English summary
ICICI Securities: Airtel to Compete With Jiophone in The Coming days
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X