జియో కొత్త ప్లాన్ దెబ్బ, భారీ నష్టాలతో ఐడియా, ఎయిర్‌టెల్

ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ కొత్త పోస్టుపెయిడ్‌ ప్లాన్‌ రూ.199తో టెలికాం దిగ్గజ కంపెనీలు ఎయిర్‌టెల్‌, ఐడియాలకు షాకిచ్చిన సంగతి తెలిసిందే.

|

ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ కొత్త పోస్టుపెయిడ్‌ ప్లాన్‌ రూ.199తో టెలికాం దిగ్గజ కంపెనీలు ఎయిర్‌టెల్‌, ఐడియాలకు షాకిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా తీసుకొచ్చిన ఈ ప్లాన్‌పై అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, ఎస్‌ఎంఎస్‌, డేటా ప్రయోజనాలతో పాటు అంతర్జాతీయ కాలింగ్‌ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. కాగా జియో తీసుకువచ్చిన ఈ ప్లాన్ దెబ్బకు భారతీ ఎయిర్‌టెల్‌, ఐడియా సెల్యులార్‌లు ఒక్కసారిగా ఢమాల్‌మన్నాయి. శుక్రవారం ఒక్కరోజే ట్రేడింగ్‌ సెషన్‌లో ఐడియా షేర్లు 8.1 శాతం మేర క్షీణించాయి. ఇది 2011 ఫిబ్రవరి నాటి కనిష్ట స్థాయిలుగా ఉన్నాయి.

jio

అదేవిధంగా ఎయిర్‌టెల్‌ షేర్లు కూడా 5.8 శాతం కిందకి పడిపోయాయి. ఇప్పటికే తీవ్రంగా నష్టపోతున్న ఈ టెలికాం కంపెనీలను, ఎప్పడికప్పుడూ జియో దెబ్బతీస్తూనే ఉంది. ప్రస్తుతం జియో తీసుకొచ్చిన ఈ ప్లాన్‌కు కౌంటర్‌గా తాము ఎలాంటి ప్లాన్‌లను ప్రకటించాలి? అని కంపెనీలు యోచిస్తున్నాయి.

మరోసారి దుమ్మురేపిన అంబాని, జియో ఉచిత జీరో టచ్ సేవలుమరోసారి దుమ్మురేపిన అంబాని, జియో ఉచిత జీరో టచ్ సేవలు

త్వరలోనే ఈ కంపెనీలు కూడా కొత్త ప్లాన్లను ప్రకటించే అవకాశాలున్నాయని జెఫెరీస్‌ పేర్కొంది. దీంతో ఒక్కో యూజర్‌తో పొందే సగటు రెవెన్యూ పడిపోనుంది. ఒకవేళ పోస్టు పెయిడ్‌ ధరల్లో 10 శాతం కోత పెడితే, ఈబీఐటీడీఏలు ఐడియావి 12 శాతం, ఎయిర్‌టెల్‌ కంపెనీలు 6 శాతం తగ్గిపోయే అవకాశాలున్నాయని జెఫెరీస్‌ తెలిపింది.

జీరో-టచ్ పేరుతో వినియోగదారుల కోసం రూ.199 ప్లాన్‌ను జియో లాంచ్ చేసింది. ఇందులో కస్టమర్లకు నెలకు 25జీబీ డాటాతోపాటు అంతర్జాతీయ కాలింగ్, రోమింగ్ ప్రయోజనాలు అందనున్నాయి.ఈ ప్లాన్‌ మే 15నుంచి అమల్లోకి వస్తుందని ఒక ప్రకటనలో జియో తెలిపింది. ఎలాంటి సబ్‌స్క్రిప్షన్‌, సెక్యూరిటీ డిపాజిట్లు లేకుండానే ఈ సదుపాయాన్ని కల్పిస్తోంది.

Best Mobiles in India

English summary
Idea, Airtel shares tank up to 12% on Reliance Jio post-paid plan More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X