రూ.346తో సంవత్సరమంతా ఐడియా 4జీ

భారతీ ఎయిర్‌టెల్ బాటలోనే ఐడియా సెల్యులార్ కూడా సరికొత్త ఆఫర్లను మార్కెట్లో అనౌన్స్ చేస్తోంది. తాజాగా అందుబాటులోకి తీసుకువచ్చిన ఆఫర్‌లో భాగంగా రూ.9,000 విలువ చేసే 3జీ/4జీ డేటాను ఏడాది పాటు తన ఖతాదారులకు ఇడియా ఆఫర్ చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల పై సంక్రాంతి డిస్కౌంట్‌లు

రూ.346తో సంవత్సరమంతా ఐడియా 4జీ.

ఎంపిక చేసిన ప్రీపెయిడ్ అలానే పోస్ట్ పెయిడ్ ప్లాన్‌లను ఎంపిక చేసుకోవటం ద్వారా ఈ ఆఫర్ వర్తిస్తుంది. 4జీ స్మార్ట్‌ఫోన్‌లను కలిగి ఉన్న ఐడియా పాత కస్టమర్‌లతో పాటు కొత్త కస్టమర్‌లకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని ఐడియా తెలిపింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.346 పెట్టి రీఛార్జ్ చేయించుకోవటం ద్వారా ..

Paytmలో కొత్త యాడ్ అయిన 5 ఫీచర్లు

ప్రీపెయిడ్ ఖాతాదారులు రూ.346 పెట్టి రీఛార్జ్ చేయించుకోవటం ద్వారా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్‌లతో పాటు 3జీబి 4జీ/3జీ డేటా లభిస్తుంది. కొత్త 4జీ ఫోన్‌ను కలిగి ఉన్న ఐడియా యూజర్లకు 1జీబి 4జీ డేటా అదనంగా లభిస్తుంది. 28 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ఆఫర్‌ను డిసెంబర్ 31, 2017 వరకు 13 రీఛార్జుల ద్వారా పొందవచ్చు.

రూ.499 పోస్ట్‌పెయిడ్ ప్లాన్..

పోస్ట్‌పెయిడ్ యూజర్ల కోసం రూ.499, రూ.999 రేంజ్‌లలో రెండు సరికొత్త ప్లాన్‌లను ఇడియా పరిచయం చేసింది. రూ.499 ప్లాన్‌లో భాగంగా 4జీ హ్యాండ్‌సెట్‌ను కలిగి ఉన్న యూజర్‌కు అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు 3జీబి 4జీ డేటాను కూడా పొందే అవకాశం ఉంటుంది. నాన్ 4జీ హ్యాండ్‌సెట్ యూజర్లకు మాత్రం కేవలం 1జీబి 3జీ డేటా మాత్రమే లభిస్తుంది.

రూ.11కే రోజంతా 4జీ ఇంటర్నెట్

రూ.999 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌

5100 mAh బ్యాటరీతో లెనోవో పీ2 ఫోన్ లాంచ్ అయ్యింది

రూ.999ప్లాన్‌లో భాగంగా 4జీ హ్యాండ్‌సెట్‌ను కలిగి ఉన్న ఐడియా యూజర్లకు అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు 8జీబి 4జీ డేటా లభిస్తుంది. నాన్ 4జీ హ్యాండ్‌సెట్ యూజర్లకు మాత్రం 5జీబి 3జీ డేటా లభిస్తుంది. ఈ రెండు ప్లాన్‌లలో ఉన్న యూజర్లకు అన్‌లిమిటెడ్ కాల్స్ ఇంకా ఇంటర్నెట్‌తో పాటు మూవీస్ ఇంకా మ్యూజిక్ సబ్‌స్ర్ర్కీప్షన్ కూడా ఉచితంగా లభిస్తుంది.

ఐడియా పోస్ట్ పెయిడ్ యూజర్లకు

పండక్కి రాబోతున్న 4 బ్లాక్‌‌బాస్టర్‌ ఫోన్‌లు

4జీ ఫోన్లకు మైగ్రేట్ అయ్యే ఐడియా పోస్ట్ పెయిడ్ యూజర్లకు రూ.499, రూ.999 ప్లాన్స్లో భాగంగా అదనంగా 3జీబి 4జీ డేటాను ఐడియా ఇవ్వనుంది. దీంతో రూ.499 ప్లాన్‌లో ఉన్నవారు నెలకు మొత్తంగా 6జీబి 4జీ డేటాను పొందే వీలుంటుంది. రూ.999 ప్లాన్‌లో ఉన్నవారు నెలకు మొత్తంగా 11జీబి 4జీ డేటాను పొందే వీలుంటుంది.

11జీబి 4జీ డేటా..

3జీబి 4జీ డేటా ఆఫర్‌ను పొందే క్రమంలో ఐడియా యూజర్లు తమ కొత్త 4జీ హ్యాండ్ సెట్ ద్వారా ఐడియా మొబైల్ ఇంటర్నెట్‌ను ఉపయోగించుకుని మై ఐడియా యాప్‌లో 4జీ హ్యాండ్ సెట్ సెక్షన్‌ను విజిట్ చేసి తదుపరి సూచనలను ఫాలో అవ్వాల్సి ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Idea announces additional data, unlimited voice calling for new and existing customers. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot