రూ.999 పెట్టి ఫోన్ కొంటే రూ.1000 క్యాష్‌బ్యాక్

|

మార్కెట్ పోటీని తట్టుకునే క్రమంలో జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ వంటి ప్రముఖ టెలికం సంస్థలు ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్‌ల పై క్యాష్‌బ్యాక్ ఆఫర్లను అందిస్తోన్న విషయం తెలిసిందే.

 
రూ.999 పెట్టి ఫోన్ కొంటే రూ.1000 క్యాష్‌బ్యాక్

తాజాగా ఈ జాబితాలోకి చేరిన ఐడియా సెల్యులార్, కార్బన్ బ్రాండ్‌కు చెందిన సెలెక్టెడ్ స్మార్ట్‌ఫోన్స్ అలానే ఫీచర్స్ ఫోన్స్ పై క్యాష్‌బ్యాక్ ఆఫర్లను అనౌన్స్ చేసింది. కార్బన్ ఫోన్‌ల పై వర్తించనున్న ఐడియా క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని ఆ సంస్థ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ శశి శంకర్ తెలిపారు.

స్మార్ట్‌ఫోన్‌ల పై లభించే క్యాష్‌బ్యాక్ ఆఫర్ల వివరాలు..

స్మార్ట్‌ఫోన్‌ల పై లభించే క్యాష్‌బ్యాక్ ఆఫర్ల వివరాలు..

ఐడియా అనౌన్స్ చేసిన క్యాష్‌బ్యాక్ ఆఫర్లలో భాగంగా ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కార్బన్ ఏ41, కార్బన్ ఏ9 స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేసే యూజర్లకు రూ.1500 క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంటుంది. అయితే, ఈ క్యాష్‌బ్యాక్ అనేది వెంటనే వారి అకౌంట్లో క్రెడిట్ అవ్వదు. ఫోన్ కొనుగోలు చేసిన 18 నెలలు తరువాత మొదటి ఇన్‌స్టాల్‌మెంట్ క్రింద రూ.500 యూజర్ అకౌంట్‌లో క్రెడిట్ అవుతుంది. ఆ తరువాత మరో 18 నెలలకు రెండవ ఇన్‌స్టాల్‌మెంట్ క్రింద రూ.1000 యూజర్ ఐడియా వాలెట్ అకౌంట్‌లో క్రెడిట్ అవుతుంది.

రెండు విడుతలుగా యూజర్ అకౌంట్‌లోకి..

రెండు విడుతలుగా యూజర్ అకౌంట్‌లోకి..

ఇదే సమయంలో కార్బన్ యువా 2 స్మార్ట్‌ఫోన్ పై ఏకంగా రూ.2000 వరకు క్యాష్‌బ్యాక్‌ను ఐడియా అందించనుంది. దీంతో రూ.4,999 ఖరీదు చేసే ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.2,999కే సొంతం చేసుకునే వీలుంటుంది. ఈ ఫోన్ పై లభించే క్యాష్‌బ్యాక్ అనేది రెండు విడుతలుగా యూజర్ అకౌంట్‌లో యాడ్ అవుతుంది.

రూ.169 పెట్టి రీఛార్జ్ చేసుకున్నట్లయితే...
 

రూ.169 పెట్టి రీఛార్జ్ చేసుకున్నట్లయితే...

ఫోన్ కొనుగోలు చేసిన 18 నెలలు తరువాత మొదటి ఇన్‌స్టాల్‌మెంట్ క్రింద రూ.500, ఆ తరువాత మరో 18 నెలలకు రెండవ ఇన్‌స్టాల్‌మెంట్ క్రింద రూ.1500 యూజర్ ఐడియా వాలెట్ అకౌంట్‌లో క్రెడిట్ అవుతాయి. క్యాష్‌బ్యాక్‌ను పూర్తిస్థాయిలో పొందాలనుకునే A41 Power, A9, Yuva 2 యూజర్లు 36 నెలలు పూర్తయ్యేలోపు నెలకు కొంత కొంత చొప్పున రూ.6000 విలువగల రీఛార్జ్‌ను చేసుకోవల్సి ఉంటుంది. ఈ ఫోన్‌లతో అందిస్తోన్న ఆఫర్లలో భాగంగా నెలకు రూ.169 పెట్టి రీఛార్జ్ చేసుకున్నట్లయితే రోజుకు 1జీబి 4జీ డేటాతో పాటు అన్‌లిమిటెట్ వాయిస్ కాల్స్ అందుబాటులో ఉంటాయి.

మీ ఫోన్‌లో మెసెంజర్‌ ఫోటోలు సేవ్ అవుతున్నాయా, ఇలా ఆఫ్ చేసేయండి ( సింపుల్ టిక్స్ )మీ ఫోన్‌లో మెసెంజర్‌ ఫోటోలు సేవ్ అవుతున్నాయా, ఇలా ఆఫ్ చేసేయండి ( సింపుల్ టిక్స్ )

ఫీచర్ ఫోన్‌ల పై లభించే క్యాష్‌బ్యాక్ ఆఫర్ల వివరాలు..

ఫీచర్ ఫోన్‌ల పై లభించే క్యాష్‌బ్యాక్ ఆఫర్ల వివరాలు..

ఐడియా అనౌన్స్ చేసిన క్యాష్‌బ్యాక్ ఆఫర్లలో భాగంగా కార్బన్ కే130ఎన్ (ఖరీదు రూ.999), కే24+ (ఖరీదు రూ.1199), కే9 జంబో (ఖరీదు రూ.1399) వంటి ఫీచర్ ఫోన్‌లను కొనుగోలు చేసే యూజర్లకు రూ.1000 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ ఫోన్‌లతో అందిస్తోన్న ఆఫర్లలో భాగంగా ఐడియా యూజర్లు నెలకు రూ.145 పెట్టి రీఛార్జ్ చేసుకున్నట్లయితే రోజుకు 0.5జీబి 4జీ డేటాతో పాటు అన్‌లిమిటెట్ వాయిస్ కాల్స్ అందుబాటులో ఉంటాయి. క్యాష్‌బ్యాక్ అనేది రెండు ఇన్‌స్టాల్‌మెంట్లుగా యూజర్ మెయిన్ అకౌంట్‌లో యాడ్ అవుతుంది.

Best Mobiles in India

Read more about:
English summary
Following into the footsteps of Vodafone and Airtel, Idea has also announced cashback offers on select smartphone and features phones from Karbonn.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X