కాల్ డ్రాప్ కంప్లైంట్స్‌తో సతమతమవుతున్న ఐడియా, బియస్‌ఎన్‌ఎల్

Posted By: Staff

కాల్ డ్రాప్ కంప్లైంట్స్‌తో సతమతమవుతున్న ఐడియా, బియస్‌ఎన్‌ఎల్

న్యూఢిల్లీ: ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంటూ యావత్ భారతదేశంలో ఎంతో మంది ఐడియా కంపెనీ కస్టమర్లను సంపాదించుకుంది. ఐతే ఐడియా కంపెనీ కస్టమర్లను సంపాదించుకున్నంత తర్వాత ఆ కస్టమర్ల బెంచ్ మార్క్‌ని విఫలం అయిందని కేంద్ర కమ్యూనికేషన్స్, ఐటి శాఖమంత్రి సచిన్ పైలెట్ వెల్లిడించారు. ముఖ్యంగా బియస్‌ఎన్‌ఎల్, ఐడియా రెండు ఎక్కువగా కాల్ డ్రాప్ కంప్లెంట్స్‌కి గురి అవుతున్నాయని అన్నారు.

ఈ విషయాన్ని లోక్‌సభలో సచిన్ పైలెట్ ప్రస్తావించడం జరిగింది. ఇండియాలో ఎక్కువ ఆదరణ ఉన్నటువంటి ఐడియా సెల్యులర్ కంపెనీపై ఇలాంటి కంప్లైంట్స్ రావడం ఇబ్బందిగా ఉందన్నారు. దీనితో పాటు బియస్‌ఎన్‌ఎల్, ఎట్సిలాట్ లాంటి సర్వీస్ ప్రోవైడర్స్ కూడా ఉన్నాయి. ఈవిషయాన్ని సచిన్ పైలెట్ లిఖిత పూర్వంగా లోక‌సభకు సమర్పించారు. ఇది మాత్రమే కాకుండా టెలికామ్ రెగ్యులేటరీ ఆధారిటీ ద్వారా ఎవరెవరు ప్రజలకు క్వాలిటీ సర్వీస్‌ని అందిస్తున్నారనే విషయాలను కూడా లోక్‌సభలో ప్రస్తావించడం జరిగింది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting