ఐడియా బుల్లెట్ ప్యాక్స్ వచ్చేశాయ్
దేశీయ టెలికాం రంగంలో వేడెక్కుతున్న టారిప్ వార్లు యూజర్లకు పండగ వాతావరణాన్ని కల్పిస్తున్నాయి.
దేశీయ టెలికాం రంగంలో వేడెక్కుతున్న టారిప్ వార్లు యూజర్లకు పండగ వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. పోటా పోటీగా కంపెనీలు ఆఫర్లు ప్రకటించడంతో వినియోగదారులు అత్యంత తక్కువ ధరలో దొరికే వాటిని ఎంచుకుంటూ ఇంటర్నెట్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జియోకు పోటీగా ఐడియా బుల్లెట్ ప్యాక్స్ పేరుతో రెండు సరికొత్త ప్లాన్లను లాంచ్ చేసింది.ఈ కొత్త ప్యాక్ ల ద్వారా మరింత డేటాను కంపెనీ అందించనుంది. రూ.92, రూ.53లతో కొత్త ప్యాక్ లను ప్రవేశపెట్టింది. యూజర్లు 93తో రీఛార్జ్ చేసుకోవడం ద్వారా 7రోజుల పాటు 6జిబి 3జీ 4జీ డేటా వినియోగదారులకు లభిస్తుంది. అలాగే రూ.53తో రీఛార్జ్ చేసుకోవడం ద్వారా 3జిబి డేటాను పొందవచ్చు. కాగా ఈ ప్లాన్లలో అపరిమిత కాల్స్ కూడా ఉంటాయి. అయితే అన్ లిమిడెట్ ప్లాన్లలో ఉన్నవారికి ఈ ప్లాన్లు వర్తించవు.

ఇదే రిలయన్స్ జియోలో అయితే రూ.11 నుంచి రూ. 101 వరకు ప్లాన్లు ఉన్నాయి. అదే Airtel విషయానికొస్తే ఇదే రేంజులో రూ.92 రూ49 ప్యాక్ లను ప్రవేశపెట్టింది. రూ. 92 ప్యాక్ ద్వారా 6జిబి 3జి/4జి డేటాను 7 రోజుల పాటు అలాగే రూ.49 ద్వారా 3జిబి డేటాను 3 రోజుల పాటు ప్రవేశపెట్టింది.
ఎయిర్‌టెల్ టారిఫ్ మాదిరిగానే 249 రూపాయలతో ఐడియా గత నెలలో కొత్త ప్యాక్‌ను తీసుకొచ్చింది. ఈ ప్యాక్ కింద ఐడియా రోజుకు 2జీబీ 3జీ లేదా 4జీ డేటాను, అపరిమిత వాయిస్ కాల్స్‌ను(రోమింగ్ కలిపి), ఉచిత ఎస్‌ఎంఎస్ ప్రయోజనాలను అందించనున్నట్టు పేర్కొంది. ఈ ప్యాక్ వాలిడిటీ 28 రోజులు. అంటే మొత్తంగా ఐడియా తన కస్టమర్లకు 56జీబీ డేటాను అందించనుంది. వాయిస్‌కాల్స్‌లో రోజుకు 250 నిమిషాలను, వారానికి 1000 నిమిషాలను మాత్రమే వెసులుబాటును ఐడియా కల్పిస్తుంది. ప్రస్తుతం ఈ ప్యాక్ ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.
ఎయిర్‌టెల్ లాంచ్ చేసిన ఈ రూ.249 ప్యాక్‌లో రోజుకు 2జీబీ 3జీ లేదా 4జీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను 28 రోజుల పాటు ఆఫర్ చేస్తోంది. దీని వాలిడిటీ కూడా 28 రోజులే. రిలయన్స్ జియో ఇవే ప్రయోజనాలను రూ.198కే అందిస్తోంది. అయితే ఐడియా తన రూ.249 ప్యాక్‌పై రోజువారీ, వారం వారీ కాలింగ్ పరిమితులను విధించగా.. ఎయిర్‌టెల్, జియోలు మాత్రం ఎలాంటి పరిమితులు విధించకుండా అపరిమిత కాల్స్‌ను ఆఫర్ చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications








