ఐడియా బఫెట్ ప్లాన్స్

Posted By: Prashanth

ఐడియా బఫెట్ ప్లాన్స్

 

తమ పోస్ట్‌పెయిడ్ సబ్‌స్క్రైబర్ల కోసం బఫెట్ ప్లాన్స్‌ను తీసుకువచ్చినట్లు ఐడియా సెల్యూలార్ తెలపింది. అత్యధికంగా వాయిస్, డేటాను వినియోగిస్తున్న కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని ఈ ప్లాన్‌ను 899 రూపాయల నుంచి ప్రారంభిస్తున్నట్లు ఐడియా సెల్యులర్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ శశి శంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్లాన్‌లో భాగంగా 4,000 లోకల్, ఎస్‌టిడి కాల్స్, 1,000 రోమింగ్ మొబైల్ మినిట్స్ సహా 450 లోకల్, నేషనల్ ఎస్ఎంఎస్‌లను అందిస్తున్నట్లు తెలిపింది. అలాగే అత్యధికంగా డేటా వినియోగిస్తున్న కస్టమర్ల కోసం వీటితో పాటు అదనంగా 5 జిబి 3జి డేటాను 1,299 రూపాయలకే అందించనున్నట్లు పేర్కొంది. ఇంతకంటే ఎక్కువ డేటాను వినియోగిస్తున్న కస్టమర్ల కోసం 10 వేల లోకల్, ఎస్‌టిడి కాల్స్, 8జిబి 3జి డేటా ప్లాన్‌ను 1,599 రూపాయలకు అందిస్తున్నట్లు ఐడియా తెలిపింది.

ఆమె బ్రా నుంచే కరెంట్.. ఇంకా మరెన్నో స్పెషల్స్ (గ్యాలరీ)!

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot