సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ తో దూసుకొస్తున్న ఐడియా
ప్రముఖ మొబైల్ ఆపరేటర్ ఐడియా యూజర్లకు సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ను ప్రవేశపెట్టింది.ఇతర టెలికాం సంస్థలకు పోటీగా సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ను యూజర్లకు అందిస్తుంది.
ప్రముఖ మొబైల్ ఆపరేటర్ ఐడియా యూజర్లకు సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ను ప్రవేశపెట్టింది . ఇతర టెలికాం సంస్థలకు పోటీగా సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ను యూజర్లకు అందిస్తుంది .ఈ ప్లాన్ లో భాగంగా రూ .227కే 28 రోజుల కాలపరిమితిని అందిస్తుంది. దీనితో పాటు సరి కొత్త రూ. 199 ప్లాన్ ను యూజర్లకు అందిస్తుంది. దీనితో పాటు మిస్డ్ కాల్ అలర్ట్స్ , అపరిమిత డయలర్ ట్యూన్ సబ్స్క్రిప్షన్ వంటి ఉచిత సేవలను కూడా అందిస్తోంది.

ఎయిర్టెల్ కు పోటీగా :
ఎయిర్టెల్ అందిస్తున్న రూ.219 ప్లాన్ కు పోటీగా Idea ఈ నిర్ణయం తీసుకుంది. ఐడియా అందిస్తున్న రూ.227 ప్లాన్ తో యూజర్లు అపరిమిత వాయిస్ కాల్స్ తో పాటు 100 sms లు ,మరియు రోజు 1.4GB 3G / 4G డేటాను పొందవచ్చు.

ఫ్రీ ట్రయల్ :
మొదటి 15 రోజులు ఫ్రీ ట్రయల్ పొందవచ్చు. ఫ్రీ ట్రయల్ అయినా 15 రోజుల తరువాత రూ.30 రీఛార్జ్ చేసుకుంటే మీ ప్లాన్ ను పొడగించవచ్చు. రూ.227 ప్లాన్ తో ఈ ఆఫర్ ఉచితంగా లభిస్తుంది.

టెలికాం రిపోర్ట్స్ :
టెలికాం రిపోర్ట్స్ ఇచ్చిన నివేదిక ప్రకారం 'ఫ్రీ కాంటెస్ట్' ప్లాన్ ను ఐడియా అందిస్తున్నట్టు తెలుస్తుంది . అలాగే వొడాఫోన్ రెడ్ హాట్ అందించిన అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు ఇతర ఉచిత సేవలను ఐడియా కూడా అందిచబోతుంది.

రూ. 199 ప్లాన్:
పైన పేర్కొన్న విధంగా రూ.227 ప్లాన్ తో 28 రోజుల కాలపరిమితిని అందిస్తుంది అలాగే ఫ్రీ డయలర్ టోన్ సర్వీస్ ను కూడా ఈ ప్లాన్ తో పొందవచ్చు. ఎయిర్టెల్ ఏప్రిల్ లో రూ .219 ప్లాన్ ను లాంచ్ చేసింది ప్లాన్ లో భాగంగా అపరిమిత వాయిస్ కాల్స్ తో పాటు 100 SMS, మరియు రోజు 1.4GB 3G / 4G తో పాటు ఫ్రీ మిస్డ్ కాల్ అలర్ట్స్ ,ఫ్రీ డయలర్ టోన్ అందిస్తుంది అయితే ఐడియా లో కూడా ఇదే ఆఫర్స్ రూ.227 ప్లాన్ తో పొందవచ్చు ఒక వేళా యూజర్లకు మిస్డ్ కాల్ అలర్ట్స్ అవసరం లేకపోతే రూ. 199 ప్లాన్ తో రీఛార్జి చేసుకుంటే సరిపోతుంది.


Click it and Unblock the Notifications