Home
News

జియోకు పోటీగా Idea VoLTE సర్వీస్

ముఖ్యమైన 4జీ సర్కిళ్లలో వాయిస్ ఓవర్ ఎల్టీఈ (VoLTE) సేవలను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ఐడియా తెలిపింది.

By Sivanjaneyulu Bommu

రిలయన్స్ జియోకు పోటీగా డిజిటల్ ఐడియా యాప్ సూట్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చిన ఐడియా సెల్యులార్ మరో షాకిచ్చే న్యూస్‌తో ముందుకొచ్చింది. త్వరలోనే తమకున్న అన్ని 4జీ సర్కిళ్లలో వాయిస్ ఓవర్ ఎల్టీఈ (VoLTE) సేవలను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ఐడియా తెలిపింది.

క్విప్‌మెంట్‌ను సమకూర్చుకునేందుకు

క్విప్‌మెంట్‌ను సమకూర్చుకునేందుకు

భారతదేశపు మూడవ అతిపెద్ద టెలికామ్ ఆపరేటర్ గా కొనసాగుతోన్న ఐడియా వాయిస్ ఓవర్ ఎల్టీఈ టెక్నాలజీకి అవసరమైన ఎక్విప్‌మెంట్‌ను సమకూర్చుకునేందుకు ఎరిక్సన్ అలానే నోకియాలతో సంప్రదింపులు జరుపుతున్న్లట్లు సమాచారం.

ఎయిర్‌టెల్ మరికొన్ని నెలల్లో

ఎయిర్‌టెల్ మరికొన్ని నెలల్లో

భారతదేశపు నెం.1 టెలికామ్ ఆపరేటర్‌గా కొనసాగుతోన్న ఎయిర్‌టెల్ మరికొన్ని నెలల్లో VoLTE సర్వీసులను తన కీలక మార్కెట్లలో అందుబాటులోకి తీసుకురాబోతోంది. మరోవైపు వొడాఫోన్ ఇప్పటికే తన VoLTE సర్వీసులకు సంబంధించి టెస్టింగ్ ను కూడా ప్రారంభించేసింది.

 రిలయన్స్ జియో ఒక్కటే..

రిలయన్స్ జియో ఒక్కటే..

ప్రస్తుత మార్కెట్ ట్రెండ్‌ను విశ్లేషించినట్లయితే రిలయన్స్ జియో ఒక్కటే పూర్తి స్ధాయిలో 4జీ VoLTE సేవలను ఆఫర్ చేస్తోంది. తాజాగా విడుదలైన గణంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 7.2 కోట్ల మంది జయో VoLTE సేవలను వినియోగించుకుంటున్నారు.

వాయిస్ కాల్స్ విషయానికి వచ్చేసరికి 2జీ నెట్‌వర్క్‌

వాయిస్ కాల్స్ విషయానికి వచ్చేసరికి 2జీ నెట్‌వర్క్‌

ఇతర టెలికం ఆపరేటర్ల విషయానికి వచ్చినట్లయితే డేటా కోసం మాత్రమే LTE నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుంటున్నారు. వాయిస్ కాల్స్ విషయానికి వచ్చేసరికి 2జీ నెట్‌వర్క్‌కు స్విచ్ అవ్వాల్సిన పరిస్ధితి. VoLTE నెట్‌వర్క్‌ను ఆఫర్ చేస్తున్న జియో మాత్రం వాయిస్ ఇంకా డేటాను అదే నెట్‌వర్క్‌‌లో ఆఫర్ చేయటం జరుగుతోంది.

సొంతంగా ఈ-కామర్స్ వెబ్‌సైట్‌

సొంతంగా ఈ-కామర్స్ వెబ్‌సైట్‌

ప్రస్తుతానికి ఐడియా సెల్యులార్, 11 సర్కిళ్లలో 4జీ సర్వీసులు ఆఫర్ చేస్తోంది. మరో 9 సర్కిళ్లలో మార్చి, 2017లోపు 4జీ సేవలను లాంచ్ చేస్తామని ఐడియా చెబుతోంది. ఐడియా తనకున్న 21 సర్కిళ్లలో 3జీ సేవలను ఆఫర్ చేస్తోంది. ఇవే కాకుండా ఐడియా సెల్యులార్ సొంతంగా ఈ-కామర్స్ వెబ్‌సైట్‌ను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ఈ పోర్టల్‌లో స్మార్ట్‌ఫోన్‌లతో పాటు మొబైల్ సర్వీసులను పొందవచ్చు.

Best Mobiles in India

English summary
Idea Cellular to launch VoLTE services. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X