Home
News

100 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో విరుచుకుపడుతున్న టెల్కోలు

దేశీ టెలికం పరిశ్రమలో ఇప్పుడు తీవ్రమైన పోటీ నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

By Hazarath

దేశీ టెలికం పరిశ్రమలో ఇప్పుడు తీవ్రమైన పోటీ నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. దిగ్గజాల మధ్య టారీఫ్ వార్ రోజు రోజుకీ వేడెక్కుతోంది. జియో రాకతో ఒక్కసారిగా కోట్ల నష్టాల్లోకి జారుకున్న కంపెనీలన్నీ ఇప్పుడు మెల్లగా లాభాల బాట పడుతున్నాయి. క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లతో విరుచుకుపడుతున్నాయి. ఈ నేఫథ్యంలోనే ఐడియా, జియోలు ఓ అడుగు ముందుకేశాయి.

జియో

జియో

రిలయన్స్‌ జియో తన రీఛార్జిలపై 100 శాతం క్యాష్‌బ్యాక్‌ను ప్రకటించింది. ప్రైమ్‌ యూజర్లు రూ.399, ఆపై టారిఫ్‌ల రీచార్జ్‌లపై ఈ ఆఫర్‌ను పొందొచ్చు.

ఎయిర్‌టెల్

ఎయిర్‌టెల్

ఇక ఎయిర్‌టెల్ కూడా ఇదే బాటలో నడుస్తోంది. రూ.349 రీచార్జ్‌పై క్యాష్‌బ్యాక్‌ ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఐడియా

ఐడియా

ఐడియా సైతం రూ.357తో రీచార్జ్‌ చేస్తే 100 శాతం క్యాష్‌బ్యాక్‌ అని ప్రకటించింది.

ఆఫర్ల అన్నింటికీ పరిమితులు

ఆఫర్ల అన్నింటికీ పరిమితులు

అయితే ఈ ఆఫర్ల అన్నింటికీ పరిమితులున్నాయి. రీ ఛార్జి తరువాత మొత్తం క్యాష్‌బ్యాక్ వచ్చినా దాన్ని యూజర్లు ఒకే సారి వినియోగించుకోలేరు. వరుసగా ఓ ఏడాదో, పదిసార్లో రీచార్జ్‌ చేస్తే ఆ మొత్తాన్ని వినియోగించుకోవచ్చు.

పరిమిత కాలం మాత్రమే వీటి ఆకర్షణ

పరిమిత కాలం మాత్రమే వీటి ఆకర్షణ

అయితే రానున్న కాలంలో క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు పనిచేయవని, పరిమిత కాలం మాత్రమే వీటి ఆకర్షణ ఉంటుందని ఐఐఎఫ్‌ఎల్‌ మార్కెట్స్, కార్పొరేట్‌ వ్యవహారాల ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సంజీవ్‌ భాసిన్‌ తెలిపారు.

టెలికం రంగంలో మూడు కంపెనీలు మాత్రమే..

టెలికం రంగంలో మూడు కంపెనీలు మాత్రమే..

రానున్న కాలంలో దేశీయ టెలికం రంగంలో మూడు కంపెనీలు మాత్రమే మిగులుతాయని అప్పుడు ఈ టారిఫ్ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపారు.  

విలీనం

విలీనం

ఐడియా, వొడాఫోన్‌ విలీనం, భారతీ ఎయిర్‌టెల్‌.. టాటా టెలీసర్వీసెస్‌ వైర్‌లెస్‌ విలీనం, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ తన 2జీ, 3జీ వాయిస్‌ బిజినెస్‌ మూసివేత ఇందులో భాగమేనని ఆయన తెలిపారు.

 

 

Best Mobiles in India

English summary
Idea Cellular Now Offers 100% Cashback on Rs.357 Unlimited Pack For Prepaid Customers More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X