మహేష్‌ బాబు.. అతిధి పాత్రలో?

Posted By: Staff

మహేష్‌ బాబు.. అతిధి పాత్రలో?

 

ఇదేదో సినిమా కధ కాదండోయ్.. ఐడియా ప్రవేశపెట్టిన ఓ ఆఫర్ లో భాగంగా సూపర్ స్టార్ మహేష్ అతిధి పాత్రలో మెరవనున్నారు. వివరాల్లోకి వెళితే.... ప్రముఖ మొబైల్ నెట్‌వర్క్ ప్రొవైడర్ ఐడియా సెల్యులార్ సర్వీసెస్, ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లోని తమ వినియోగదారులకు  సూపర్ స్టార్ మహేష్ బాబును కలుసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.  ఈ అవకాశాసాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునే ఐడియా యూజర్ తన ఐడియా నంబర్ నుంచి 55456340 నంబర్‌కు ఫోన్ చేసి వాల్యూయాడెడ్ సర్వీసులైన డయలర్‌టోన్, ఐడియా మ్యూజిక్ స్టేషన్, లైవ్ ఆస్ట్రోలజీ, మహేష్ బాబూ అడ్డా, ఎస్ఎంఎస్ కాంటెస్ట్‌ను ఎంచుకోవడం ద్వారా మహేష్ బాబును కలిసే పోటీలో పాల్గొనవచ్చని కంపెనీ తెలిపింది. ఈ నెల 31వ తేదీ వరకు ఐడియా3జీ  మ్యూజిక్ రీచార్జ్ 253 ప్యాక్‌ను ఎక్కువ సార్లు రీచార్జ్ చేసుకున్న ఇద్దరు కస్టమర్లు అలానే ఐడియా మ్యాజిక్ రీచార్జ్ 60ని యాక్టివేట్ చేసుకున్న వారు ప్రిన్స్‌ను కలుసుకునే అవకాశాన్ని సొంతం చేసుకుంటారని ఐడియా సెల్యులార్ (ఆంధ్రప్రదేశ్ సర్కిల్) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బి. రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.

టాప్-10 హిరోలు… ఫ్యాన్స్ ఎవరికి ఎక్కువ?

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot